Family Star Movie: ఫస్ట్‌టైం ఆ దేశంలో తెలుగు సినిమా రిలీజ్ - రికార్డు సెట్ చేసిన విజయ్ 'ఫ్యామిలీ స్టార్'
Family Star Movie: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ అరుదైన ఘనత సాధించింది. ఆ దేశంలో రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
Family Star Movie To Be Screened in Uruguay!: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ రిలీజ్‌కు ఇంకా రెండు రోజులే ఉంది. ఏప్రిల్ 5న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. 'గీతా గోవిందం'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ-పరశురాం పెట్ల ఈ మూవీతో మళ్లీ కలిశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో 'ఫ్యామిలీ స్టార్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్య మన తెలుగు సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ఓవర్సిస్‌లో మన తెలుగు హీరో సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి.
దాంతో వివిధ దేశాల్లోనూ మన తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూకేతో పాటు పలు దేశాల్లో తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. రీసెంట్‌గా వచ్చిన రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అయితే అత్యధిక దేశాల్లో విడుదలైన తెలుగు సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' కూడా అరుదైన రికార్డు సెట్ చేసింది. సాధారణంగా మన తెలుగు సినిమాలు అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాలకు వరకు అక్కడ చాలా దేశాల్లో మన తెలుగు సినిమాలు స్క్రినింగ్ అవుతుంటాయి. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే అమెరికాలోని అన్ని అన్నిదేశాలు, అన్ని రాష్ట్రాల బాక్సాఫీసు వద్ద సందడి నెలకొంటుంది. అయితే ఇప్పటి వరకు అమెరికాలోని ఈ దేశంలో మన తెలుగు సినిమా ఇంతవరకు అడుగుపెట్టలేదు.
తొలి తెలుగు సినిమాకు ఫ్యామిలీ స్టార్ రికార్డు
అమెరికా అంతట మన తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. అలాంటిది ఈ ఒక్క రాష్ట్రంలో ఇంతవరకు మన తెలుగు సినిమా రిలీజ్ కాకపోవడం గమనార్హం. అదే సౌత్ అమెరికాలోని ఉరుగ్వే దేశం. అలాంటి ఈ దేశంలోనూ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కాబోతుంది. ఈ దేశంలోని థియేటర్లో స్క్రినింగ్ అవుతున్న తొలి తెలుగు సినిమాగా ఫ్యామిలీ స్టార్ రికార్డు సెట్ చేసింది. ఇదే విషయాన్ని మూవీ టీం స్వయంగా వెల్లడించింది. "ఫ్యామిలీ స్టార్ ఉరుగ్వే దేశం స్క్రినింగ్ కాబోతుంది. తెలుగు సినీ చరిత్రలోనే ఇది ఫస్ట్‌టైం. ఫ్యామిలీ స్టార్ షైన్ ఇన్ ఉరుగ్వే దేశం(The Family Star ⭐ Shines In Uruguay)"మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. ఫ్యామిలీ స్టార్ మూవీని అగ్ర నిర్మాతలు దిల్ రాజు ఆయన సోదరుడు శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
#FamilyStar Creates History As The First Indian Film To Be Screened In Uruguay!
— GSK Media (@GskMedia_PR) April 1, 2024
The Family Star ⭐ Shines In Uruguay 🇮🇳 🇺🇾@TheDeverakonda @mrunal0801 pic.twitter.com/3VC3eQMm18
జగపతి బాబు, రోహిణి హట్టంగడి, వాసుకి, అచ్యుత్ కుమార్ సహా పలువురు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి గోపీసుందర్ మ్యూజిక్ అందించారు. కాగా ఫ్యామిలీ స్టార్‌లో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే. 'సీతా రామం' తర్వాత తెలుగులో ఆమె నటించిన చిత్రమిది. 'ఏవండీ...' అంటూ ట్రైలర్‌లో ఆవిడ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంటంది. అలాగే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మా ఏవండి.. అంటూ ఆమెచేసిని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్' థియేటర్లలో విడుదల కానుంది. తెలుగుతో పాటు ఆ రోజే తమిళంలోనూ విడుదల చేస్తున్నారు. హిందీలో రెండు వారాల తర్వాత విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
Also Read: చిరంజీవి బెడ్ రూంలో అమ్మ ఫోటో చూశాను - సావిత్రి కూతురు ఎమోషనల్