అన్వేషించండి

Sai Rajesh: ఆనంద్ దేవరకొండతో 'బేబీ' దర్శకుడి కొత్త సినిమా... ఇమ్మూతో నెక్ట్స్ ప్లాన్!

Gam Gam Ganesha Pre Release Event: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, సాయి రాజేశ్ కాంబినేషన్ లో వ‌చ్చిన 'బేబీ' ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్ కాబోతుంద‌ని దర్శకుడు చెబుతున్నారు.

Director Sai Rajesh About His Next Movie With Anand Devarakonda: 'బేబీ'.. ఈ సినిమా ఎంత‌లా హిట్ అయ్యిందో అంద‌రికీ తెలుసు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య యాక్టింగ్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల ఆధారంగా ఈ సినిమా తీశాడు ద‌ర్శ‌కుడు సాయి రాజేశ్. అందుకే సూప‌ర్ హిట్ చేశారు ప్రేక్ష‌కులు. అయితే, ఇప్పుడు ఆ హిట్ కాంబో రిపీట్ అవ్వ‌బోతుంద‌ట‌. ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ సాయి రాజేశ్ స్వ‌యంగా చెప్పారు. 'గం గం గ‌ణేశా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయ‌న సినిమా గురించి ప్ర‌క‌టించారు. అయితే, ఈసారి ఎమోష‌న్ తో కాకుండా డిఫ‌రెంట్ గా వ‌స్తున్నామని అన్నారు సాయి రాజేశ్. 

ఈసారి కామెడీ జోన‌ర్ లో.. 

'హృదయ కాలేయం', 'బేబీ' సినిమాలు చేసిన సాయి రాజేశ్... హిందీలో బేబీ రీమేక్ చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. దాంతో పాటు మరో కొత్త సినిమా కూడా చేయనున్నారు. ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా మొత్తం కామెడీ జోన‌ర్ లో ఉండ‌బోతుంద‌ని చెప్పారు సాయి రాజేశ్. "కామెడీ సెన్స్ ఉన్న‌వాళ్లు, కామెడీ చేయ‌గ‌లిగిన వాళ్లు, రాయ‌గ‌లిగిన వాళ్లు ఎలాంటి సినిమా అయినా తీయొచ్చు అంటారు. అలాంటి టైమింగ్, కామెడీ సెన్స్ ఆనంద్ దేవ‌ర‌కొండ‌కి చాలా ఎక్కువ‌గా ఉంది. అందుకే, ఆనంద్ హీరోగా, ఎస్కేఎన్ ప్రొడ్యూస‌ర్ గా తీసే త‌ర్వాతి సినిమాకి ముంబైలో కూర్చుని క‌థ రాశాం. అప్పుడు అనిపించింది అర్రే మ‌ళ్లీ ఇదే ఎమోష‌న్ ఎందుకు ఆనంద్ దేవరకొండకి కామెడీ సినిమా ప‌డాలని మొత్తం క‌థ రీ రైట్ చేశాం. చివ‌రి అర‌గంట వ‌ర‌కు క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తాం. చాలా బాగా వ‌చ్చింది స్క్రిప్ట్. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని వెయిట్ చేస్తున్నాను" అని త‌ర్వాతి ప్రాజెక్ట్ గురించి చెప్పారు సాయి రాజేశ్. 

ఇమ్మూతో నెక్స్ట్ ప్లాన్.. 

'గం గం గ‌ణేశా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సాయి రాజేశ్ సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రు స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌బ‌ర్దస్త క‌మెడియ‌న్ ఇమాన్యుయెల్ గురించి ఆయ‌న మాట్లాడారు. ఇమాన్యుయెల్ కి మంచి టాలెంట్ ఉంద‌ని అన్నారు. అత‌నితో క‌లిసి ప‌ని చేయాల‌ని అనుకుంటున్నాన‌ని, త‌న కోసం ఏదైనా రాస్తే బాగుండు అనుకున్నాను అని మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు రాజేశ్. క‌చ్చితంగా క‌లిసి ప‌నిచేద్దాం అని చెప్పారు ఆయ‌న‌. 

క్రైమ్ కామెడీగా 'గంగం గ‌ణేశా'.. 

ఆనంద్ దేవ‌ర‌కొండ ఎక్కువగా ఫ్యామిలీ కథలు, ప్రేమకథలతో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్ టైన్ చేశాడు. అయితే, ఈసారి కొత్త‌గా క్రైమ్ కామెడీతో వ‌స్తున్నాడు.  అదే 'గంగం గ‌ణేశా'. మే 31న రిలీజ్ అవ్వ‌నున్న ఈసినిమాకి సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది టీమ్. ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాలో ఆనంద్ దేవ‌ర‌కొండ కొత్త‌గా క‌నిపించ‌నున్నారు. దీంతో సినిమా ఎలా ఉండ‌బోతుందో అని అంద‌రూ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. చూడాలి మ‌రి కామెడీ జోన‌ర్ లో ఆనంద్ ఎంత‌లా మెప్పిస్తాడో.

Also Read: 'జబర్దస్త్'లో స్మాల్ ఛేంజ్ - జడ్జ్ సీటు నుంచి ఇంద్రజ అవుట్, అసలు కారణం అదేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget