అన్వేషించండి

Vishwak Sen: విశ్వక్‌ సేన్‌ షాకింగ్‌ నిర్ణయం - ఇన్‌స్టా అకౌంట్‌ డిలీట్‌ చేసిన 'మాస్‌ కా దాస్‌', కారణం ఇదేనా?

Vishwak Sen Deleted His Instagram: యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ చేసిన పనికి అభిమానులంతా షాక్‌ అవుతున్నారు. అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ డిలీట్‌ చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌ నిలిచింది.

Vishwak Sen Deleted His Instagram Account: మాస్‌ కా దాస్‌, యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇది తెలిసి అతడి ఫ్యాన్స్‌ అంతా షాక్‌ అవుతున్నారు. ఇంతకి ఏం చేశాడంటే.. విశ్వక్‌ సేన్‌ యాటిట్యూడ్‌ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. తరచూ తన కామెంట్స్, తీరుతో వార్తల్లో నిలుస్తుంటాడు. అలాగే తన సినిమాల విషయంలో, ప్రమోషన్స్‌ ఆసక్తి ఉండేలా చూసుకుంటాడు. ఇక వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రయోగాలు చేసి ఆడియన్స్‌ని మెప్పించే విషయంలో ముందుంటాడు. ఏ ఈవెంట్‌ అయినా తన కామెంట్స్‌ ఆకట్టుకుంటాడు. తన మూవీ ప్రమోషన్స్‌లో విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌ ఫాలో అవుతుంటాడు.

ఇప్పటి యంగ్‌ హీరోల్లో విశ్వక్‌ సేన్‌ ఫుల్‌ యాక్టివ్‌ అని చెప్పాలి. సినిమాలతో ఎంత బిజీగా విశ్వక్‌ సేన్‌ సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటాడు. తన మూవీ అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియాతో ఖాతాలో పంచుకుంటుంటాడు. అయితే, విశ్వక్‌ సేన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ని డిలీట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడి అకౌంట్‌ సెర్చ్‌ చేయగా ఆఫీషియల్‌ అకౌంట్‌ కనిపించడం లేదు. కానీ, తన ట్విటర్‌ ఖాతా మాత్రం ఉంది. సెర్చ్‌లో ఆఫీషియల్‌ ఇన్‌స్టా అకౌంట్‌ కనిపించకపోవడం అతడు అకౌంట్‌ డిలీట్‌ చేశాడంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌ను డిలీట్‌ చేయడానికి కారణం ఏంటన్నది తెలియదు. కానీ విశ్వక్‌ చేసిన ఈ పనికి అభిమానులంతా షాక్ అవుతున్నారు. 

కారణం ఇదేనా

ఇటీవల విశ్వక్‌ సోషల్‌ మీడియాతో వేదికగా ఓ యూట్యూబర్‌తో గొడవ పడ్డ సంగతి తెలిసిందే. ప్రభాస్‌ 'కల్కి 2898 AD'చూసిన ఓ యూట్యూబర్‌ నెగిటివ్‌ రివ్యూ ఇచ్చాడు. ఈ విషయమైన విశ్వక్‌ అతడితో గొడవ పడిన విషయం తెలిసిందే. రెండు రోజుల ఇది చర్చనీయాంశం అయ్యింది. ‘ఇండస్ట్రీ అంటే వేలాది కుటుంబాలు. ఎన్నో కుటుంబాలను ఈ పరిశ్రమపైనే ఆధారపడి బ్రతుకుతున్నారు. అలాంటి గొప్ప పరిశ్రమ అంటే యూట్యూబర్లకు సరదా అయిపోయింది. సినిమాలపై అభిప్రాయలు చెప్పేవారు ఏదైనా షార్ట్‌ ఫిలిం తీసి చూపించండి. సినిమా కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అంటూ కల్కి నెగిటివ్‌ రివ్యూపై స్పందించాడు. అంతకు ముందు విశ్వక్‌ సేన్‌ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీపై కూడా విమర్శలు వచ్చాయి. ఇలా వరుసగా విమర్శలు, వివాదాలు రావడంతో విశ్వక్‌ సేన్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

తన ట్విటర్‌ ఖాతాను అలాగే ఉంచిన విశ్వక్‌ ఇన్‌స్టా అకౌంట్‌ డిలీట్‌ చేయడమేంటని మరోవైపు అందరిలో సందేహాలు వస్తున్నాయి. మళ్లీ అతడు ఇన్‌స్టాలోకి రీఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చూడాలి. కాగా విశ్వక్‌ సేన్‌ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. 2024లోనే వరుసగా ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇవి రెండు ఆశించిన విజయం సాధించలేకపోయాయి. మిక్సడ్‌ టాక్ తెచ్చుకున్నాయి. కానీ, ‘గామి’లో విశ్వక్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌ను ఎంచుకొని తన నటన విశ్వక్ అందరినీ ఆశ్చర్యపరిచాడని ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌ ‘మెకానిక్ రాకీ’ లాంటి మరో మాస్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Also Read: సమంత కొత్త వెబ్ సిరీస్... హిట్ కాంబినేషన్‌లో మూడోది, టైటిల్ ఏంటో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Pooja Hegde Marriage : పెళ్లీ పీటలెక్కబోతున్న స్టార్ హీరోయిన్ - అరేంజ్డ్ మ్యారేజ్‌కు బుట్టబొమ్మ గ్రీన్ సిగ్నల్?... ఆ వార్తల్లో నిజమెంత!
పెళ్లీ పీటలెక్కబోతున్న స్టార్ హీరోయిన్ - అరేంజ్డ్ మ్యారేజ్‌కు బుట్టబొమ్మ గ్రీన్ సిగ్నల్?... ఆ వార్తల్లో నిజమెంత!
Gatta Kusthi 2 OTT : మూడు రోజుల్లోనే టాప్ ట్రెండింగ్‌లోకి తమిళ మూవీ - టాప్ 5 రీజన్స్... ఎందుకు, ఎందులో చూడాలంటే?
మూడు రోజుల్లోనే టాప్ ట్రెండింగ్‌లోకి తమిళ మూవీ - టాప్ 5 రీజన్స్... ఎందుకు, ఎందులో చూడాలంటే?
Main Vaapas Aaunga OTT : ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ - దేశ విభజన మధ్య నలిగిన ప్రేమ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ - దేశ విభజన మధ్య నలిగిన ప్రేమ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Embed widget