Vijay Deverakonda New Movie : రొమాంటిక్ కామెడీ జానర్‌లో విజయ్ దేవరకొండ - ఆ డైరెక్టర్‌తో కొత్త మూవీ ఫిక్స్
Vijay Deverakonda : రణబాలి తర్వాత విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులో లైన్లో ఉన్నాయి. రౌడీ జనార్దనతో పాటు త్వరలోనే రొమాంటిక్ కామెడీ మూవీలో నటించబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు.

Vijay Deverakonda Clarifies On His Next Movie : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'రణబాలి' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో విజయ్ తన నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చారు.
రొమాంటిక్ కామెడీ జానర్‌లో
ప్రస్తుతం 'రౌడీ జనార్ధన' మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోందని చెప్పారు విజయ్. ఇష్క్, మనం, 24, హలో వంటి మూవీస్‌కు దర్శకత్వం వహించిన విక్రమ్ కె కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. ఆయన చెప్పిన యూనిక్ స్క్రిప్ట్ తనకు నచ్చిందని... త్వరలోనే ఆ జానర్‌లో ఓ మూవీ చేయబోతున్నట్లు చెప్పారు.
'రణబాలి' తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన మూవీ చేస్తున్నారు విజయ్. ఇందులోనూ పక్కా, మాస్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుండగా... సీనియర్ హీరో రాజశేఖర్ విలన్ రోల్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అలాగే, 'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయబోతున్నారు. ఇలా వరుస ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు























