Veera Dheera Sooran: తెన్ కాశీలో 'వీర ధీర శూరన్' - విక్రమ్ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Chiyaan Vikram: చియాన్ విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వీర ధీర శూరన్'. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం భారీ సెట్‌లో శరవేగంగా జరుగుతోంది.
Vikram Veera Dheera Sooran Movie Update: చియాన్ విక్రమ్... ఎప్పుడూ ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు వైవిధ్యం అందించాలని తపన పడే కథానాయకుడు, విలక్షణ నటుడు. ఆయన హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'వీర ధీర శూరన్'. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
భారీ సెట్... స్పీడుగా షూటింగ్!
'వీర ధీర శూరన్' సినిమా విక్రమ్ 62వ సినిమా. అందుకని, విక్రమ్ అభిమానులు #chiyaan62 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హెచ్.ఆర్. పిక్చర్స్ పతాకంపై రియా శిబు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్.యు అరుణ్ కుమార్ డైరెక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తెన్ కాశీలో సినిమా కోసం భారీ సెట్ వేశారు. అందులో స్పీడుగా షూటింగ్ చేస్తున్నారు. త్వరలో సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మాస్ అండ్ రగ్డ్ లుక్కులో విక్రమ్!
Vikram Look In Veera Dheera Sooran Becomes Viral: ఇప్పటి వరకు వెండితెరపై చేయనటువంటి డిఫరెంట్ పాత్రను 'వీర ధీర శూరన్'లో విక్రమ్ చేస్తున్నారని యూనిట్ వర్గాలు తెలిపాయి. కొన్ని రోజుల క్రితం సినిమా టీజర్ విడుదల చేశారు. అందులో ఆయన మాస్ అండ్ రగ్డ్ లుక్కులో కనిపించారు. ఆ లుక్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయని చెప్పవచ్చు.
Also Read: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు విష్ణు మంచు... కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
నిహారిక మాజీ భర్త చైతన్య సెన్సేషనల్ పోస్ట్...
— ABP Desam (@ABPDesam) May 13, 2024
జనసేనకు ఆయన వ్యతిరేకమా? లేదంటే మద్దతా?#Niharika #NiharikaKonidela #ChaitanyaJonnalagadda #JanasenaParty #PawanKalyan #Janasenani #ElectionDay #Elections2024 #APElections2024 #APAssemblyElections2024https://t.co/CXFHWI40Ik
Vikram character name in Veera Dheera Sooran: ఈ సినిమాలో కాళి పాత్రలో విక్రమ్ నటిస్తున్నారు. ఈ రోల్ అందరినీ మెప్పిస్తుందని 'వీర ధీర శూరన్' టీమ్ చెబుతోంది. టీజర్ ప్రారంభం చూస్తే పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా తీశారని అనిపిస్తుంది. కాసేపటికి సీన్ మొత్తం మారిపోతుంది. కిరాణా కొట్టులో పొట్లాలు కట్టుకునే హీరో దగ్గర తుపాకులు ఎందుకు ఉన్నాయి? గురి తప్పకుండా ఆయన ఎలా కలుస్తున్నాడు? అతడి నేపథ్యం ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో మాంచి యాక్షన్ సినిమా తీశారని అర్థం అవుతోంది. మరి, సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం - పోలింగ్ బూత్ వద్ద అరుదైన దృశ్యం
విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు సిద్ధిఖీతో పాటు దర్శకుడి నుంచి నటుడిగా మారిన ఎస్.జె సూర్య, అందాల భామ దుసరా విజయన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువ సంగీత దర్శకుడు, ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలతో పాటు నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: హెచ్.ఆర్ పిక్చర్స్, నిర్మాత: రియా శిబు, రచన - దర్శకత్వం: ఎస్.యు అరుణ్ కుమార్, అసోసియేట్ నిర్మాత: రోని జకారియా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్ లిన్ లాల్, కళా దర్శకుడు: సి.ఎస్ బాలచందర్.