అన్వేషించండి
Advertisement
Adipurush: 'రాఘవ్'గా ప్రభాస్, 'ఆదిపురుష్' సంగతులు చెప్పిన డైరెక్టర్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ఓం రౌత్.. 'ఆదిపురుష్' సినిమా చేయాలనే ఆలోచన ఎలా పుట్టిందో చెప్పారు.
ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు దర్శకుడు ఓం రౌత్. ఈ సినిమా తీయాలని ఎందుకు అనిపించింది..? మొదట ప్రభాస్ తోనే చేయాలనుకున్నారా..? అనే విషయాలకు సమాధానాలు చెప్పుకొచ్చారు దర్శకుడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. 'ఆదిపురుష్' సినిమా చేయాలనే ఆలోచన ఎలా పుట్టిందో చెప్పారు. జపనీస్ ఫిల్మ్ మేకర్ యుగో సాకో 'ది ప్రిన్స్ ఆఫ్ లైట్' అనే పేరుతో రామాయణం యానిమేషన్ వెర్షన్ తీశారట. దాని స్క్రీనింగ్ కి వెళ్లినప్పుడు 'ఆదిపురుష్' సినిమా తీయాలనుకున్నట్లు చెప్పారు. ఎక్కడనుంచో వచ్చిన ఫారెనర్స్ రామాయణం లాంటి ఎపిక్ సబ్జెక్ట్ తో సినిమాలు తీస్తుంటే.. మనమెందుకు చేయకూడదనే ఆలోచనతో రామాయణాన్ని నా వెర్షన్ లో చెప్పాలనుకున్నట్లు ఓం రౌత్ తెలిపారు.
కరోనా ఫస్ట్ లాక్ డౌన్ సమయంలో రామాయణం ఆధారంగా ఉన్న స్క్రిప్ట్ ను రీరైట్ చేసి 45 రోజుల్లో 'ఆదిపురుష్' స్క్రిప్ట్ రెడీ చేసినట్లు చెప్పారు. ఆ సమయంలో తన మైండ్ ప్రభాస్ మాత్రమే ఉన్నాడని.. ఆయన మూడు సీన్లు వివరించగా.. వెంటనే పర్సనల్ కలుద్దామని పిలిచినట్లు గుర్తుచేసుకున్నారు. 'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు రాముడు కాదని.. రాఘవ్ అని చెప్పారు. అలానే కృతిసనన్ పాత్ర పేరు జానకి అని. సైఫ్ అలీ ఖాన్.. లంకేష్ పాత్రలో కనిపిస్తారని వివరించారు. తెలుగు, హిందీ భాషల్లో 'ఆదిపురుష్' సినిమాను రూపొందించామని.. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డబ్బింగ్ చేసినట్లు తెలిపారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
ఓటీటీ-వెబ్సిరీస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement