By: ABP Desam | Updated at : 13 Jun 2023 04:42 PM (IST)
'విక్రమ్ రాథోడ్' సినిమాలో విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోనీ (Vijay Antony) పేరుతో కంటే 'బిచ్చగాడు', 'బిచ్చగాడు 2' చిత్రాల్లో కథానాయకుడిగా ఆయన ఎక్కువ గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆ విజయాల రేంజ్ అలా ఉంది మరి. 'బిచ్చగాడు' బ్రాండ్ వేల్యూ అటువంటిది! ఆ రెండు సినిమాల మధ్య ఆయన నటించిన సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఏవీ 'బిచ్చగాడు' స్థాయి విజయాలు అందుకోలేదు. మే 19 విడుదలైన 'బిచ్చగాడు 2' తమిళంలో కంటే తెలుగులో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడీ విజయం తర్వాత మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.
'విక్రమ్ రాథోడ్'గా విజయ్ ఆంటోనీ
రాథోడ్... విక్రమ్ రాథోడ్... ఆ పాత్రలో మాస్ మహారాజ రవితేజ చేసిన పెర్ఫార్మన్స్ మామూలుగా ఉండదు. విక్రమ్ రాథోడ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఆయన గుర్తుకు వస్తారు. ఇప్పుడు ఆ పేరును తెలుగులో విజయ్ ఆంటోనీ సినిమాకు టైటిల్ కింద ఫిక్స్ చేశారు.
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తమిళ సినిమా 'తమిళరసన్' (Tamilarasan). ఈ చిత్రానికి బాబు యోగేశ్వరన్ (Babu Yogeswaran) దర్శకత్వం వహించారు. అపోలో ప్రొడక్షన్స్, ఎస్.ఎన్.ఎస్. మూవీస్ సంయుక్త సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్. కౌసల్య రాణి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'విక్రమ్ రాథోడ్' పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీ శివ గంగ ఎంటర్ ప్రైజెస్ సంస్థ అధినేత కె బాబు రావు తెలుగు ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకు వస్తున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం
Vikram Rathore First Look : 'విక్రమ్ రాథోడ్' ఫస్ట్ లుక్ చూస్తే... ముఖంపై గాయాలతో విజయ్ ఆంటోనీ కనిపిస్తున్నారు. ఎవరో తుపాకీతో ఆయనకు గురి పెట్టడం, ఆ సీరియస్ లుక్ కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. త్వరలో సినిమా విడుదల తేదీని వెల్లడిస్తామని 'శ్రీ శివ గంగ ఎంటర్ ప్రైజెస్' కె. బాబు రావు తెలిపారు.
విజయ్ ఆంటోనీతో పాటు సురేష్ గోపి కూడా...
'విక్రమ్ రాథోడ్'లో మలయాళ సీనియర్ హీరో సురేష్ గోపి ఓ ప్రధాన పాత్ర చేశారు. విజయ్ ఆంటోనీతో పాటు ఆయన పాత్ర కూడా చాలా బావుంటుందని, ఇదొక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. రమ్యా నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించగా.. ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ఇతర పాత్రల్లో నటించారు.
Also Read : అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు అడ్డం పడిన తెలుగు కమ్యూనిటీ
'బిచ్చగాడు 2' విజయంతో...
విజయ్ ఆంటోనీకి 'బిచ్చగాడు 2' విజయం మళ్ళీ ఊపిరి పోసింది. ఆయన మార్కెట్ స్టామినా బావుందని ప్రూవ్ చేసింది. దాంతో ఆయన సినిమాలపై మళ్ళీ ట్రేడ్ సర్కిళ్లలో బజ్ క్రియేట్ అయ్యింది. విజయ్ ఆంటోనీ నటిస్తున్న తమిళ సినిమాలు అన్నీ తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి చూస్తున్నారు.
Also Read : ప్రభాస్ అడగలేదు, మేమే కొన్నాం - 'ఆదిపురుష్' రైట్స్‌పై టీజీ విశ్వప్రసాద్
Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే
Raveena Tandon: ఆయన పెదాలు తాకగానే- షాకింగ్ విషయాన్ని వెల్లడించిన రవీనా టాండన్!
Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?
Ritika Singh: ఆ ఘటన చూసి గుండె మండింది, ఇబ్బంది అనిపించినా అమ్మాయిలకు వాటిని నేర్పించాల్సిందే
Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!
ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్ - సరిహద్దుల్లో భారీ భద్రత
/body>