By: ABP Desam | Updated at : 27 Jan 2022 10:47 AM (IST)
హరీష్ శంకర్, 'దిల్' రాజు
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, సూపర్ డూపర్ హిట్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్‌ది హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'డీజే - దువ్వాడ జగన్నాథం' సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి మరోసారి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అయితే... అది సినిమా కాదు, ఓ వెబ్ సిరీస్. దానికి హరీష్ శంకర్ రచయిత. అలాగే, నిర్మాత కూడా! ఈ వెబ్ సిరీస్ కథా కమామీషు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
హరీష్ శంకర్ రాసిన కథ ఆధారంగా రూపొందుతున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఎటిఎం'. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ రోజు వెబ్ సిరీస్‌ను అధికారికంగా ప్రకటించారు. 'రాబరీ బిగిన్స్ సూన్' (దోపిడీ త్వరలో మొదలు అవుతుంది) అని ఆ పోస్టర్ మీద పేర్కొన్నారు. అలాగే, 'దొంగతనం పక్కా' అంటూ మరో సోషల్ మీడియాలో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ ఎటిఎం దోపీడీ ఆధారంగా హరీష్ శంకర్ థ్రిల్లింగ్ కథ రాసినట్టు తెలుస్తోంది. సి. చంద్ర మోహన్ స్క్రీన్ ప్లే రాయడంతో పాటు దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్‌ను 'జీ 5' ఓటీటీ కోసం రూపొందిస్తున్నారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, హరీష్ శంకర్ .ఎస్ నిర్మిస్తున్న ఒరిజినల్ సిరీస్ ఇది.
Happy to join hands with @harish2you garu and @ZEE5Telugu for a thrilling heist in the city of Hyderabad. #ATM Web Series Shoot Begins Soon !!
— Dil Raju Productions (@DilRajuProdctns) January 27, 2022
దొంగతనం పక్కా!? pic.twitter.com/q2anc726JI
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Sangeetha Sajith Demise: కిడ్నీ సమస్యతో ప్రముఖ గాయని మృతి
Thank You: 'థాంక్యూ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్
Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?