అన్వేషించండి

Venkatesh: పూర్తి కథ తెలియకుండా ఎవరినీ జడ్జ్ చేయకండి - వెంకీ మామకు ఏమైంది? అలాంటి పోస్ట్ పెట్టారు?

Venkatesh Daggubati: సీనియర్ హీరో వెంకటేశ్.. తన సోషల్ మీడియాలో పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలకంటే తనకు నచ్చే కొటేషన్స్‌నే ఎక్కువగా షేర్ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఒక కొటేషన్ చర్చలకు దారితీసింది.

Venkatesh Daggubati Instagram Story: ఈరోజుల్లో ఎవరి పర్సనల్ లైఫ్ అయినా ఎలా ఉందో తెలుసుకోవడానికి వారి సోషల్ మీడియా చూస్తే చాలు.. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాటికి నెటిజన్లు నానార్థాలు వెతుకుతూ ఉంటారు. వారి పర్సనల్ లైఫ్‌లో ఏదో జరిగిందని అందుకే ఇలా పోస్ట్ చేశారని ఫిక్స్ అయిపోతుంటారు. ప్రస్తుతం సీనియర్ హీరో వెంకటేశ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసే కోట్స్ గురించి కూడా నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. తాజాగా ఆయన పెట్టిన స్టోరీ చూస్తుంటే ఎవరికో ఇన్‌డైరెక్ట్‌గా చెప్తున్నట్టే ఉందని భావిస్తున్నారు. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం వెంకీ మామకు అలాంటి కోట్స్ షేర్ చేయడం అలవాటే అంటున్నారు.

జడ్జ్ చేయకండి..

తాను నమ్మే సిద్ధాంతాలకు సూట్ అవుతాయని అనిపించిన కోట్స్ అన్నింటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు వెంకటేశ్. ఎప్పుడు చూసిన ఆయన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఏదో ఒక కొటేషన్ కనిపిస్తూనే ఉంటుంది. తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను షేర్ చేసినా చేయకపోయినా ఇలాంటివి మాత్రం రెగ్యులర్‌గా షేర్ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఒక కొటేషనే షేర్ చేశారు. ‘‘పూర్తి కథ తెలియకుండా ఎవరినీ జడ్జ్ చేయకండి. మీకు అన్ని అర్థమవుతాయని అనిపించినా అర్థం కావు’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేశారు వెంకీ మామ. దీంతో వెంకటేశ్.. ఇన్‌డైరెక్ట్‌గా ఎవరికో కౌంటర్ ఇస్తున్నట్టుగా ఉందని కొందరు నెటిజన్లు ఫీలవుతున్నారు.

హ్యాట్రిక్ మూవీ..

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మిస్టర్ కూల్ అంటే చాలామంది వెంకటేశ్ పేరే చెప్తారు. అందుకే ఫ్యాన్స్ అంతా తనను ప్రేమగా వెంకీ మామ అని పిలుచుకుంటారు. ఇక సినిమాల విషయానికొస్తే.. తనకు ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో హ్యాట్రిక్‌కు సిద్ధమయ్యారు వెంకటేశ్. ఇప్పటికే ఈ మూవీ గురించి ఇచ్చిన అనౌన్స్‌మెంట్ ప్రేక్షకులను హ్యాపీ చేసింది. ముందుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్ 2’.. చాలాకాలం తర్వాత వెంకీలోని కామెడీ యాంగిల్‌లో మరోసారి బయటపెట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘ఎఫ్ 3’ కూడా అదే రేంజ్‌లో హిట్ అయ్యింది. అందుకే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

షూటింగ్ స్టార్ట్..

ప్రస్తుతం అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘వెంకీ అనిల్ 3’, ‘ఎస్వీసీ 58’ అనే వర్కింగ్ టైటిల్స్‌ను ఫిక్స్ చేశారు. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కే క్రైమ్ థ్రిల్లర్ అని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ మూవీలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను పూజా కార్యక్రమంతో లాంచ్ చేశారు. పూజా కార్యక్రమం గురించి అప్డేట్‌తో పాటు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో గన్, గులాబీ.. తాళితో కట్టి ఉంటుంది. దీంతో ఈసారి వెంకటేశ్‌తో అనిల్ రావిపూడి ఏదో కొత్తగా ప్లాన్ చేశాడని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.

Also Read: ‘జనక అయితే గనక’ టీజర్ - పిల్లల స్కూల్ ఫీజులపై సుహాస్ సెటైర్ - స్మశానానికి, ఎల్‌కేజీకి లింకేంటీ?

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget