Mana Shankaravaraprasad Garu : మెగాస్టార్, నేను ఇద్దరం రప్ఫాడించేశాం - సంక్రాంతికి సౌండ్ మామూలుగా ఉండదు... వెంకీ స్పీచ్ హైలెట్స్
Venkatesh : మెగాస్టార్ చిరుతో వర్క్ ఓ వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అని విక్టరీ వెంకటేష్ అన్నారు. ఈ సంక్రాంతికి అన్నీ సినిమాలు హిట్ కావాలని ఆకాంక్షించారు.

Venkatesh Speech In Mana Shankaravaraprasad Garu Pre Release Event : ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, తాను ఇద్దరం రప్ఫాడినట్లు విక్టరీ వెంకటేష్ తెలిపారు. ఆయనతో వర్క్ చేయడం ఓ వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అని అన్నారు. 'మన శంకరవరప్రసాద్ గారు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు షేర్ చేసుకున్నారు.
అప్పుడు తమ్ముళ్లు... ఇప్పుడు అన్నయ్య
అప్పుడు తమ్ముళ్లు మహేష్, పవన్ కల్యాణ్‌లతో మల్టీ స్టారర్ చేశానని... ఇప్పుడు అన్నయ్య మెగాస్టార్‌తో మల్టీ స్టారర్ చేసినట్లు వెంకీ తెలిపారు. 'చిరంజీవి రఫ్ ఆడేస్తారు. నేను కూడా ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ అని రఫ్ ఆడాను ఇద్దరం రాఫ్ఫాడాం. రచ్చ రచ్చే. ఇప్పుడు అన్నయ్యతో చేస్తున్నా. సౌండ్ చాలా గట్టిగా ఉంటుంది. అనిల్‌తో నాది వండర్ఫుల్ కాంబో. అన్నీ సినిమాలు హిట్ చేశారు. ఇది కూడా సూపర్ హిట్ కావాలి.
మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం సంక్రాంతికి వస్తోంది. ఎప్పటిలాగే మీరు దాన్ని అద్భుతంగా ఆదరించి మంచి హిట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. సంక్రాంతి ఫిలిమ్స్ అన్ని చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే అన్ని సినిమాలు ఆడాలి.' అని అన్నారు.
Also Read : విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
మొమొరబుల్ కాంబో... వెంకీ రోల్ ఇదే
తెలుగు సినిమా చరిత్రలో చిరు, వెంకీ కాంబో ఓ మెమొరబుల్ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. 'మెగాస్టార్‌తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతలు సాహు, సుస్మితలకు థాంక్యూ. భీమ్స్ తన మ్యూజిక్‌తో ఒక ఊపు తీసుకొచ్చారు. మీసాల పిల్ల పెద్ద హిట్. అక్కడి నుంచి ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది. నయనతార మా కోసం రెండు ప్రమోషన్స్ కూడా చేశారు. వెంకీ గారు ఈ సినిమాలోకి రావడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు. నేను ఈ కథ చెప్పిన తర్వాత ఈ ఆలోచన ఇచ్చింది ఆయనే. ఈ కాంబో అందరూ ఎంజాయ్ చేస్తారు.
ఇద్దరి స్టార్స్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడాలనేదే ఎన్నో ఏళ్ల కల. అది నాకు కుదిరింది. చిరు సార్ ఎంత సాధించినా చాలా గ్రౌండ్, హంబుల్‌గా ఉంటారు. ఆయనతో ఈ 6 నెలల జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన అనుభవాలన్నీ కలిపి ఒక ఆవకాయ అన్నం ముద్దలా మాకు పెట్టారు. చిరంజీవి గారికి ఎన్నో అద్భుతమైన విజయాలున్నాయి. ఆ జాబితాలో ఈ సినిమా కూడా జాయిన్ అవ్వాలని నా చిరు కోరిక. ఆ కోరికనే మీరందరూ నెరవేరుస్తారని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సక్రాంతి సినిమాలన్నీ హిట్ కావాలి.' అని కోరారు.
'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతుండగా... ఈ నెల 12న పాన్ ఇండియా లెవల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ వేరే లెవల్‌లో ఉంది.






















