అన్వేషించండి

Top Gear Movie Trailer: ‘టాప్ గేర్’ లో వచ్చేస్తున్న ఆది సాయికుమార్, ఉత్కంఠగా మూవీ ట్రైలర్

యంగ్ హీరో ఆది సాయికుమార్ తాజాగా నటించిన సినిమా ‘టాప్ గేర్’. ఈ సినిమాను శశికాంత్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ కు సంబంధించి ట్రైలర్ ను మాస్ మహరాజ్ రవితేజ చేతుల మీదుగా విడుదల చేసింది మూవీ టీమ్.

Watch Top Gear Movie Trailer: టాలీవుడ్ లో మంచి బ్యాగ్రౌండ్ తో వచ్చి ఇప్పటికీ సరైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకోని యంగ్ హీరోలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఆది సాయి కుమార్ ఒకరు. కేరీర్ ప్రారంభంలో ‘ప్రేమ కావాలి’, ‘లవ్ లీ’ లాంటి హిట్ లు వచ్చినా తరువాత ఆదికి సక్సెస్ రాలేదు. మధ్యలో కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా రాణించలేకపోయాయి. అయినా ఆది హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కొత్త జానర్లు ఎంచుకుని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘టాప్ గేర్’. ఈ సినిమాను శశికాంత్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ ను టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ చేతుల మీదుగా విడుదల చేసింది మూవీ టీమ్. ఈ సందర్భంగా హీరో రవితేజ టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక సినిమా ట్రైలర్ విషయానికొస్తే.. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందనే చెప్పాలి. ఓవ్యక్తి యాక్సిడెంట్ తో ట్రైలర్ మొవలవుతుంది. ఇందులో ఆది సాయికుమార్ క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తున్నాడు. కథ మొత్తం డేవిడ్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ అతను ఎవరు అనేది ఎవరికీ తెలీదు. ఓ గ్యాంగ్ డేవిడ్ కోసం వెతుకుతూ ఉంటుంది. మరోవైపు పోలీస్ డిపార్డ్మెంట్ లో ఒక్కక్కరూ చనిపోతున్నట్టు చూపిస్తారు. గుర్తు తెలియని వ్యక్తులు హీరో ఆది ను హత్య చేయడానికి ప్రయత్నిస్తుంటారు, పోలీసులు కూడా హీరో ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ హీరో తప్పించుకుంటూ ఉంటాడు. అసలు ఆ డేవిడ్ ఎవరు, అతని కోసం అందరూ ఎందుకు వెతుకుతున్నారు. వీళ్లంతా క్యాబ్ డ్రైవర్ ను ఎందుకు వెంటడుతున్నారు. ఇందలో హీరో ఎలా ఇరుక్కున్నాడు, చివరికి ఆ ప్రాబ్లం నుంచి ఎలా తప్పించుకున్నారు వంటి ఉత్కంఠ రేపే ప్రశ్నలతో ట్రైలర్ ముగుస్తుంది. 

ట్రైలర్‌ని బట్టి చూస్తే, ‘టాప్ గేర్’ సినిమా ఓ విలక్షణమైన కథాంశంగా కనిపిస్తోంది. సినిమాలో సాంకేతిక ప్రమాణాలు కూడా బాగానే ఉన్నాాయనిపిస్తుంది. కంటెంట్ ఆధారిత యాక్షన్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది మూవీ.  క్యాబ్ డ్రైవర్ పాత్రలో ఆది సాయికుమార్ లుక్ ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం ఆయన చాలా స్టంట్ లే చేసినట్లు తెలుస్తోంది. తన యాక్టీవ్ నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు ఆది. టేకింగ్ విషయంలో దర్శకుడి పనితీరు కనిపిస్తోంది. అలాగే సినిమాలో హీరోయిన్ గా చేసిన రియా సుమన్ గ్లామర్ గా కనిపించింది. ఆది-రియా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించింది. ఓవరాల్ గా ‘టాప్ గేర్’ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండంతో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. 

ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉంది మూవీ టీమ్. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కెవి శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 30 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అయినా హీరో ఆదికు కమర్షియల్ హిట్ అందుతుందో లేదో చూడాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget