అన్వేషించండి

VD12 : రౌడీ హీరో సినిమా నుండి శ్రీలీల అవుట్ - ఆమె స్థానంలో మరో ఇద్దరు క్రేజీ హీరోయిన్లు?

VD12 : గౌతం తిన్ననూరి - విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ నుండి శ్రీలీల హీరోయిన్ గా తప్పుకుంటే ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి, రుక్మిణి వసంత్ పేర్లను మూవీ టీమ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Deverakonda -  Goutam Tinnanuri Movie  : లైగర్ డిజాస్టర్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ సాలిడ్ సక్సెస్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. గత ఏడాది వచ్చిన 'ఖుషి' ఆ రేంజ్ సక్సెస్ ని అందించలేకపోయింది. ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదనిపించింది. కానీ రౌడీ హీరో నుండి ఫ్యాన్స్ మాత్రం బ్లాక్ బస్టర్ ఆశిస్తున్నారు. అందుకే ఈసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ఒకటి.

#VD12 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇందులో విజయ్ దేవరకొండ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన శ్రీ లీలను హీరోయిన్గా తీసుకున్నారు. ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ మూవీ షూటింగ్ శ్రీ లీల వల్లే ఆలస్యం అయ్యింది. శ్రీలీలా వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు కోసం డేట్స్ కేటాయించలేకపోయింది. దాంతో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లకుండా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని, తన ప్లేస్‌లో రష్మిక మందనని తీసుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి నిజంగానే శ్రీలీలా తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె స్థానంలో యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి తో పాటూ 'సప్త సాగరాలు దాటి' హీరోయిన్ రుక్మిణి వసంత్ లను మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యానిమల్ మూవీలో కనిపించింది కాసేపే ఆయన తన గ్లామర్ ట్రీట్ తో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది తృప్తి దిమ్రి. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ గా మారిన ఈ ముద్దుగుమ్మని ఇప్పుడు #VD12 కోసం హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈమెతో పాటు 'సప్త సాగరాలు దాటి' సినిమాలో తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న రుక్మిణి వసంత్ ను కూడా మరో ఆప్షన్ గా పెట్టుకున్నారట. మరి ఈ ఇద్దరిలో విజయ్ దేవరకొండ సరసన ఎవరు నటిస్తారనేది త్వరలోనే తెలియనుంది. కాగా మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' షూటింగ్ చివరి దశలో ఉంది. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనా నెలకొన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : ‘సరిపోదా శనివారం’ తెలుగు రాష్ట్రాల హక్కులు వారికే - అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు!

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Collections: విజయ్ జోరు తగ్గింది... ఆరు రోజుల్లో 'జన నాయకన్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
తెలుగులో జస్ట్ 60 లక్షలే... మరి తమిళంలో? ఆరు రోజుల్లో 'జన నాయకుడు' కలెక్షన్స్ ఎంత?
Chennai Love Story Collections: వీకెండ్ తర్వాత స్టడీగా 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్లు... ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ఓవర్సీస్‌లో 50 లక్షలే... మరి తెలుగు రాష్ట్రాల్లో? ఐదు రోజుల్లో 'చెన్నై లవ్ స్టోరీ' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Kalatheylaa Song Lyrics: కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్
కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget