Viva Harsha: ఆ వ్యాధితో బాధపడ్డా - స్టెరాయిడ్స్ వల్ల లావయ్యాను.. హర్ష ఎమోషనల్
Viva Harsha: ప్రస్తుతం 'సుందరం మాస్టర్' మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా వైవా హర్ష తాజాగా ఓ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తానో అరుదైన వ్యాధితో బాధపడుతున్నానంటూ షాకింగ్ విషయం చెప్పాడు.
Viva Harsha on Body SHaming: హర్ష చెముడు అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. అదే 'వైవా' హర్ష అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. అంతగా తన కామెడీతో ఆకట్టుకున్నాడు హర్ష చెముడు. వైవా అనే షార్ట్ ఫలింలో ప్రాక్టికల్ ఇన్విజిలెటర్ పాత్రలో కామెడీ పండించాడు. అప్పటి నుంచి హర్ష చెముడు కాస్తా 'వైవా' హర్షగా మారిపోయాడు. ఈ షార్ట్ ఫిలింతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా నటిస్తూ మెల్లిమెల్లిగా లీడ్ యాక్టర్ స్థాయికి చెరుకున్నాడు.
అతడు ప్రధాన పాత్రలో లేటెస్ట్‌గా తెరకెక్కిన చిత్రం 'సుందరం మాస్టర్'. ఫిబ్రవరి 23న ఈ చిత్రం థియేటర్లో విడుదల కాబోతుంది.ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌తో హర్ష బిజీగా అయిపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించిన హర్ష తానో అరుదైన వ్యాధితో బాధపడుతున్నానంటూ షాకింగ్ విషయం చెప్పాడు. అంతేకాదు తెరపై కామెడీతో ఆడియన్స్ నవ్వించే తను దానికి వెనక ఎన్నో అవమానాలు, మాటలు పడ్డానంటూ చేదు సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. డబ్బుల కోసం ఇష్టం లేని పాత్రలు కూడా చేయాల్సి వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యాడు.
ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 'చిన్నప్పుడు నేను ఆస్తమా వ్యాధితో బాధపడుతుండేవాడిని. అది తగ్గడం కోసం స్టెరాయిడ్స్ ఇచ్చారు. దాని వల్ల లావు పెరిగాను. స్కూలింగ్ టైం నేను చాలా బొద్దుగా ఉండటంతో తోటి స్నేహితులు హేళన చేసేవారు. లావుడగా ఉన్నానని ఏడిపించేవారు. అంతేకాదు నా తల్లిదండ్రులతో కలిసి ట్రైన్‌లో ప్రయాణించాలన్న భయపడేవాడిని. ఎందుకంటే నా ముందు సీటు వాళ్లు, వెనక సీటు వాళ్లు నన్ను చూసి నవ్వుకునేవాళ్లు. వాడు చూడు ఎంత నల్లగా, బొద్దుగా ఉన్నాడో అని ఎదుటివాళ్లు నవ్వుకుంటారనే ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఉండేది" అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఇండస్ట్రీలో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి కూడా బయటపడ్డాడు. "కలర్ ఫోటో సినిమా ముందు వరకు కూడా ఇండస్ట్రీకి వచ్చినా ఏం చేస్తున్నాననే ఫీలింగ్ ఉండేది. కానీ EMI, బిల్స్ కట్టాలి కాబట్టి ఇష్టం లేకపోయిన సరే పిచ్చి పిచ్చి పాత్రలు చేశాను. నాకు నచ్చని పాత్రలను కూడా నవ్వుతూ నటించి నవ్వించాలి. అదీ ఎంత కష్టమో మాటల్లో చెప్పలేను. అస్సలు ఇక్కడ ఉండాలనిపించేది కాదు. ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. పైగా సెట్స్‌పై అవమానాలు ఎదురయ్యేవి. నా కలర్, బాడీ గురించి జోకులు వేసేవారు. అయినా సరే డబ్బులు కోసం అవన్నీ భరించాను. కలర్ ఫొటో సినిమా చేసిన తర్వాత నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది.
Also Read: ఆలస్యంగా గుడ్‌న్యూస్ చెప్పిన గీతామాధురి - బిడ్డ పుట్టిందని సర్‌ప్రైజ్ చేసింది
ప్రస్తుతం వ్యక్తిగతంగా ఎవరూ కామెంట్స్ చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నాపై ఇప్పటికీ జోకులు వేస్తుంటారు" అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. కాగా.. హర్ష ప్రధాన పాత్రలో ‘సుందరం మాస్టర్’ మూవీ తెరకెక్కింది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్షకు జంటగా దివ్య శ్రీపాద నటిస్తుంది. ఈ మూవీని సుధీర్ కుమార్ కుర్రుతో కలిసి మాస్ మహారాజా రవితేజ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో మూవీ అంచనాలు పెరిగిపోయాయి.