Ajay Bhupathi: అదితి ఫోటో షేర్ చేసిన సిద్ధార్థ్ - అసలేం జరుగుతుందంటూ డైరెక్టర్ భూపతి ట్వీట్!
హీరో, హీరోయిన్లు అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారు. తాజాగా వీరి ప్రేమాయణం గురించి దర్శకుడు అజయ్ భూపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
![Ajay Bhupathi: అదితి ఫోటో షేర్ చేసిన సిద్ధార్థ్ - అసలేం జరుగుతుందంటూ డైరెక్టర్ భూపతి ట్వీట్! director ajay bhupathi interesting comments about siddharth and aditi rao hydari love story Ajay Bhupathi: అదితి ఫోటో షేర్ చేసిన సిద్ధార్థ్ - అసలేం జరుగుతుందంటూ డైరెక్టర్ భూపతి ట్వీట్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/29/b9a554cbbada9dc127afa6f9ce4c60f11698571277857544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అందాల తార అదితి రావు హైదరీ, కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. పార్టీలకు, షికార్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరి ప్రేమాయణం గురించి దర్శకుడు అజయ్ భూపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వారి ప్రేమకు తానే కారణం అంటూ వ్యాఖ్యానించారు. ‘సమ్మోహనం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది హీరోయిన్ అదితిరావు హైదరి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం సినిమా పరిశ్రమలోనూ పలు సినిమాలు చేసింది. అన్ని చోట్లా చక్కటి నటనతో ఆకట్టుకంది. అభినయంతో పాటు అందంతోనూ ప్రేక్షకులను అలరించింది. ‘సైకో’, ‘అంతరిక్షం’, ‘హే సినామికా’ లాంటి చిత్రాలతో తెలుగ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అక్టోబర్ 28న జన్మించిన ఈ హైదరబాదీ బ్యూటీ తాజాగా తన 37వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది. ఈ పార్టీలో పలువురు సినీ తారలు, దగ్గరి మిత్రులు పాల్గొన్నారు.
గత కొంతకాలంగా సిద్ధార్థ్, అదితి ప్రేమాయణం
ఇక చాలా కాలంగా హీరో సిద్ధార్థ్ తో ఈ ముద్దుగుమ్మ లవ్ ట్రాక్ నడుపుతోంది. పార్టీలు, ఫంక్షన్లకు జంటగానే వెళ్తున్నారు. వాస్తవానికి అదితి, సిద్ధార్థ్ ‘మహా సముద్రం’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాను దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించారు. టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి సహజీవనం చేస్తున్నట్లు టాక్ వినిపించింది. వీరిద్దరూ కలిసి పలు వేడుకల్లో కనిపించడంతో నిజమేనని రుజువయ్యింది.
దీనంతటికీ కారణం నేనేనా?- అజయ్
తాజాగా అదితి బర్త్ డే సందర్భంగా సిద్ధార్థ్ శుభాకాంక్షలు చెప్పారు. ఈమేరకు తన ఇన్‌స్టాలో ఓ స్పెషల్ పోస్టు పెట్టారు. ఈ ఫోటోతో తమ మధ్య ఉన్న ప్రేమాయణం గురించి చెప్పుకొచ్చారు. ఈ ఫోటోను ‘మహాసముద్రం’ దర్శకుడు అజయ్ భూపతి షేర్ చేశారు. అంతేకాదు ఈ పోస్టుకు ఫన్నీ కామెంట్ పెట్టారు. “దీనంతటికి కారణం నేనేనా?” అంటూ రాసుకొచ్చారు. “దీనికి కారణం నేనే అని అందరూ అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతోంది??” అంటూ అదితి, సిద్ధార్థ్ ఉన్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం దర్శకుడు అజయ్ భూపతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
View this post on Instagram
Everyone thinks I'm the reason for this... What's actually happening?? 🤔#Siddharth @aditiraohydari pic.twitter.com/vcXQcMrmvu
— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2023
తాజాగా సిద్ధార్థ్ ‘చిన్నా’(చిత్తా) సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. తమిళంలో మంచి విజయం అందుకోవడంతో ఇతర భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టింది. అదితి ప్రస్తుతం ‘గాంధీ టాక్స్’, ‘లయనీస్’ చిత్రాలతో బిజీగా ఉంది.
Read Also: లవ్ ఫెయిల్యూర్తో మంచే జరిగింది, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)