అన్వేషించండి

Vijay Varma: కరీనాతో అలాంటి సీన్, చాలా భయమేసిందంటున్న తమన్నా బాయ్ ఫ్రెండ్

కరీనా కపూర్, విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా వెబ్ సిరీస్ ‘జానే జాన్’. త్వరలో స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా కరీనా గురించి విజయ్ వర్మ ఆసక్తికర విషయాలు చెప్పారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. రోజు రోజుకు ఓటీటీల విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆమె కూడా వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగానే తొలి సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'జానే జాన్' పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కు రానుంది.  క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ సిరీస్ కు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. కరీనా కపూర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ లో, విజయ్ వర్మ,  జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలను పోషించారు.

ఆమెతో శృంగార సీన్లలో నటించాలంటే భయం వేసేది- విజయ్

తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా చిత్రబృందం ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా నటుడు విజయ్ వర్మ కరీనా కపూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఓ అద్భుత నటిగా అభివర్ణించారు. ఆమె మంచి మనసు కలిగిన వ్యక్తి అన్నారు. ఈ సందర్భంగా ఒకప్పుడు తాము కరీనా సినిమాలు చూసి ఎలా ఎంజాయ్ చేసేదో చెప్పుకొచ్చారు. “మేము ఆమె సినిమాలు చూస్తూ  విజిల్స్ కొట్టే వాళ్లం. ఆమెను అభిమాన హీరోయిన్ గా భావించేవాళ్లం. ఇప్పుడు ఆమెతో కలిసి నటించడం సంతోషంగా ఉంది” అన్నారు.  ఇక రొమాంటిక్ సన్నివేశాల్లో తనతో కలిసి నటించడం చాలా భయం కలిగించిందన్నారు. ఆమెతో కలిసి శృంగార సన్నివేశాలు చేసే సమయంలో తన శరీరంలో వణుకు పుట్టేదన్నారు. “ఆమె అద్భుతంగా నటించగలదు. ఆమె ఎంత అందంగా ఉంటుందో, అంతకు మించి ప్రశాంతంగా ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.

‘జానే జాన్’ కథ ఏంటంటే?

ఒంటరి జీవితాన్ని గడిపే ఒక స్త్రీ,  ఒక పోలీస్ ఆఫీసర్,  ఒక టీచర్ చుట్టూ ఈ వెబ్ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. మాయ డిసౌజా అనే మహిళ, కొన్ని కారణాలతో భర్తను చంపేస్తుంది. ఆ హత్య గురించి బయటకు తెలియకుండా దాచిపెట్టడానికి ఆమె చాలా ప్రయత్నిస్తుంది. ఇంతకీ ఆమె ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా? లేదా? అనే ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సిరీస్ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించి ప్రోమో విడుదల అయ్యింది.  కరీనా మాయా డిసౌజా పాత్రలో కనిపించగా,  జైదీప్ పోలీసు అధికారిగా, విజయ్ వర్మ కరీనా నైబర్ గా నటిస్తున్నారు. ఇందులో తన కూతురుని కాపాడుకునేందుకు కరీనా పడే తపనను అద్భుతంగా చూపించారు.  

కరీనా పుట్టిన రోజునే ‘జానే జాన్’ స్ట్రీమింగ్

సెప్టెంబర్ 21న కరీనా కపూర్ తన 43వ పుట్టిన రోజును జరుపుకోబోతోంది. అదే రోజు ఈ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ జపనీస్ రచయిత కీగో హిగాషినో 2005లో రాసిన నవల ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ ఆధారంగా రూపొందించబడింది. జానీ జాన్ క్రాస్ పిక్చర్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్‌ తో కలిసి 12వ స్ట్రీట్ ఎంటర్‌టైమెంట్,  నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించబడింది.  కరీనా చివరిగా ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేదు.

Read Also: హైదరాబాద్ ప్రజల నెత్తుటి కథ ‘రజాకార్’ - టీజర్ చూశారా

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget