అన్వేషించండి

Toxic Postponed Again: మళ్లీ 'టాక్సిక్' వాయిదా... జూన్‌లోనూ రావట్లేదు... యశ్ ఏమన్నారంటే?

Yash On Toxic Postponed: జూన్ 4వ తేదీన థియేటర్లలోకి రావాల్సిన 'టాక్సిక్' మరోసారి వాయిదా పడినట్టు, సినిమా విడుదల ఆలస్యం కానున్నట్టు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తెలిపారు.

రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash) హీరో నటిస్తుండటంతో పాటు ఓ నిర్మాతగా రూపొందుతున్న సినిమా 'టాక్సిక్' (Toxic Movie). దీనికి గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ చేస్తున్నారు. 'ధురంధర్ 2'తో పాటుగా రిలీజ్ కావాల్సిన ఈ మూవీని ఇప్పటి వరకు వాయిదాలు వేస్తూ వచ్చారు. చివరగా జూన్ 4న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్‌ని కూడా మార్చేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని యశ్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు యశ్.

అవును... జూన్ 4న 'టాక్సిక్' విడుదల కావడం లేదు!
'టాక్సిక్' విడుదల వాయిదా పడిన విషయాన్ని యశ్ కన్ఫర్మ్ చేశారు. ''కొన్ని సినిమాలు ఆడియన్స్ ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా, ప్రేమలో పడేలా చేస్తాయి. మా 'టాక్సిక్' ప్రయాణం కూడా అలాంటిదే. సినిమాకాన్ అనే అంతర్జాతీయ వేదిక మీద మా సినిమా ప్రదర్శించినప్పుడు అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి ఇది వరల్డ్ వైడ్ సినిమా ప్రేమికుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం వచ్చింది. 'టాక్సిక్' సినిమా పూర్తి అయ్యింది. వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇంతకు ముందు ప్రకటించినట్టుగా జూన్ 4న ఈ మూవీని రిలీజ్ చేయడం లేదు. అన్ని దేశాలకు సరిపడే ఓ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం. త్వరలోనే టాక్సిక్ అందరి ముందుకు వస్తుంది'' అని యశ్ తెలిపారు. 

Also Read: Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash (@thenameisyash)

ఇంకా ''ప్రస్తుతం మన సినిమాలు అంతర్జాతీయ వేదికలపై మన దేశాన్ని ప్రతిబింబించేలా ఉంటున్నాయి.. దానికి తగ్గట్టుగానే మా టాక్సిక్ కూడా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమా సత్తాని, టాక్సిక్ ప్రభావాన్ని ఉండేలా ఓ నిర్మాతగా, నటుడిగా నాకు ఈ గొప్ప అవకాశం దొరికింది.. ఈ ప్రయాణంలో మాకు ఎన్నో సవాళ్లు ఎదురైనా మా వెంటే ఉండి నడిపిస్తున్న, ప్రేమను పంచుతున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్.  కొన్ని కథలు మన సహనాన్ని పరీక్షిస్తాయి. కొన్ని ప్రయాణాలు వాటిని డిమాండ్ చేస్తాయి..  సినిమాని సెలెబ్రేట్ చేసుకునేలా టాక్సిక్‌ను రూపొందించాం.. ఇండియన్ సినిమాకి గర్వకారణంగా ఈ టాక్సిక్ ఉంటుంది'' అని యశ్ ప్రకటించారు.

Also Read: Lenin First Review: కొత్త అఖిల్‌ను చూస్తారు - 'లెనిన్' చూసిన నాగార్జున... ఫస్ట్ రివ్యూ ఇదిగో

'టాక్సిక్' సినిమా పదే పదే వాయిదా పడుతూ ఉంటే... ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ కాస్త తగ్గుతుందనే సందేహాలు కొంత మందిలో ఉండొచ్చు. అయితే 'కేజీయఫ్ 2' తరువాత యశ్ ఇంత వరకు థియేటర్లలోకి రాలేదు. అందువల్ల క్రేజ్ ఉంటుంది.  మళ్లీ తన సత్తాను, లక్‌ను బాక్సాఫీస్ వద్ద చూపిస్తారని చెప్పవచ్చు. 'కేజీయఫ్' ఫ్రాంచైజీ కాకుండా యశ్ వేరే సినిమాతోనే తన బాక్సాఫీస్ పొటెన్షియల్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టాక్సిక్ ఎప్పుడు వస్తుందా? యశ్ స్టామినాను చూపిస్తుందో ఎదురు చూడాల్సిందే.

Also Read: Ashu Reddy Audio Leaked: టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా - సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తూ అషు రెడ్డి వార్నింగ్ - ఆడియో లీక్

టాప్ హెడ్ లైన్స్

Idupu Kayitham Controversy : 'సంస్కృతిని ప్లేట్స్ గ్లాసుల్లో వెతక్కండి' - ఇడుపు కాయితం సాంగ్ కాంట్రవర్సీపై ఫేమస్ డైరెక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
'సంస్కృతిని ప్లేట్స్ గ్లాసుల్లో వెతక్కండి' - ఇడుపు కాయితం సాంగ్ కాంట్రవర్సీపై ఫేమస్ డైరెక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
Jailer 2: ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
Jailer 2 Collections : రజనీ కాంత్ జైలర్ 2 రికార్డ్ కలెక్షన్స్ - 10 రోజుల్లో తెలుగు వెర్షన్ వసూళ్లు ఎంతంటే?
రజనీ కాంత్ జైలర్ 2 రికార్డ్ కలెక్షన్స్ - 10 రోజుల్లో తెలుగు వెర్షన్ వసూళ్లు ఎంతంటే?
CBFC Leaks: ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
‌‌UPI Wrong Transfer: యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
Jailer 2: ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
CBFC Leaks: ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
Vizianagaram ZP Elections: మజ్జి సహస్ర బీసీ కాదంటూ వైసీపీ ఫిర్యాదు.. చిన్న శ్రీనుకు పెద్ద టెన్షన్- మరోవైపు బొత్సకు షాక్!
మజ్జి సహస్ర బీసీ కాదంటూ వైసీపీ ఫిర్యాదు.. చిన్న శ్రీనుకు పెద్ద టెన్షన్- మరోవైపు బొత్సకు షాక్!
Embed widget