అన్వేషించండి

Krishnavamsi: డబ్బింగ్ సరే కానీ రిలీజ్ ఎప్పుడు? కృష్ణవంశీ తీరుపై నెటిజన్ల అసహనం!

చాలా కాలంగా ఫ్లాప్ లతో డీలా పడ్డ కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు కృష్మవంశీ 'రంగమార్తాండ' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మరాఠీలో విడుదలైన 'నట సామ్రాట్' సినిమాకి ఇది రీమేక్. సాధారణంగా అయితే దర్శకుడు కృష్ణవంశీ రీమేక్ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపరు. సొంత కథలతోనే సినిమాలను రూపొందిస్తారు. కానీ 'నట సామ్రాట్' సినిమాను చూసిన ఆయన రీమేక్ చేయాలని ఫిక్సయిపోయారు. అంతగా అతడిని కదిలించిన సినిమా అది.

చాలా కాలంగా ఫ్లాప్ లతో డీలా పడ్డ వంశీ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. 'నట సామ్రాట్' సినిమాలో నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. అలానే సినిమాలో మరో ముఖ్య పాత్ర ఒకటి ఉంటుంది. నానా పటేకర్ స్నేహితుడిగా మరాఠీలో విక్రమ్ గోఖలే నటించారు. సీరియస్ గా ఎమోషనల్ గా సాగే ఆ పాత్ర కోసం బ్రహ్మానందాన్ని ఎంపిక చేశారు. 

ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నిజానికి ఈపాటికే సినిమా రిలీజ్ కావాల్సింది కానీ ఆలస్యం జరుగుతోంది. ఆగస్టులో సినిమా కచ్చితంగా రిలీజ్ అవుతుందన్నారు. కానీ అలా జరగలేదు. దీపావళికి వస్తుందన్నారు. అప్పుడు కూడా రాలేదు. కృష్ణవంశీ మాత్రం సోషల్ మీడియాలో బ్రహ్మానందం, రమ్యకృష్ణ డబ్బింగ్ చెబుతోన్న ఫొటోలను షేర్ చేస్తూ.. కాలం గడుపుతున్నారు. 

కొన్ని నెలల క్రితమే డబ్బింగ్ మొదలైంది. ఇప్పటికే చాలా మంది డబ్బింగ్ చెప్పేశారు కూడా. కానీ కృష్ణవంశీ ఇంకా డబ్బింగ్ ఫొటోలను పెడుతూ.. రిలీజ్ డేట్ మాత్రం చెప్పకపోవడం ఆడియన్స్ కు విసుగు తెప్పిస్తుంది. 'రంగమార్తాండ' సినిమా చూద్దామనుకునే కొందరు ప్రేక్షకులు డబ్బింగ్ సరే కానీ రిలీజ్ ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి కృష్ణవంశీ రిలీజ్ విషయంలో ఏం ఆలోచిస్తున్నారో తెలియాల్సివుంది. 

కృష్ణవంశీ ఓటీటీ ప్రాజెక్ట్:
పాండమిక్ సమయంలో జనాలు ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు చాలా మంది థియేటర్లకు వెళ్లి సినిమా చూడడానికి కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. ఓటీటీలోనే చూసుకుంటున్నారు. ఇక వెబ్ సిరీస్ లైతే వందల సంఖ్యలో రిలీజ్ అవుతున్నాయి. ఒరిజినల్ కంటెంట్ కోసం బాగా ఖర్చు చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. తెలుగులో కూడా పదుల సంఖ్యలో వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. వీటికోసం కోట్లలో ఖర్చు చేస్తున్నారు. పేరున్న దర్శకులు చాలా మంది ఓటీటీ ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు. 

ఇప్పుడు కృష్ణవంశీ వంతు వచ్చింది. త్వరలోనే ఆయన ఓటీటీ ప్రాజెక్ట్ చేయబోతున్నారట. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాల రూ.300 కోట్ల వరకు ఉంటుంది. ఇదొక బ్లాస్ట్ లాంటి ప్రాజెక్ట్ అని.. త్వరలోనే వివరాలు చెబుతానని అన్నారట. కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ ని నమ్మి మూడొందల కోట్ల బడ్జెట్ పెట్టడమంటే మాములు విషయం కాదు. కాకపోతే ఓటీటీలతో ఏదైనా సాధ్యమనే చెప్పాలి. అక్కడ బడ్జెట్ లిమిటేషన్స్ ఉండవు. ప్రాజెక్ట్ పై నమ్మకం ఉంటే ఎంతైనా పెట్టొచ్చు. నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలకు మూడొందల కోట్లు పెద్ద మేటర్ కూడా కాదు.

Also Read: 'ఫ్యాన్స్ నన్ను కొడతారు' - ప్రభాస్‌తో సినిమాపై మారుతి కామెంట్స్!

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today September 16th: కార్తీకదీపం 2 సీరియల్: మీరే బాధ్యత తీసుకోవాలి.. లేదంటే జరిగేది ఇదే..! నడిరోడ్డు మీద ఫ్యామిలీని చూసి కుప్పకూలిపోయిన జ్యోత్స్న!
కార్తీకదీపం 2 సీరియల్: మీరే బాధ్యత తీసుకోవాలి.. లేదంటే జరిగేది ఇదే..! నడిరోడ్డు మీద ఫ్యామిలీని చూసి కుప్పకూలిపోయిన జ్యోత్స్న!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు! చరణ్‌, చైత్రలో ఒకరి ఎంట్రీ పక్కా.. బాధ్యత మనదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు! చరణ్‌, చైత్రలో ఒకరి ఎంట్రీ పక్కా.. బాధ్యత మనదే!
Jagadhatri Serial Today September15th:సుధాకర్‌కు కాళ్లు తెప్పించేందుకు కేదార్ సాహాసం...మంటల్లో కాల్చి చంపేందుకు యువరాజు కుట్ర
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లు తెప్పించేందుకు కేదార్ సాహాసం...మంటల్లో కాల్చి చంపేందుకు యువరాజు కుట్ర
Power House: క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్ కాదు... ఆ ఒక్కటీ సీక్రెట్ - విక్రమ్ 'పవర్ హౌస్' గ్లింప్స్ చూశారా?
క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్ కాదు... ఆ ఒక్కటీ సీక్రెట్ - విక్రమ్ 'పవర్ హౌస్' గ్లింప్స్ చూశారా?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
BRS Leaders Arrest: కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
Embed widget