Venkatesh Daughter Marriage : వెంకటేష్ కుమార్తె నిశ్చితార్థంలో చిరంజీవి, మహేష్ బాబు
Hayavahini Engagement Photos : వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దగ్గుబాటి ఇంట జరిగిన ఈ వేడుకకు తెలుగు సినిమా ప్రముఖులు, అగ్ర హీరోలు హాజరయ్యారు.
దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఒకరు కాదు... ఇద్దరు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మూవీ మొఘల్ డా. రామానాయుడు మనవడు, అగ్ర నిర్మాత డి. సురేష్ బాబు తనయుడు అభిరామ్ డిసెంబర్ 6న ఏడు అడుగులు వేయనున్నారు. శ్రీలంకలో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయం తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలుసు. అభిరామ్ కాకుండా దగ్గుబాటి ఫ్యామిలీలో మరొక వివాహం జరగనుంది.
త్వరలో వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి!
రామానాయుడు మనవరాలు, విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని వివాహం కూడా త్వరలో జరగనుంది. బుధవారం ఆమె నిశ్చితార్థం జరిగింది. వెంకీకి మొత్తం ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. పిల్లలను లైమ్ లైట్, మీడియాకు కొంచెం దూరంగా ఉంచుతారు. పెద్ద కుమార్తె ఆశ్రిత ప్రేక్షకులకు తెలుసు. యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటారు. ఫుడ్ గురించి వీడియోస్ చేస్తారు. వినాయక్ రెడ్డితో 2019లో ఆమె వివాహం జరిగింది. ఇప్పుడు రెండో కుమార్తె వివాహానికి వెంకీ ఫ్యామిలీ రెడీ అయ్యింది.
వెంకీకి కాబోయే అల్లుడిది ఏ ఊరు?
వెంకటేష్ (Venkatesh Second Daughter Engagement)కు కాబోయే అల్లుడిది విజయవాడ అని తెలిసింది. వెంకీ అల్లుడి ఫ్యామిలీలో అందరూ డాక్టర్లు అని సమాచారం. సాధారణంగా వ్యక్తిగత అంశాలను వెంకటేష్ బయటకు రానివ్వరు. అలాగే, అల్లుడి ఫ్యామిలీ వివరాలు కూడా బయటకు రానివ్వడం లేదు. అయితే విజయవాడలో నిశ్చితార్థం జరిగింది.
చిరంజీవి, మహేష్ బాబు సందడి!
వెంకటేష్ అమ్మాయి నిశ్చితార్థానికి దగ్గుబాటి ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు అందరూ హాజరు అయ్యారు. రానా, మిహికా దంపతులతో పాటు అక్కినేని నాగ చైతన్య కూడా అటెండ్ అయ్యారని తెలిసింది. ఇంకా తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు.
Also Read : హాట్ కేకులా పాయల్ రాజ్ పుత్ అండ్ అజయ్ భూపతి 'మంగళవారం' డిస్ట్రిబ్యూషన్ రైట్స్!
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీకి చాలా సన్నిహితులైన కొందరు ప్రముఖులు కూడా సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్వరలో పెళ్లి తేదీ, వివాహ వేదిక, ఇతర వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Also Read : చిరంజీవి కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - ఆ పేరు సినారే ఓ పుస్తకం కూడా రాశారండోయ్
ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న సినిమాలకు వస్తే... నటుడిగా సినిమా ప్రయాణంలో 75వ మైలురాయి చేరుకున్నారు. ఆయన హీరోగా నటించిన 'సైంధవ్' సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. నిజానికి ఈ సినిమాను తొలుత డిసెంబర్ 23న విడుదల చేయాలని భావించారు. అయితే... ప్రభాస్ 'సలార్' విడుదల అవుతుండటంతో కొంచెం వెనక్కి వెళ్లారు. ఆ సినిమాకు 'హిట్' ఫ్రాంచైజీ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. అందులో శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెరేమియా, రహానీ శర్మ తదితరులు నటించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial