అన్వేషించండి

నిర్మాతగా మారిన దీప్తి సునయన - ‘ఏమోనే’తో వస్తున్న బిబీ బ్యూ

యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన నుంచి ఓ కొత్త వీడియో సాంగ్ రాబోతోంది. ‘ఏమోనే’ అంటూ సాగే ఈ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో సాంగ్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను రివీల్ చేసిందీ బ్యూటీ.

యూట్యూబ్ స్టార్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునయన గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వాడుతున్న ప్రతీ ఒక్కరికీ ఈ బ్యూటీ గురించి తెలిసే ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో టిక్ టాక్ వీడియోలు, డబ్ స్మాష్ వీడియోలతో ఆకట్టుకున్న ఈ భామ తర్వాత షార్ట్ ఫిల్మ్ లలో కూడా నటించింది. కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేసింది. తన అందం అభినయం తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ను పెంచుకుంది. తాజాగా దీప్తి మరో కొత్త వీడియో సాంగ్ తో మళ్లీ రాబోతోంది. ‘ఏమోనే’ అనే కొత్త ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోతో మ్యాజిక్ చేయడానికి సిద్దమవుతోంది సునయన. దానికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రివీల్ చేసింది. 

ఈ ‘ఏమోనే’ పాట టీజర్ ను జనవరి 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటిచిందీ బ్యూటీ. దానితో పాటు సాంగ్ కు సంబంధించిన చిన్న ప్రోమో ను కూడా రిలీజ్ చేసింది. ప్రోమో కూల్ మ్యూజిక్ తో ఆకట్టుకునేలా ఉండటంతో ‘ఏమోనే’ పాటపై ఆసక్తి నెలకొంది. ఇందులో దీప్తి సునయన, విశాల్ జంటగా కనిపించనున్నారు. ఈ పాటకు దర్శకత్వం డీఓపీగా వినయ్ షన్ముఖ్ చేస్తున్నాడు. విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ వీడియో సాంగ్‌తో దీప్తి సునైనా నిర్మాతగా కూడా మారుతోంది. మాకా సంపత్ కుమార్‌తో కలిసి ఆమె నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. 

ఇప్పటి వరకూ కేవలం నటనకే పరిమితమైన ఈ బ్యూటీ కొత్త సంవత్సరంలో నిర్మాతగా తన లక్ పరీక్షించుకోడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకూ దీప్తి సునయన చాలా కవర్ సాంగ్ లలో కనిపించింది. తన గ్లామర్ తో లక్షలాది మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఆమె కనిపించిన ప్రతీ పాటకూ మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. కుర్రకారులో ఈమెకు ఎక్కడాలేని క్రేజ్ ఉంది. 

Read Also: ఆ సినిమాలకు పోటీగా ‘శాకుంతలం’ - రిలీజ్ డేట్ వచ్చేసింది

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina)

సినిమాల మీద ఇంట్రస్ట్ తో చదువుకుంటున్న రోజుల నుంచే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ వస్తోంది దీప్తి. వరుసగా వీడియోలు, గ్లామర్ ఫోటో షూట్ లతో అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఇప్పటి వరకూ ఈ బ్యూటీకు సరైన సినిమా అవకాశాలు ఏమీ రాలేదు. అయినా తన పని తాను చేసుకుంటూ రీల్స్, ఫోటో షూట్ లు, షార్ట్ ఫిల్మ్, కవర్ సాంగ్స్ లతో దూసుకుపోతోంది. గతంలో దీప్తి యూట్యూబర్ షణ్ముఖ్ తో ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వచ్చాయి. అందుకు తగ్గట్టుగా వీరు కూడా ప్రైవేటు పార్టీలలో కలసి కనిపించేవారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే షణ్ముఖ్ బిగ్ బాస్ లో కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచీ వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగి, తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే ప్రస్తుతానికి అటు షణ్ముఖ్ ఇటు దీప్తి ఎవరి ఫ్రొఫెషన్ లో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Vishnu Priya Bhimeneni: సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్
సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్
Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Lenin Box Office Collection Day 2: 'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్
'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వింగ్ హెల్మెట్ రివ్యూ - స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ ఎలా ఉన్నాయి?
రూ.4,500కే రాయల్ ఎన్‌ఫీల్డ్ మాడ్యులర్ హెల్మెట్ - మీ డబ్బుకు తగ్గ వాల్యూ ఇస్తుందా?
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Embed widget