అన్వేషించండి

Vishwambhara First Look: అభిమానులకు చిరంజీవి బర్త్ డే కానుక... విశ్వంభర ఫస్ట్ లుక్ రిలీజ్ ఎన్నింటి కంటే?

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా 'విశ్వంభర' ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఆగస్టు 22న ఉదయం ఎన్ని గంటలకు ఆ లుక్ విడుదల చేసేదీ వెల్లడించింది యువి క్రియేషన్స్ సంస్థ.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్, వంశీధర్ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ ఎలా కనిపిస్తారు? ఆయన లుక్ ఎలా ఉండబోతుంది? అనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.

గురువారం ఉదయం 10.08 గంటలకు!
ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా మిడ్ నైట్ 12 గంటలకు 'విశ్వంభర' ప్రీ లుక్ విడుదల చేశారు. అందులో పర్వతాల నడుమ ప్రకాశవంతమైన కాంతి, ఆ వెలుగుకు ముందు చిరంజీవి నిలబడినట్టు ఉంది. ఆ కాంతి వెనుక ఉన్నది ఏ శక్తి? అక్కడ చిరు ఏం చేస్తున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. గురువారం (ఆగస్టు 22, చిరు బర్త్ డే) ఉదయం 10.08 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు యువి క్రియేషన్స్ వెల్లడించింది.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' - ఏ లాంగ్వేజ్ వెర్షన్ ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే?

ఆంజనేయుడి ముందు చిరంజీవుడు!
'విశ్వంభర' సినిమా యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం... చిరు బర్త్ డే కానుకగా రిలీజ్ చేయడానికి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్ రెడీ చేశారని తెలిసింది. ఆ మూడింటిలో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే... ఆంజనేయుడి విగ్రహం ముందు గదతో ఉన్న చిరంజీవి (విశ్వంభర) పోస్టర్ విడుదల కానుందట.

Also Read: బాక్సాఫీస్ బరిలో 9000 కోట్లు, ఆస్కార్స్‌లో 2 అవార్డులు... హాలీవుడ్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ రెడీ - రిలీజ్ ఎప్పుడంటే?

తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేనకు చిరు ఆ మధ్య రూ. 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన విషయం గుర్తు ఉందా? ఆ ఫోటోల్లో ఆంజనేయుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ముందు చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. సోషియో ఫాంటసీ సినిమాల్లో చిరుకు మంచి రికార్డ్ ఉంది.


'విశ్వంభర'ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ కథానాయిక కాగా... ఆషికా రంగనాథ్, సురభి, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కునాల్ కపూర్ పవర్ ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో పాటు ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ సీన్లకు సైతం లోటు లేదట. ఎంఎం కీరవాణి సంగీతంలో చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. ఇద్దరు ఆస్కార్ పురస్కార గ్రహీతలు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఛోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్.

టాప్ హెడ్ లైన్స్

Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Legendary Actor Nana Patekar Passes Away: కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం వేళ పాత వీడియో వైరల్ 
కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం వేళ పాత వీడియో వైరల్ 
Crime Thriller OTT : వరుణ్ సందేశ్ నా వైఫ్ మిస్సింగ్ - సూపర్ హిట్ జోడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
వరుణ్ సందేశ్ నా వైఫ్ మిస్సింగ్ - సూపర్ హిట్ జోడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Mandaadi OTT: ఐదు భాషల్లో తమిళ్ స్పోర్ట్స్ డ్రామా స్ట్రీమింగ్... ఓటీటీలోకి వచ్చిన 150 కోట్ల కలెక్షన్ల సినిమా
ఐదు భాషల్లో తమిళ్ స్పోర్ట్స్ డ్రామా స్ట్రీమింగ్... ఓటీటీలోకి వచ్చిన 150 కోట్ల కలెక్షన్ల సినిమా

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Embed widget