అన్వేషించండి

GROUND Movie: ‘గ్రౌండ్’ మూవీ - ఈ గల్లీ క్రికెట్ సినిమాకు ఊహించని క్రేజ్, కథ ఏమిటంటే?

GROUND Movie: ఒక్కోసారి భారీ సినిమాలు బోల్తా ప‌డ‌తాయి. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చే సినిమాలు క్రేజ్ తెచ్చుకుంటాయి. అలాంటిదే ఈ ‘గ్రౌండ్’ సినిమా.

Super Craze For GROUND Movie: ఒక్కోసారి భారీ బ‌డ్జెట్ పెట్టి, మంచి పేరున్న న‌టీన‌టుల‌ను పెట్టి, భారీగా ప్రమోష‌న్స్ చేసి రిలీజ్ చేసే సినిమాలు బాక్సీఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ‌తాయి. ప్రేక్ష‌కుల‌కి అస్స‌లు న‌చ్చ‌వు. ఫ్లాప్ గా నిలుస్తాయి. కానీ, కొన్ని సినిమాలు అలాకాదు. న‌టీన‌టులు ఎవ‌రో తెలీదు. భారీ బడ్జెట్ లు ఉండ‌వు. ప్ర‌మోష‌న్స్ ఉండ‌వు. అస‌లు అలాంటి సినిమా ఒక‌టి రిలీజ్ అయ్యిందా? అని కూడా ఎవ్వ‌రికీ తెలీదు. అలాంటి సినిమాలు ప్రేక్ష‌కుల్లో క్రేజ్ తెచ్చుకుంటాయి. క్రిటిక్స్ ని సైతం అట్రాక్ట్ చేస్తాయి. గ‌తంలో టాలీవుడ్ లో అలాంటి సినిమాలు చాలానే వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ‘గ్రౌండ్’ అనే ఈ సినిమా కూడా ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకుంది. కొత్త న‌టుల‌తో, కొత్త ద‌ర్శ‌కుడితో తెర‌కెక్కించిన ఈ సినిమాకి ఎందుకింత క్రేజ్? ఒక‌సారి చూద్దాం. 

చిన్న‌నాటి జ్ఞాప‌కాలు.. 

దాదాపు సినిమాల‌న్నీ రియాల్టీకి ద‌గ్గ‌ర్లోనే ఉంటాయి. మ‌న జీవితంలో జ‌రిగే విష‌యాల‌నే చాలామంది తెర‌కెక్కిస్తుంటారు. కానీ, వాళ్లు తీసే విధానం, వాళ్లు అందులో చూపించే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవుతాయి. అలాంటి సినిమానే ‘గ్రౌండ్’. చిన్న‌ప్పుడు ఆదివారం వ‌స్తే చాలు ఆడుకోవ‌డం, టీవీ చూడ‌టం లాంటివి చేసేవాళ్లం. అలా ఆదివారం వ‌స్తే చాలు గ్రౌండ్ కి వెళ్లి ఆడుకునే అబ్బాయిల క‌థే ఈ సినిమా. ఒకేరోజు, ఒకే లొకేష‌న్ లో జ‌రిగే క‌థ ఈ సినిమా. దీంట్లోనే ల‌వ్ స్టోరీ, ఎమోష‌న్స్ అన్నీ చూపించారు . ఒక్కసారిగా మ‌న‌ల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్లిపోయారు. 

ఆస‌క్తిగా ట్రైల‌ర్.. 

ఫిబ్ర‌వ‌రి 23న రిలీజైంది ఈ చిన్న సినిమా. ఈ సినిమా ట్రైల‌ర్ చాలామందిని ఆక‌ట్టుకుంద‌నే చెప్పాలి. ఒక అమ్మాయి త‌న జీవితం గురించి, త‌న ప్రేమ గురించి ఈ ట్రైల‌ర్ లో చెప్తున్న‌ట్లుగా క‌ట్ చేశారు. దాంట్లోనే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ చూపించారు. చివ‌రికి "ఒక్క రోజులో జీవితం ఎలా మ‌లుపు తిరిగిందో" అంటూ ముగించారు. దీంతో ఏం జ‌రిగిందా? అనే ఆస‌క్తిని క‌లిగించారు. ఈ సినిమాకి సోష‌ల్ మీడియాలో సైతం క్రేజ్ పెరిగింది. స్టూడెంట్స్ తీసిన ఈ సినిమాకి ప్ర‌తి ఒక్క‌రు టాప్ రేటింగ్స్ ఇస్తున్నారు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. కేవ‌లం 8 స్క్రీన్ ల‌లో రిలీజైన‌ప్ప‌టికీ మంచి టాక్ తెచ్చుకుంటుంది ఈ సినిమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Talk Enti? (@talkenti)

క‌థేంటంటే? 

ఆదివారం వస్తే దగ్గర్లో ఉండే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకునే కుర్రాళ్ళ కథ ‘గ్రౌండ్’. ఆదివారం క్రికెట్ ఆడటానికి వచ్చే కుర్రాళ్ళు వేరే టీంతో పోటీకి బెట్టింగ్ కట్టడం, ఆ క్రికెట్ చూడటానికి వచ్చే అమ్మాయిలు, ఆ గ్రౌండ్ లోనే క్రికెట్ ఆడే కుర్రాళ్ళ మ‌ధ్య ప్రేమ‌. బెట్టింగ్ మ్యాచ్ కాస్త సీరియస్ గా మారడంతో రెండు  గ్రూపుల మధ్య గొడవ జ‌రుగుతుంది. ప్రేమికుల మధ్య గొడవలతో సాగింది. మరి ఆ గొడవలు ఏంటి? గొడవ తర్వాత ఏమైంది? గ్రౌండ్ కథేంటి? ప్రేమ జంటల కథేంటి తెలియాలంటే తెరపై గ్రౌండ్ సినిమాని చూడాల్సిందే. నటీనటుల విషయానికొస్తే.. అందరూ కొత్తవాళ్లే.  క్రికెట్ టీం కెప్టెన్ గా హరి, ముగ్గురు అమ్మాయిలు తేజస్విని, దుర్గా భవాని, ప్రీతీ చక్కగా నటించారు. ఈ సినిమాకి సూర‌జ్ డైరెక్ష‌న్ చేయ‌గా సినీ కోడ్ స్టూడియోస్ నిర్మించింది. 

Also Read: అందుకే ‘యానిమల్’ మూవీ సక్సెస్‌‌ను ఎంజాయ్ చేయలేకపోయా: రష్మిక

టాప్ హెడ్ లైన్స్

Sambarala Yeti Gattu: సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
Divija Prabhakar: ‌హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ కూతురు... పవన్ సూపర్ హిట్ సాంగ్ టైటిల్‌తో సినిమా!
హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ కూతురు... పవన్ సూపర్ హిట్ సాంగ్ టైటిల్‌తో సినిమా!
AK 47 Release Date: గాంధీ జయంతికి ఆదర్శ కుటుంబం... అఫీషియల్‌ రిలీజ్ డేట్... వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా వచ్చేది ఎప్పుడంటే?
గాంధీ జయంతికి ఆదర్శ కుటుంబం... అఫీషియల్‌ రిలీజ్ డేట్... వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా వచ్చేది ఎప్పుడంటే?
Uppal Balu : థార్ కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ - రీల్స్ పిచ్చితో వెకిలి చేష్టలు... కేసు నమోదు
థార్ కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ - రీల్స్ పిచ్చితో వెకిలి చేష్టలు... కేసు నమోదు

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget