అన్వేషించండి

Venu Swamy: వేణు స్వామి ఇంట్లో విషాదం... పై లోకాలకు వెళ్ళిన ఇంటి పెద్ద దిక్కు

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన ఇంట పెద్దదిక్కు పై లోకాలకు వెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venu Swamy) గురించి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖుల జీవితాల గురించి ఆయన చెప్పిన విషయాలపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంలో ఓ విషాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

పై లోకాలకు వెళ్లిన వేణు స్వామి మాతృమూర్తి
వేణు స్వామికి జన్మనిచ్చిన తల్లి, శ్రీమతి పరాంకుశం విజయ లక్ష్మి గారు ఈ రోజు... అనగా అక్టోబర్ 4, శుక్రవారం నాడు తుది శ్వాస విడిచారు.‌ ''మా అమ్మ గారు శ్రీమతి పరాంకుశం విజయ లక్ష్మి గారు ఈరోజు ఉదయం పరమపదించారు (మరణించారు)'' అని సోషల్ మీడియా వేదికగా వేణు స్వామి వెల్లడించారు. తన తల్లి ఫోటోని ఆయన షేర్ చేశారు.

Also Read'శ్వాగ్' రివ్యూ: 'రాజ రాజ చోర' మేజిక్ రిపీట్ అయ్యిందా... శ్రీ విష్ణుకు హ్యాట్రిక్ వచ్చిందా?

Venu Swamy: వేణు స్వామి ఇంట్లో విషాదం... పై లోకాలకు వెళ్ళిన ఇంటి పెద్ద దిక్కు

వేణు స్వామి జ్యోతిష్యం మీద విమర్శలు
అక్కినేని నాగ చైతన్య, సమంత వైవాహిక జీవితంలో కలతలు ఉన్నాయని, ఆ ఇద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండరని, అతి త్వరలో విడిపోతారని మీడియా ముఖంగా తొలుత చెప్పింది ఆయనే. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత తాను చెప్పింది అక్షర సత్యమైందని పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

నాగచైతన్య, సమంత విడాకుల గురించి మాత్రమే కాదు... రెబల్ స్టార్ ప్రభాస్ జాతకంలో ఇక విజయాలు లేవని సైతం ఆయన చెప్పుకొచ్చారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం జరిగిన కొన్ని రోజులకు వాళ్ళిద్దరూ కూడా విడిపోతారని జోస్యం చెప్పారు. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కెసిఆర్), ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికార పగ్గాలు చేపడతారని కూడా తెలిపారు. వేణు స్వామి చెప్పిన జోస్యాల్లో కొన్ని నిజం కాలేదు. 

'సలార్', 'కల్కి 2898 ఏడి' సినిమాలతో ప్రభాస్ విజయాలు అందుకుంటే... రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన వేర్వేరు ఎన్నికలలో ముఖ్యమంత్రుల తమ పదవి కోల్పోయారు. ఏపీలో అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇటువంటి అంశాల కారణంగా వేణు స్వామి మీద తీవ్రమైన విమర్శలు రావడంతో ఇకపై తాను జాతకం చెప్పనని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు.

Also Read: శ్రీ విష్ణు 'స్వాగ్'ఓటీటీ పార్ట్నర్ ఏది? ఆ సినిమా డిజిటల్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

అక్కినేని నాగచైతన్యతో శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఎక్కువ రోజులు కలిసి ఉండరని తెలిపారు. శుభమా అని నిశ్చితార్థం చేసుకుంటే పెళ్లి కాకముందే పెటాకులు అవుతుందని చెప్పడం ఏమిటని సామాన్యుల సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో వేణు స్వామి తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని, గతంలో నాగచైతన్య - సమంత వైవాహిక జీవితానికి సంబంధించి చెప్పిన జోస్యానికి కొనసాగింపుగా శోభితతో జరిగిన నిశ్చితార్థం గురించి చెప్పానని చెప్పుకొచ్చారు. వేణు స్వామి ఒక పబ్బుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో నాగచైతన్య, సమంత మధ్య జరిగిన గొడవల గురించి మాట్లాడితే ఆయన తానేదో శాస్త్రం ప్రకారం తెలుసుకున్నట్లు మీడియా ముందు కలరింగ్ ఇచ్చారనే విమర్శల సైతం ఉన్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Embed widget