News
News
X

'Republic' Movie Update: 'ఎ ట్రిబ్యూట్ టు ద సోల్జర్స్ అన్న దేవకట్టా'... సోషల్ మీడియాలో సందడి చేస్తున్న 'రిపబ్లిక్ ' మేకింగ్ విజువల్స్

అక్టోబరు 1న విడుదల కానున్న రిపబ్లిక్ మూవీ మేకింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

FOLLOW US: 
Share:

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా న‌టించిన పొలిటికల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’. దేవ క‌ట్టా ద‌ర్శ‌కుడిగా జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిప‌బ్లిక్‌’ గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌వుతుంది.  తాజాగా ఈ సినిమాకు సంబంధించి మొత్తం  టీమ్ తరపున 'సైనికులకు నివాళి' అంటూ దర్శకుడు దేవ కట్టా ట్వీట్ చేశాడు. 

ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన మేకింగ్ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పూజ వేడుకలో పాల్గొనడంతో వీడియో ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ.  ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషించారు.

రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చాలా విషయాలు చెప్పుకొచ్చింది.  వాస్తవ సంఘటనల్ని తీసుకుని దేవకట్టా తనదైన మార్క్ చూపించారని.. ఓ బలమైన కథని అందరికీ అర్థమయ్యేలా రూపొందించారంది.  అనుకున్నది అనుకున్నట్టుగా తెరపైకి తీసుకొచ్చేందుకు దేవకట్టా ఎంతో శ్రమిస్తారంది. ఈ సినిమాకోసం  సాయిధరమ్‌ తేజ్ చాలా కష్టపడ్డాడని చెప్పుకొచ్చిన ఐశ్వర్యా రాజేశ్ కలెక్టరు పాత్రలో ఒదిగిపోయాడని..చిన్నపిల్లాడిలా పెన్ను పేపర్‌ పట్టుకుని సంభాషణలు ప్రాక్టీస్‌ చేశాడంది. కోర్టు బ్యాక్ డ్రాప్ లో సాగే సన్నివేశాల్ని సింగిల్ టేక్ సాయి ధరమ్ తేజ్ పూర్తిచేయడం చూసి చిత్ర బృందం అంతా ఆశ్చర్యపోయామంది ఐశ్వర్యా రాజేశ్.

Also Read: టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంకట్‌ కన్నుమూత, సోషల్ మీడియా ద్వారా ప్రముఖుల సంతాపం

Also Read: ఆదిపురుష్ విడుదల తేదీకి ముహూర్తం ఫిక్సైంది... రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఇండిపెండెన్స్ డే కన్నా ముందే ట్రీట్..

Also Read: 'మా'లో ఎన్నికల సందడి షురూ.. నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్ టీమ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 27 Sep 2021 01:51 PM (IST) Tags: social media Ramya Krishna Aishwarya Rajesh Deva Katta tweets 'A tribute to the soldiers' 'Republic' making visuals Sai dharma Tej Jagapathibabu

సంబంధిత కథనాలు

Samudram Chittabbai: ఈ రాజ్యంలో రాణే రాజుని వదిలేస్తుంది - ఆసక్తికరంగా ‘సముద్రం చిట్టబ్బాయి’ ట్రైలర్

Samudram Chittabbai: ఈ రాజ్యంలో రాణే రాజుని వదిలేస్తుంది - ఆసక్తికరంగా ‘సముద్రం చిట్టబ్బాయి’ ట్రైలర్

Jamuna Death: సీనియర్ నటి జమున మృతి పట్ల సినీ ప్రముఖుల నివాళి

Jamuna Death: సీనియర్ నటి జమున మృతి పట్ల సినీ ప్రముఖుల నివాళి

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

Tollywood Deaths, Shocks - 27th Jan : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్

Tollywood Deaths, Shocks - 27th Jan : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్

టాప్ స్టోరీస్

Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్

Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !

Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !

IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!

IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!