అన్వేషించండి

Vazhakku Movie: స్టార్ హీరోతో దర్శకుడికి గొడవ - డైరెక్టుగా ఆన్‌లైన్‌లో మూవీ రిలీజ్, ఇంతకీ ఏం జరిగిందంటే?

మలయాళీ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వజక్కు‘ సినిమా నేరుగా ఆన్ లైన్ లో విడుదల అయ్యింది. హీరోతో గొడవల కారణంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయలేకపోయినట్లు దర్శకుడు శశిధరన్ వెల్లడించాడు.

‘Vazhakku’ Director Releases Movie Online: మలయాళీ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్ర పోషించిన ‘వళక్కు’ మూవీ విషయంలో దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హీరోతో గొడవల కారణంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం సాధ్యం కాదని భావించిన ఆయన, నేరుగా ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చారు. ప్రేక్షకులు ఈ సినిమాను చూడవచ్చంటూ లింక్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇంతకీ హీరో, దర్శకుడి మధ్య గొడవ ఏంటంటే?

‘వళక్కు’ సినిమా విషయంలో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ చిత్రం 2021లోనే కంప్లీట్ అయ్యింది. ఆ సమయంలో దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్, హీరో టొవినో థామస్ మధ్య గొడవలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది. ఈ నేపథ్యం ఆయన తాజాగా ఈ సినిమా ఆన్ లైన్ లో విడుదల చేశారు. వీమియో అనే వీడియో ఫ్లాట్ ఫామ్ లో ప్రేక్షకులు ఫ్రీగా చూసేలా అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది ఈ సినిమాను ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ’లో స్క్రీనింగ్ చేశారు. విమర్శకులు సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు పలు అవార్డులు కూడా వచ్చాయి. అయితే, హీరో, దర్శకుడి మధ్య గొడవల కారణంగా ఈ సినిమా థియేటర్లలోకి రాలేదు.

హీరో టొవినోపై దర్శకుడు శశిధరన్ ఆరోపణలు

‘వజక్కు’ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు హీరో టొవినో థామస్ ఒప్పుకోలేదని దర్శకుడు ఆరోపించారు. ఈ సినిమా కారణంగా తన కెరీర్ కు ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే కారణంతో ఈ మూవీ విడుదల కాకుండా అడ్డుకుంటున్నాడని వెల్లడించారు. థియేటర్లలోనే కాదు, ఓటీటీలో రిలీజ్ కాకుండా చేస్తున్నాడని మండిపడ్డారు. 2021లోనే ఈ సినిమా కంప్లీట్ అయినా, ఇప్పటి వరకు సినిమా విడుదలకు కాకుండా చేశాడని ఆరోపించారు. 

దర్శకుడి విమర్శలపై వివరణ ఇచ్చిన టొవినో

దర్శకుడు శశిధరన్ చేసిన ఆరోపణలపై హీరో టొవినో థామస్ వివరణ ఇచ్చారు. ఈ సినిమా కోసం తాను చాలా డబ్బును ఖర్చు చేశానని, నయా పైసా కూడా వెనక్కి రాలేదని చెప్పారు. ఈ మూవీ విషయంలో శశిధరన్ వ్యవహార శైలి కారణంగానే విడుదల కాలేదని ఆరోపించారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివ్ లో ఈ సినిమా స్క్రీనింగ్ చేసే అవకాశం లభించినా దర్శకుడు ఒప్పుకోలేదని ఆరోపించారు. ఈ మూవీ ఓటీటీలో విడుదల చేసేందుకు అవరమయ్యే క్రియేటివ్ రైట్స్ ను కూడా శశిధరన్ ఇవ్వలేదన్నారు.  

ఈ సినిమా ఎందుకు రిలీజ్ కాలేదో తెలుసుకోండి- శశిధరన్

టొవినో థామస్ వివరణ నేపథ్యంలో ఈ సినిమాను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి.. ప్రేక్షకులు ఫ్రీగా చూసేలా అందుబాటులోకి తెచ్చారు శశిధరన్. ఈ సినిమాను ఎవరైనా చూడవచ్చు అంటూ సోషల్ మీడియాలో లింక్ షేర్ చేశారు. ఈ మూవీని చూస్తే ఎందుకు విడుదల కాలేదో ప్రేక్షకులకు అర్థం అవుతుందని వెల్లడించారు. ఈ సినిమాలో కునీ కుశృతి, సుదేవ్ నాయర్, అజీస్ నెడుమంగద్, బైజూ నీటో సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.   

Read Also: 'అపరిచితుడు' రీ రిలీజ్... రెండు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి మరోసారి - బాక్సాఫీస్‌ను షేక్ చేసేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
YS Jagan: ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
Snow In Desert: మంచుకొండలుగా సౌదీ ఎడారులు - ఇలాంటివి కాలజ్ఞానంలోనూ చెప్పలేదుగా !
మంచుకొండలుగా సౌదీ ఎడారులు - ఇలాంటివి కాలజ్ఞానంలోనూ చెప్పలేదుగా !
YS Jagan On DGP: అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు
అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు
Embed widget