అన్వేషించండి

Vasanthi Krishnan: సక్సెస్‌ఫుల్ మ్యారేజ్‌కు.. సూత్రం అదే - పెళ్లి ఫోటోలను షేర్ చేసిన వాసంతి కృష్ణన్

Vasanthi Krishnan Marriage: బిగ్ బాస్ వాసంతి ఫిబ్రవరీ 21న పెళ్లి చేసుకుంది. కానీ వాటికి సంబంధించిన ఫోటోలను మాత్రం తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. వాటికి ఒక ఆసక్తికర క్యాప్షన్‌ను జతచేసింది.

Vasanthi Krishnan Marriage Photos: బిగ్ బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్‌కు చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. కొన్ని నెలల క్రితం తనకు ఎంగేజ్‌మెంట్ అని అనౌన్స్ చేసి తన ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసింది ఈ భామ. ఎంగేజ్‌మెంట్ అయితే అయ్యింది కానీ.. పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఇక తాజాగా పెళ్లి తర్వాత తిరుమలలో స్వామివారిని దర్శించుకుంది ఈ జంట. అంటే పెళ్లి గురించి ఎక్కువమంది చెప్పకుండా కేవలం సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే వీరి వివాహం జరిగిపోయిందని అర్థమయ్యింది. దాదాపు పెళ్లయిన అయిదు రోజుల తర్వాత తానే స్వయంగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేసి.. దానికి ఒక ఆసక్తికర క్యాప్షన్‌ను జతచేసింది.

పెళ్లి ఫోటోలు షేర్..

బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది వాసంతి కృష్ణన్. దీంతో తను ఎవరో చాలామందికి తెలిసింది. బిగ్ బాస్‌కంటే ముందు పలు సీరియల్స్‌లో నటించినా వాటి వల్ల తనకు అంతగా గుర్తింపు రాలేదు. ఇక ఈ రియాలిటీ షో తర్వాత తనకు సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. అలా ఒకట్రెండు సినిమాలు, షోలతో బిజీగా ఉన్న వాసంతి.. ఒక్కసారిగా తన పెళ్లి విషయం అనౌన్స్ చేసి షాకిచ్చింది. పవన్ కళ్యాణ్ అనే నటుడితో వాసంతి ప్రేమలో పడింది. కొన్నిరోజుల్లోనే ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాలి అనే ఉద్దేశ్యంతో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా కేవలం సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. ‘‘కొత్త జీవితం మొదలయ్యింది. ఒకే మనిషితో ఎన్నోసార్లు ప్రేమలో పడడమే సక్సెస్‌ఫుల్ మ్యారేజ్‌కు కావాల్సిన ముఖ్య విషయం’’ అంటూ తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది వాసంతి.

View this post on Instagram
 
A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan)

అదే చివరిసారి..

బిగ్ బాస్ ముగిసిన తర్వాత బీబీ జోడీ అనే డ్యాన్స్ షోలో పాల్గొంది వాసంతి కృష్ణన్. ఆ షో ముగిసిన తర్వాత తను ఎక్కువగా స్క్రీన్‌పై కనిపించలేదు. అదే సమయంలో తన పెళ్లి అంటూ అనౌన్స్‌మెంట్ వచ్చింది. వాసంతి ఎంగేజ్‌మెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. దీనికి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలామంది హాజరయ్యారు. ఇక ఎంగేజ్‌మెంట్ తర్వాత వారి ప్రేమకథను బయటపెట్టడానికి ఎన్నో ఇంటర్వ్యూల్లో పాల్గొంది ఈ జంట. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో వారి ఓపెన్ రొమాన్స్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. షోలు, ఇంటర్వ్యూలలో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని విమర్శించారు. ఇంతలోనే తిరుమలలో వీరి పెళ్లి ఫోటోలు బయటికొచ్చాయి.

View this post on Instagram
 
A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan)

సొంతూరిలో పెళ్లి..

వాసంతి కృష్ణన్ సొంతూరు తిరుపతి కావడంతో అక్కడే పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది. ఫిబ్రవరీ 21న వీరిద్దరికీ అక్కడే వివాహం జరిగింది. పెళ్లి అవ్వగానే వీరిద్దరూ కలిసి తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇక పెళ్లయిన ఇన్నిరోజులకు తానే స్వయంగా కొన్ని ఫోటోలను షేర్ చేసి ఫ్యాన్స్‌తో తన సంతోషాన్ని షేర్ చేసుకుంది వాసంతి. ఈ ఫోటోలు చూసినవారంతా జంట బాగుందంటూ, కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: అందుకే ‘యానిమల్’ మూవీ సక్సెస్‌‌ను ఎంజాయ్ చేయలేకపోయా: రష్మిక

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget