అన్వేషించండి

Devatha August 22 Update: దేవత - తన ఇంటికి వచ్చిన రుక్మిణిని దేవుడమ్మ చూస్తుందా? రాధకి షాక్ ఇవ్వబోతున్న మాధవ

కమల బిడ్డ బారసాల కోసం దేవుడమ్మ ఇంటికి ఎలాగైనా వెళ్లాలని రుక్మిణి నిర్ణయించుకుంటుంది. దీంతో మాధవ రాధకి షాక్ ఇచ్చేందుకు కొత్త స్కెచ్ వేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

దేవుడమ్మ ఇంట్లో బారసాల ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉంటాయి. అప్పుడే భాగ్యమ్మ వస్తుంది. ఇప్పుడా రావడం చుట్టంలాగా వస్తున్నావ్ ఇంట్లో ఉండి అన్నీ దగ్గరుండి చూసుకోవాలి కదా అని దేవుడమ్మ అంటుంది. ఈ వేడుకలో రుక్మిణి కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేది అని దేవుడమ్మ బాధపడుతుంది. అప్పుడే ఇంట్లో వాళ్ళు అందరూ అక్కడికి వచ్చి భాగ్యమ్మని పలకరిస్తారు. మా ఇంట్లో ఉండటం ఇబ్బందిగా ఉందా ఏంటి అని సూరి భాగ్యమ్మని అడుగుతాడు. అదేమీ లేదు పటేలా అంటే మరి ఎందుకు ఉండటం లేదు నేను కడుపుతో ఉన్నప్పుడు దగ్గరుండి చూసుకోలేదు నొప్పులు పడుతుంటే హాస్పిటల్ కి వచ్చి బయటదానిలా చూసి పోయావు, నేను ఉన్నా గాని నన్ను విడిచిపెట్టి పోయావంటే ఎక్కడ ఉన్నావో చెప్పు అని కమల నిలదిస్తుంది. ఎక్కడ ఉంటాను మన ఇంట్లోనే ఉంటాను అని భాగ్యమ్మ అంటే అయితే అదే మాట నా బిడ్డ మీద ఒట్టు పెట్టి చెప్పమని అడుగుతుంది. ఆ మాటకి భాగ్యమ్మ నా బిడ్డతాన ఉంటున్నా అనేసరికి అందరూ షాక్ అవుతారు. నీ బిడ్డ ఇంకెవరూ ఉన్నారని దేవుడమ్మ అడుగుతుంది. నా బిడ్డ అంటే నా ఇంట్లోనే నా బిడ్డ ఆడింది పాడింది అక్కడే కదా ఆ ఇంట్లోనే అందుకే అక్కడే ఉంటున్నాను. రుక్కవ్వ బతికే ఉందని అంటున్నారు ఈ ఇంటికి రాకపోయినా తను నాదగ్గరకి అయినా వస్తుందేమో అని చిన్న ఆశ.. అందుకే నా ఇంట్లోనే నా బిడ్డ కోసం ఎదురు చూస్తా కూర్చున్నా ఆదేమన్నా తప్పా అని అనడంతో అందరూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు.

Also Read: మన పెళ్లి ఎప్పుడని అభిని నిలదీసిన మాళవిక- యష్ మీద పగ తీర్చుకోవడానికి అభికి దొరికిన అస్త్రం

రాధ దేవుడమ్మ ఇంటికే వెళ్లబోతుంటే మాధవ వస్తాడు. ఏంటి ఆ ఇంటికేనా అని అంటే ఆ ఇంటికి కాదు మా ఇంటికి అని రాధ చెప్తుంది.

మాధవ: మీ ఇంటిని వదిలేసి చాలా కాలం అయ్యింది కదా వద్దు రాధ వెళ్తే ఇబ్బంది పడతావ్

రాధ: ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను

మాధవ: వెళ్లాలని డిసైడ్ అయ్యవన్నమాట.. వెళ్ళే ముందు నాకు ఒక మాట చెప్తే బాగుంటుంది కదా

రాధ: ఏంది నీకు చెప్పేది నువ్వు ఎవరని చెప్పాలి. నా మెట్టినింటికి పోతున్నా నా పెనిమిటి ఇంట్లో వేడుక జరుగుతుంది పోతున్నా నీకెందుకు చెప్పాలి

మాధవ: నీకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే నాకు చెప్పి వెళ్లాలి

రాధ: గది నా ఇల్లు నా ఇంట్లో నాకేంటి ఇబ్బంది. నేను అక్కడ లేకపోయినా అది నా ఇల్లు అక్కడ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు. నా వాళ్ళ నీడ పడినా చాలు నేను సంతోషంగా ఉండటానికి. నేను విడిచిపెట్టిన సంతోషం వెతుక్కోడానికి పోతున్నా నా దారిన నన్ను పోనివ్ ఇసువంటప్పుడు అడ్డు పడితే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.

ఆ ఆదిత్య ఉన్నాడనే ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నావ్. నీ ఆనందం ఆవిరి అయ్యేలా ఒక మంచి షాక్ ఇస్తాను చూస్తూ ఉండు అని మాధవ ఎవరికో ఫోన్ చేస్తాడు. ఇక దేవి వాళ్ళు దేవుడమ్మ ఇంటికి వస్తారు. అందరినీ పలకరిస్తుంది కానీ దేవిని పలకరించదు. మీ అమ్మని తీసుకొస్తా అని మాటిచ్చి తీసుకురాకుండా వచ్చావ్ కదా అని బుంగమూతి పెడుతుంది. మా రాధ ఎవ్వరి ఇంటికి వేడుకకి రాదు తనని బలవంత పెట్టడం ఎందుకని మేము వదిలేశామని రామూర్తి చెప్తాడు. బారసాల వేడుక మొదలవుతుంది. ఆదిత్య, సత్యని బిడ్డని తీసుకుని ఉయ్యాలల్లో పడుకోబెట్టమని చెప్తుంది దేవుడమ్మ. కానీ దేవి ఆపుతుంది తను నాకు ఏమవుతుందని అడిగితే ఆదిత్య చెల్లి అని చెప్తాడు. అయితే నా చెల్లిని నేనే పడుకోబెడతా అని అంటుంది. దేవుడమ్మ సరే అనడంతో దేవి బిడ్డని తీసుకుని ఉయ్యాల్లో వేస్తుంది. అదంతా రుక్మిణి చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది. నువ్వు ఈ ఇంటి బిడ్డవమ్మ అన్ని నువ్వే చెయ్యాలి ఆ విషయం మేము మర్చిపోయామని ఆదిత్య అంటాడు.

Also Read:  రిషి కోసం ఎంగేజ్మెంట్ రింగ్ చేయించే పనిలో పడిన వసు, తల్లిపై ద్వేషం తగ్గించుకున్న రిషి

దేవమ్మ ఈ ఇంటి బిడ్డ అని తెలిస్తే అత్తమ్మ ఎంత ఖుషి అవుతుందో.. భగవంతుడా ఈ ఇంటి బిడ్డని ఈ ఇంటికి త్వరగా చేరేలా ఆశీర్వదించమని రుక్మిణి మనసులో కోరుకుంటుంది. ఇక పంతులుగారు పాప చెవిలో పేరు చెప్పమని చెప్తాడు. బిడ్డకి రుక్మిణి అని పేరు పెడుతుంది దేవుడమ్మ. దేవి సంతోషంగా రుక్మిణి రుక్మిణి అని పిలుస్తుంది. అదంతా చూసి రుక్మిణి చాలా సంతోషిస్తుంది. ఆ పేరు పెట్టినందుకు ఇంట్లో అందరూ కూడా సంతోషిస్తారు. అప్పుడే ఆదిత్య రుక్మిణి చూసి షాక్ అవుతాడు.

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu Oct 9: ప్రభావతిని గదిలో నుంచి బయటకు పొమ్మంటూ అరిచిన మనోజ్‌...కొడుకు మాటలకు బాధపడి ఏడ్చిన తల్లి
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని గదిలో నుంచి బయటకు పొమ్మంటూ అరిచిన మనోజ్‌...కొడుకు మాటలకు బాధపడి ఏడ్చిన తల్లి
Varanasi Update : 'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
Karthika Deepam 2 Serial Today October 9th: కార్తీకదీపం 2 సీరియల్: నాన్న నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. సుమిత్ర మాటలకు కుప్పకూలిపోయిన దక్షిణామూర్తి! రివేంజ్ తీర్చుకున్న మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: నాన్న నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. సుమిత్ర మాటలకు కుప్పకూలిపోయిన దక్షిణామూర్తి! రివేంజ్ తీర్చుకున్న మాలిని!
Comrade Kalyan Live Updates - 'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget