అన్వేషించండి

రౌడీకి స్టార్ డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చినట్లేనా..?

విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకి అప్పట్లో అనౌన్స్ మెంట్ వచ్చింది. చాలా కాలంగా వార్తల్లోనే ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో అగ్ర దర్శకుడు సుకుమార్ ఓ ప్రాజెక్ట్ ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలం అయింది. పాన్ ఇండియా స్థాయిలో ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలిపారు. కానీ ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకూ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాలేదు. అసలు ఉంటుందో లేదో అనేది కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.

నిజానికి 'పుష్ప' సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే విజయ్ దేవరకొండ - సుకుమార్ ల చిత్రానికి ప్రకటన వచ్చింది. అప్పటికి పుష్ప సెకండ్ పార్ట్ తీయాలనే ఆలోచన లేకపోవడంతో, అల్లు అర్జున్ మూవీ పూర్తయిన వెంటనే VD సినిమాని మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకున్నారు సుక్కు.  అయితే 'పుష్ప' రెండు భాగాలుగా మారడం.. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్లాన్స్ అన్నీ మారిపోయాయి.

'పుష్ప 2' కు ఏర్పడిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని విజయ్ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టారు సుకుమార్. మరోవైపు రౌడీ హీరో ఇతర ప్రాజెక్ట్స్ కి కమిట్ అయ్యాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన పాన్ ఇండియా మూవీ లైగర్ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మారింది. దీంతో పూరీతో అనౌన్స్ చేసిన జనగణమన సినిమా అటకెక్కింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఖుషీ సినిమాపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు వీడీ. 

ఖుషీ తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేతులు కలపనున్నాడు విజయ్'D. అలానే 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కూడా విజయ్ లైనప్ లో ఉంటాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు సుకుమార్ 'పుష్ప: ది రూల్' తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ ఓ భారీ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో VD - సుక్కూ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయబడిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సుకుమార్ - విజయ్ దేవరకొండ మూవీ సెట్స్ మీదకు వెళ్లకపోవడం.. అసలు ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. అయితే ఫాల్కన్ క్రియేషన్స్ టీమ్ ఈ పుకార్లను ఖండిస్తూ ఓ నోట్ రిలీజ్ చేసింది. దర్శక హీరోల ఇతర కమిట్మెంట్స్ పూర్తైన వెంటనే ఈ సినిమా ప్రారంభం అవుతుందని.. ఈ కలయిక బిగ్గర్ గా ఉండబోతోందని పేర్కొన్నారు. 2022 లోనే సెట్స్ పైకి వెళ్తుందని తెలిపారు. కానీ పరిస్థితులన్నీ మారిపోయాయి.

సుకుమార్ ప్రాజెక్ట్ పూర్తిగా రద్దు చేయబడిందనే రూమర్స్ ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తోంది. లైగర్ మూవీ హిట్ అయ్యుంటే రౌడీ కెరీర్ మరోలా ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఇప్పుడు శివ నిర్వాణ, గౌతమ్ తిన్ననూరి సినిమాలతో సత్తా చాటుతాడని ధీమాగా ఉన్నారు. భవిష్యత్ లో కచ్ఛితంగా సుక్కూతో VD సినిమా ఉంటుందని నమ్ముతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Thriller Series OTT : ఫ్యూచర్ ముందే తెలియడం శాపమా? వరమా? - మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా సూపర్ థ్రిల్లర్ సిరీస్... ట్రెండింగ్‌లో ట్రైలర్
ఫ్యూచర్ ముందే తెలియడం శాపమా? వరమా? - మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా సూపర్ థ్రిల్లర్ సిరీస్... ట్రెండింగ్‌లో ట్రైలర్
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
DC Movie OTT : మరో ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ యాక్షన్ థ్రిల్లర్ - రెండు ప్లాట్ ఫామ్స్‌లో DC మూవీ స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ యాక్షన్ థ్రిల్లర్ - రెండు ప్లాట్ ఫామ్స్‌లో DC మూవీ స్ట్రీమింగ్
Alias Rukmini Release Date : నాని నితిన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ - అలియాస్ రుక్మిణి వచ్చేది ఎప్పుడంటే?
నాని నితిన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ - అలియాస్ రుక్మిణి వచ్చేది ఎప్పుడంటే?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
Embed widget