అన్వేషించండి

జీరో కట్స్ తో 'భగవంత్ కేసరి' సెన్సార్ పూర్తి - రన్ టైమ్ ఎంతో తెలుసా!

బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి' మూవీ తాజాగా సెన్సార్ పనులను పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ జారీ చేసింది.

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'(Bhagavanth kesari) మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ యూనిట్ ఎటువంటి కట్స్ లేకుండా జీరో కట్స్ తో సెన్సార్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 'భగవంత్ కేసరి' మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. దసరా కానకగా అక్టోబర్ 19న మూవీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

దీంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరి ఫీవర్ మొదలైపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నట్లు సమాచారం. చాలా చోట్ల నుంచి తొలి రోజు కొన్ని షోలకు థియేటర్స్ ఇప్పటికే ఫుల్ అయినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో 'భగవంత్ కేసరి' సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. తాజాగా ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికేషన్ వచ్చేసింది. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. 'భగవంత్ కేసరి' సినిమా సెన్సార్ కంప్లీట్ అయిందని ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు సైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ ప్రకటించింది.

అంతేకాకుండా ఈ మూవీకి U/A వచ్చినట్లు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రంలో ఒక్క కట్ కూడా చేయాలని సెన్సార్ బోర్డు మూవీ టీం కి చెప్పలేదట. ఎలాంటి కట్స్ లేకుండా  సెన్సార్ కంప్లీట్ అయినట్లు సమాచారం వినిపిస్తోంది. ఇక ఈ సినిమా రన్ టైం 164 నిమిషాల 30 సెకన్లు అంటే దాదాపు రెండు గంటల 44 నిమిషాల 30 సెకన్లుగా ఉంది. మరోవైపు ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజ్ లు ప్లాన్ చేసినట్లు అనిల్ రావిపూడి ఇటీవల చెప్పారు. ఆ వాటిని ట్రైలర్ లో ఏమాత్రం చూపించకుండా జాగ్రత్త పడ్డామని థియేటర్స్ లో ఆ సీన్స్ చూసినప్పుడు ఆడియన్స్ అందరూ ఆశ్చర్యపోతారని అన్నారు. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో బాలయ్యను ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా చూపించబోతున్నారు అనిల్ రావిపూడి.

అలాగే ఈసారి బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్స్ అదరగొట్టబోతున్నారు. ఇప్పటికే శాంపిల్ గా ట్రైలర్లో తెలంగాణ స్లాంగ్ లో ఆయన చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో బాలయ్యకి కూతురిగా శ్రీలీలా కనిపించనున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీతోనే ఆయన టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించగా, రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

Also Read : విజయ్ 'లియో'కి ఊహించని షాక్ - తెలుగులో విడుదలపై స్టే? క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

టాప్ హెడ్ లైన్స్

Romantic Action Thriller OTT : చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
Comrade Kalyan Day 1 Collection : కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీ విష్ణు కొత్త మూవీకి తొలి రోజు సాలిడ్ నెంబర్స్
కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీ విష్ణు కొత్త మూవీకి తొలి రోజు సాలిడ్ నెంబర్స్
Peddi TV Premiere : టీవీల్లోకి పెద్ది వచ్చేస్తున్నాడు - మెగా పవర్ స్టార్ మూవీ బుల్లితెరపై చూసేందుకు రెడీయేనా!
టీవీల్లోకి పెద్ది వచ్చేస్తున్నాడు - మెగా పవర్ స్టార్ మూవీ బుల్లితెరపై చూసేందుకు రెడీయేనా!
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Black Coffee for Weight Loss : బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
Embed widget