అన్వేషించండి

Family Star: 'ఫ్యామిలీ స్టార్'గా మారిపోయిన రౌడీ బాయ్ - కొబ్బరికాయ లేదని తలను పగలగొట్టేశాడు

పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా? అంటున్నాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. పరశురామ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' టైటిల్ గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయింది. 

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ రిజల్ట్ తో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల 'ఖుషి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో.. ప్రస్తుతం 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో #VD12 మూవీ చేస్తున్నారు. దీంతో పాటుగా పరశురాం పెట్లా డైరెక్షన్ లో #VD13 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు బుధవారం (అక్టోబర్ 18) సాయంత్రం ఈ మూవీ టైటిల్ అండ్ గ్లింప్స్ ను మేకర్స్ ఆవిష్కరించారు. 

గతంలో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అందుకే ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న VD13 మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ అదే టైటిల్‌ను ఇప్పుడు అధికారికంగా ప్రకటిస్తూ.. గ్లింప్స్ ను రిలీజ్ చేసారు. అంతేకాదు సినిమాను ఎప్పుడు విడుడల చేస్తారనే విషయాన్ని కూడా ప్రకటించారు. 

'ఫ్యామిలీ స్టార్' టైటిల్ టీజర్ లోకి వెళ్తే, ''లైన్ లో నిలబడి ఉల్లిపాయలు తేవడం, టైంకి లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపించడాలు అనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే'' అంటూ విజయ్ దేవరకొండకు విలన్ అజయ్ ఘోష్ వార్నింగ్ ఇవ్వడంతో ప్రారంభమైంది. దీనికి కౌంటర్ గా ''భలే మాట్లాడతారన్నా మీరందరూ.. ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా?.. ఐరనే వంచాలా ఏంటి?'' అంటూ విజయ్ ఒక ఇనుప రాడ్ ని సింపుల్ గా వంచేయడమే కాదు, ఒకడి తల పగలకొట్టాడు. అంతేకాదు 'సారీ బాబాయ్.. కంగారులో కొబ్బరి కాయ తేవడం మర్చిపోయి, తలకాయ కొట్టేసాను' అంటూ తన స్టైల్ లో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. 

'ఫ్యామిలీ స్టార్' టైటిల్ గ్లిమ్స్ ని బట్టి చూస్తే.. ఇందులో విజయ్ దేవరకొండ పాత్ర ఫ్యామిలీ మ్యాన్ గా చాలా సాఫ్ట్ గా ఉన్నప్పటికీ, తన జోలికి వస్తే మాత్రం తన బలాన్నంతా చూపించే వైల్డ్ మ్యాన్ గా మారుతాడని అర్థమవుతోంది. ప్రతి కుటుంబంలో ఒక హీరో ఉంటాడు అనే పాయింట్ ను చెప్పబోతున్నారని తెలుస్తోంది. 'గీత గోవిందం' తరహాలోనే ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటుగా కావాల్సినంత మాస్, యాక్షన్ కూడా ఉంటుందని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. 

కుటుంబ విలువలు, భాధ్యతలు వంటి అంశాలతో పాటుగా యాక్షన్ కలబోసి దర్శకుడు పరశురామ్ ఈ కథ రాసుకున్నారని తెలుస్తోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రం కావడంతో 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారనిపిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్, 'మజిలీ' బ్యూటీ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ టీజర్ చివర్లో 'ఏవండీ' అంటూ మృణాల్ ఎంట్రీ ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే చాలా ఈజ్ తో డైలాగ్స్ చెప్పి అలరించారు. 

'ఫ్యామిలీ స్టార్' సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. ఇది SVC బ్యానర్ లో రాబోతున్న 54వ చిత్రం. దీనికి 'జోష్' డైరెక్టర్ వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా రిలీజైన వీడియోకి ఆయన కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది. కేయూ మోహన్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 

'ఫ్యామిలీ స్టార్' చిత్రాన్ని 2024 సంక్రాంతికి తెలుగు తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ముందు నుంచే పొంగల్ కానుకగా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో VD12 సినిమాని వెనక్కి తీసుకెళ్లి, VD13 మూవీకి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేస్తూ వచ్చారు. కంటెంట్ చూస్తుంటే పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ అనే ఫీలింగ్ కలుగుతోంది. మరి బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ తట్టుకొని విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Lokesh Kanagaraj Allu Arjun : అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
October Third Week OTT Movies : అక్టోబర్ మూడో వారం ఓటీటీ మూవీస్ - ఒకే వీక్‌లో 23 సినిమాలు స్ట్రీమింగ్... ఈ దసరాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
అక్టోబర్ మూడో వారం ఓటీటీ మూవీస్ - ఒకే వీక్‌లో 23 సినిమాలు స్ట్రీమింగ్... ఈ దసరాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget