News
News
X

Dhanush Sir Release Date : రిలీజ్ డేట్ మారలేదు 'సార్' - ముందుగా చెప్పిన టైమ్‌కు ధనుష్ సినిమా

ధనుష్ హీరోగా రూపొందుతోన్న 'సార్' (తెలుగులో), 'వాతి' (తమిళంలో) సినిమా విడుదల వాయిదా పడిందని వస్తున్న వార్తలను చిత్ర బృందం ఖండించింది. 

FOLLOW US: 
 
ధనుష్ (Dhanush) కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ , త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్న సినిమా 'సార్' (SIR Movie). ధనుష్‌కు తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రమిది. తమిళంలో 'వాతి' (Vaathi Movie)గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది? ఈ విషయంలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

విడుదల వాయిదా పడిందా?
దీపావళి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ 'సార్' టీమ్ ఓ పోస్టర్ విడుదల చేసింది. అందులో విడుదల తేదీ లేదు. దాంతో సినిమా విడుదల వాయిదా పడిందని ప్రచారం మొదలైంది. అభిమానులలో అసలు విషయం తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువ అయ్యింది. ఈ కన్‌ఫ్యూజన్ చిత్ర బృందం దృష్టికి వెళ్లడంతో క్లారిటీ ఇచ్చింది. 

డిసెంబర్ 2నే 'సార్'
Sir / Vaathi Movie Release Date : ముందుగా వెల్లడించినట్టుగా డిసెంబర్ 2న 'వాతి' / 'సార్' సినిమా విడుదల అవుతుందని, అందులో ఎటువంటి మార్పు లేదని చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పేర్కొంది. సో... మరో నెల రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట!

ఈ ఏడాది ధనుష్ ఐదో సినిమా!ధనుష్ హీరోగా నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటిది 'మారన్' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కాగా... 'తిరు', 'నేనే వస్తున్నా' సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్'లో కూడా ధనుష్ కనిపించారు. ధనుష్‌కు 'సార్' ఈ ఏడాది ఐదో రిలీజ్ అవుతుంది. 

Also Read : కోర్టులో 'కాంతార'కు చుక్కెదురు - పాట తెచ్చిన చిక్కులు

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్ (Samyuktha Menon). 'భీమ్లా నాయక్', నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు చిత్రమిది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు (Venky Atluri). వరుణ్ తేజ్ 'తొలిప్రేమ', అఖిల్ అక్కినేని 'మిస్టర్ మజ్ను', నితిన్ 'రంగ్ దే' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 

విద్యా వ్యవస్థ నేపథ్యంలో 'సార్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆల్రెడీ 'యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్' స్లోగన్‌తో విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇందులో ధనుష్ టైటిల్ రోల్ చేస్తున్నారని తెలిసింది. 

'సూదు కవ్వం', 'సేతుపతి', 'తెగిడి', 'మిస్టర్ లోకల్', 'మార' తదితర చిత్రాలకు పనిచేసి దినేష్ కృష్ణన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కాగా... నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జీవీ ప్ర‌కాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి కుమార్,తనికెళ్ల భ‌ర‌ణి, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌), ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అవినాష్ కొల్లా, స‌మ‌ర్ప‌ణ: పి.డి.వి. ప్ర‌సాద్‌. 

Published at : 30 Oct 2022 08:46 AM (IST) Tags: Samyuktha Menon Venky Atluri Dhanush Sir Movie Release Date Vaathi Movie Release Date

సంబంధిత కథనాలు

Guppedantha Manasu December 3rd Update:  అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!

Guppedantha Manasu December 3rd Update: అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు