Varalaxmi Sarathkumar: ప్రధానిని కలిసిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఫ్యామిలీ, ఎందుకంటే?
Varalaxmi Sarathkumar: వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. దీంతో ఆమె తానే స్వయంగా వెళ్లి అందరినీ కలిసి తన వివాహా ఆహ్వాన పత్రికను అందించి పెళ్లికి పిలుస్తున్నారు.
Varalaxmi Sarathkumar Meets Prime Minister Modi, Union Ministers : వరలక్ష్మీ శరత్ కుమార్.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రియుడు నికోలయ్ సచ్‌దేవ్‌తో ఏడడుగులు వేయబోతున్నారు. జులై 2న ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది. దీంతో స్వయంగా ఆమె వెళ్లి అతిథులను కలిసి ఆహ్వాన పత్రికను అందిస్తున్నారు. ఇక ఇప్పుడు తండ్రి శరత్ అ1కుమార్, రాధిక శరత కుమార్, తన ప్రియుడితో కలిసి ప్రధాని మోడీని కలిశారు వరలక్ష్మీ. ఈ సందర్బంగా ఆమె ఒక ప్రత్యేక వీడియోని షేర్ చేశారు.
ఢిల్లీలో ఇలా..
వరలక్ష్మీ శరత్ కుమార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన, సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు ఆమె. అలా ఢిల్లీ వెళ్లి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, మరికొందరు కేంద్రమంత్రులను కలిసిన వరలక్ష్మీ ఆ వీడియోను షేర్ చేశారు. ఢిల్లీలో ఒక రోజు ఇలా అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రధాని మోడీని కలిసిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఆయన తన పెళ్లి పత్రికను ఇచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆమెతో పాటు శరత్ కుమార్, రాధిక శరత్ కుమార్, నికోలయ్ కూడా ఉన్నారు. ప్రధాని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ క్యాప్షన్ రాశారు వరలక్ష్మీ. ఇక ఆమె ప్రధాని తో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తదితరులను కలిశారు.
View this post on Instagram
ఈ సందర్భంగా ఆమె తన తండ్రికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. తనని ప్రధాని దగ్గరికి తీసుకెళ్లినందుకు ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు వరలక్ష్మీ. కాగా.. వరలక్ష్మీ ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలను కలిసి తన వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. రజనీకాంత్, బాలకృష్ణ తదితరులను కలిశారు. ఈ ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేశారు వరలక్ష్మీ. శరత్ కుమార్, రాధిక శరత్ కుమార్ లకి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాధిక బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఇక జులై 2వ తారీఖున థాయ్ లాండ్ వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. కేవలం కొద్దిమంది కుటుంబసభ్యుల మధ్య వివాహం జరుగనున్నట్లు సమాచారం. ఇక ఆ తర్వాత చెన్నైలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయనున్నట్లు సన్నిహితులు చెప్పారు. వరలక్ష్మీ, నికోలయ్ సచ్‌దేవ్ లు ఇద్దరు స్నేహితులు. కాగా.. వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఇటీవల ముంబైలో ఇద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఇప్పుడు పెళ్లితో ఒకటి కాబోతున్నారు. నికోలాయ్ కి ఇది రెండో పెళ్లి. ఆయనకు ముందే ఒక మోడల్ తో పెళ్లి అయ్యి 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఆమెతో విడాకులు తీసుకున్న నికోలయ్ వరలక్ష్మీతో ప్రేమలో పడి ఇప్పుడు ఆమెను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. వరలక్ష్మీ ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. వెబ్ సిరీస్ లు, సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల హనుమాన్ లో ఆమె వేసిన అక్క పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి.
Also Read: కలెక్షన్లతో దూసుకుపోతున్న 'కల్కీ 2898' - వామ్మో రెండు రోజుల్లోనే అన్ని కోట్లా!