అన్వేషించండి

త్రివిక్రమ్ - బన్నీ కాంబోలో నాలుగో సినిమా - ట్వీట్ తో కన్ఫర్మ్ చేసిన నిర్మాణ సంస్థ!

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించి హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ ఓ ట్వీట్ చేసింది.

మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'జులాయి' మూవీతో వీరి కాంబినేషన్ మొదలైంది. అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ మూవీస్ లో 'జులాయి' కూడా ఒకటి. ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో హీరో, విలన్ ట్రాక్స్ ది బెస్ట్ అని చెప్పాలి. ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ ఐతే ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలానే హైలెట్స్ ఉన్నాయి. అందుకే ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమాను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక 'జులాయి' తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అలవైకుంఠపురంలో' సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి.

ముఖ్యంగా 'అలవైకుంఠపురంలో' సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకొని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలా ఇప్పటివరకు మూడు సినిమాలతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ ని అందుకుంది. ఇక ప్రస్తుతం బన్నీ 'పుష్ప2' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప2 తో బిజీగా ఉన్న బన్నీ ఈ షూటింగ్ పూర్తవుగానే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్లో నాలుగో ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో..  "రేపు ఉదయం సరిగ్గా 10:08 నిమిషాలకు ఓ అదిరిపోయే అప్డేట్ రాబోతుందంటూ, ఆ అప్డేట్ కోసం వేచి ఉండండి అంటూ" పేర్కొనగా ఈ ట్వీట్స్ తో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

అంతేకాదు ఈ ట్వీట్ లో బన్నీ సైన్ 'AA' ని హైలెట్ చేస్తూ, గీతా ఆర్ట్స్ ని కూడా ట్యాగ్ చేశారు. దీన్నిబట్టి త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ అయినట్లు, ఇక ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో పాటు గీతా ఆర్ట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తుందని స్పష్టమవుతోంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు వెల్లడి కానున్నాయి. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ బాబుతో 'గుంటూరు కారం' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి అల్లు అర్జున్ సినిమాని మొదలు పెట్టేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటివరకు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు రీజనల్ మార్కెట్ కి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఈసారి మాత్రం వీరిద్దరి కాంబినేషన్ పాన్ ఇండియా వైడ్ గా రాబోతోంది.  హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు బన్నీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా 'పుష్ప2' విషయానికొస్తే.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే విదేశాల్లో షెడ్యూల్ ని చేశారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తవగా వీలైనంత త్వరగా షూటింగ్ అంతా పూర్తి చేసి, వీలైతే ఈ ఏడాది చివర్లో.. లేకపోతే వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Varanasi Leaks : 'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
Thaai Kizhavi OTT : 10 కోట్ల బడ్జెట్‌తో 80 కోట్లు - టాప్ ట్రెండింగ్ మూవీ తప్పక చూడాల్సిందే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
10 కోట్ల బడ్జెట్‌తో 80 కోట్లు - టాప్ ట్రెండింగ్ మూవీ తప్పక చూడాల్సిందే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Singer Mangli vs Subbarao: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
Ram Charan : రామ్ చరణ్ మరో ఘనత - ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజీపై గ్లోబల్ స్టార్... గ్రేట్ జర్నీ అంటూ...
రామ్ చరణ్ మరో ఘనత - ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజీపై గ్లోబల్ స్టార్... గ్రేట్ జర్నీ అంటూ...

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRAA Fact Check: హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
Praful Hinge Dream Debut: ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
Strait of Hormuz:
"హర్మూజ్ జలసంధి స్వాధీనం" అమెరికా సంచలన ప్రకటన! ఇరాన్ నౌకలు కనిపిస్తే పేల్చేస్తామని హెచ్చరిక!
TGSRTC Strike : తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
Jasprit Bumrah News: వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Viral News: ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!
ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!
AI Wife: డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
Embed widget