Nagarjuna : రిలీజ్ డేట్... సరైన ప్లానింగ్ ఉండాలి - వాయిదాలపై నాగ్ అసహనం... ఆ పెద్ద మూవీ అదేనా?
Nagarjuna Reaction : మూవీ రిలీజెస్ విషయంలో ముందు ఒక డేట్ చెప్పి ఆ రోజున వాయిదా పడడంపై కింగ్ నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. సరైన ప్లానింగ్ ఉండాలని అభిప్రాయపడ్డారు.

Nagarjuna Reaction Over Movie Release Postponement : ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ మూవీస్ రావడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుంది. ముందు ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా అనుకున్న డేట్‌కు వర్క్స్ కంప్లీట్ కాక సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నారు. మొన్నటి పెద్ది, ప్యారడైజ్ నుంచి నిన్నటి ఆదర్శ కుటుంబం వరకూ ఇదే జరిగింది. తాజాగా, మూవీ రిలీజ్, వాయిదాలపై కింగ్ నాగార్జున ఓ ఈవెంట్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నాగార్జున సమర్పణలో అనీష్ హీరోగా పరిచయం అవుతున్న మూవీ 'ఇట్లు అర్జున' (Itlu Arjuna). ఈ మూవీని తొలుత అక్టోబర్ 2న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అయితే, అదే డేట్‌కు 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ చేస్తానని ప్రకటించారు. దీంతో చిన్న సినిమా టీమ్ డేట్ మార్చుకుంటే మళ్లీ వెంకీ మూవీ అక్టోబర్ 9న రిలీజ్ అన్నారు. దీంతో 'ఇట్లు అర్జున' సినిమాను అక్టోబర్ 30న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. వెంకటేశ్ త్రివిక్రమ్ మూవీ మాత్రం ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. దీనిపై ప్రశ్నలు ఎదురవగా నాగ్ రియాక్ట్ అయ్యారు. మూవీ పేరు చెప్పకుండానే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
చెప్పిన డేట్‌కు రాకుంటే...
రిలీజ్ డేట్స్ మారుతుంటే మా టీమ్ షేక్ అయిపోతుందని... సాంగ్స్, ట్రైలర్, టీజర్ అన్నీ అయిపోయాయని అన్నారు నాగార్జున. 'మా మూవీ రిలీజ్ డేట్ చెప్పిన రోజున ఓ పెద్ద సినిమా వస్తుందని డేట్ మార్చాం. మళ్లీ అది వాయిదా పడిందని ఇప్పుడు 30కు మారాం. నేను అదే లాస్ట్ అవుతుందని నమ్ముతున్నా. సినిమా చెప్పిన డేట్‌కు రావాలి. లేకుండా ముందే డేట్ ఇవ్వకూడదు. డేట్ చెప్పి... ఆ రోజు రాకపోవడం కరెక్ట్ కాదు.
సినిమాను ఎవరూ కావాలని వాయిదా వేయరు. అయినా, సరైన ప్లానింగ్ ఉండాలి. కనీసం నెలన్నర ముందే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. టీంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే తప్ప అనౌన్స్ చేసిన తేదీకే సినిమాను రిలీజ్ చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.' అని అన్నారు. అయితే, డైరెక్ట్‌గా చెప్పకపోయినా నాగార్జున ఆదర్శ కుటుంబం సినిమాను ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.
యంగ్ హీరో అనీష్ ప్రధాన పాత్రలో అనస్వర రాజన్ హీరోయిన్గా నటించిన లవ్ ఎంటర్టైనర్ ఇట్లు అర్జున. ఈ మూవీకి మహేష్ ఉప్పల దర్శకత్వం వహించగా... అక్కినేని నాగార్జున సమర్పణలో వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అక్టోబర్ 30న సినిమా రిలీజ్ చేయనున్నారు.
ట్రెండింగ్ వార్తలు























