Marina Rohit Sahni: తల్లిదండ్రులు కాబోతున్న బుల్లితెర కపుల్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ షేర్ చేసిన మెరీనా - రోహిత్
Marina Abraham and Rohit Sahni: బిగ్ బాస్ కంటెస్టెంట్స్, పాపులర్ బుల్లితెర కపుల్ మెరీనా, రోహిత్ ఇన్స్టా లో ఓ వీడియోను షేర్ చేస్తూ తాము పేరెంట్స్ కాబోతున్నాము అనే గుడ్ న్యూస్ పంచుకున్నారు.
ప్రముఖ బుల్లితెర కపుల్ మెరీనా అబ్రహం - రోహిత్ సాహ్ని పేరెంట్స్ కాబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ అభిమానులకు న్యూ ఇయర్ సందర్భంగా తాము తల్లిదండ్రులం కాబోతున్నామనే గుడ్ న్యూస్‌ను ఈ జంట ఓ అద్భుతమైన వీడియో ద్వారా చెప్పారు. ప్రస్తుతం రోహిత్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తల్లిదండ్రులు కాబోతున్న మెరీనా - రోహిత్
'అమెరికా అమ్మాయి' అనే సీరియల్ తో పాపులర్ అయ్యింది బుల్లితెర నటి మెరీనా. ఆ తర్వాత ఈ అమ్మడు 'ఉయ్యాల జంపాల' అనే సీరియల్ తో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు, వాటి ద్వారా వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో సినిమాల్లో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. 'రొమాన్స్ విత్ ఫైనాన్స్' అనే సినిమాతో వెండితెరపై మెరిసింది మెరీనా. అలాగే 'సబ్కా దిల్ ఖుషి' అనే హిందీ సినిమాలో కూడా ఈ అమ్మడు నటించింది. అంతేకాదు 2017 లోని టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అనే అవార్డును సొంతం చేసుకుని పాపులర్ బుల్లితెర నటిగా మారిపోయింది. సీరియల్ నటుడు రోహిత్ సాహ్నిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ భామ.
'బిగ్ బాస్ సీజన్ 6'లో కూడా ఆ తరువాత ఈ జంట పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో మెరీనాకు మదర్ ఇండియా అనే ట్యాగ్ ని కూడా ఇచ్చారు. అందం, అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మెరీనా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా రోహిత్ - మెరీనా జంట తాము తల్లిదండ్రులము కాబోతున్నాము అనే గుడ్ న్యూస్ ఓ ప్రత్యేకమైన వీడియో ద్వారా పంచుకున్నారు. అందులో ఇద్దరూ తెల్లని దుస్తులు ధరించి సింబాలిక్ గా తాము పేరెంట్స్ కాబోతున్నాము అనే సంతోషకరమైన న్యూస్ ను వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ జంటకు అభినందనల వెల్లువ మొదలైంది.
Also Read: రాజమౌళి సినిమాకు రెమ్యూనరేషన్ వద్దని చెప్పిన మహేష్ బాబు - ఎందుకంటే?
View this post on Instagram
రెండుసార్లు అబార్షన్
అయితే కొన్నాళ్ల క్రితం మెరీనా బాగా లావుగా కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అనే రూమర్లు చక్కర్లు కొట్టాయి. వాటికి సమాధానంగా మెరీనా ఒక వీడియో రిలీజ్ చేసి, అందులో తన గతం గురించి వెల్లడించింది. 2021లోనే ప్రెగ్నెంట్ అయినప్పటికీ మొదటి స్కానింగ్ లోనే బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసిందని బ్యాడ్ న్యూస్ చెప్పింది. మూడు నెలలు ఎదురు చూసినా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో అబార్షన్ చేశారని, 2022లో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పింది. అయితే అప్పటికి బేబీకి హార్ట్ బీట్ బాగానే ఉన్నా, తన శరీరం వీక్ గా ఉండడం వల్లనో, ఒత్తిడి వల్లనో మళ్ళీ గర్భస్రావం అయింది అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. ఇక ఆ తర్వాత తన ఆరోగ్యం దిగజారడంతో డాక్టర్లు స్టెరాయిడ్స్ ఇచ్చారని, అందుకే లావయ్యాను అని వెల్లడించింది. ఎట్టకేలకు ఇప్పుడు మెరీనా - రోహిత్ జంట చిట్టి సాహ్నీని ఇంటికి ఆహ్వానించబోతున్నారు.
Read Also: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ సూపర్ స్టార్... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్