అన్వేషించండి

Revanth Reddy: సినీ పరిశ్రమలో వివాదాలు వద్దు, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది: రేవంత్ రెడ్డి

సినీ పరిశ్రమలో వివాదాలు వద్దు అనే ఉద్దేశంతోనే సినీ కార్మికుల సమ్మె విరమించాలని చొరవ చూపినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కార్మికుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి అన్నారు.

Tollywood Workers Strike | హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, టాలీవుడ్ అభివృద్ధికి తన వంత సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సినీ కార్మికుల సమ్మె పరిష్కారానికి సహకరించిన రేవంత్ రెడ్డికి టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పలువురు సినీ నిర్మాతలు, దర్శకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమ ప్రాధాన్యత, అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను వివరించారు.

త్వరలోనే సినీ కార్మికులతో రేవంత్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “సినిమా పరిశ్రమలో పని వాతావరణం సానుకూలంగా ఉండాలి. త్వరలోనే సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడతాను. ప్రభుత్వం నుంచి పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుంది. కొత్తగా పరిశ్రమలోకి వచ్చే వారికి నైపుణ్యాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. ఈ క్రమంలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయడం మంచిదని భావిస్తున్నాను” అని చెప్పారు.


Revanth Reddy: సినీ పరిశ్రమలో వివాదాలు వద్దు, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది: రేవంత్ రెడ్డి

అంతేకాకుండా, స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయికి చేరిందని, తెలంగాణలో ఇది అత్యంత ముఖ్యమైన పరిశ్రమగా నిలిచిందని గుర్తు చేశారు. ఇటీవల కార్మికుల సమ్మె విరమణలో ప్రభుత్వం చొరవ చూపిందని, భవిష్యత్తులో నిర్మాతలు–కార్మికుల అంశంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరం

సినిమా కార్మికుల పట్ల నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని, నిర్మాతలు, కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. “సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరం ఉంది. పరిశ్రమకు కావలసిన అంశాలను సమగ్రంగా లిఖించుకునే కొత్త పుస్తకాన్ని సిద్ధం చేద్దాం. ఎవ్వరైనా వ్యవస్థలను నియంత్రించడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం సహించదు. అందరూ చట్ట పరిధిలోనే పని చేయాలి. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయని, తెలుగు సినిమాల షూటింగ్ ఎక్కువగా తెలంగాణలోనే జరిగేలా చూడండి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను నిలబెట్టడమే తమ ధ్యేయం” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


Revanth Reddy: సినీ పరిశ్రమలో వివాదాలు వద్దు, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది: రేవంత్ రెడ్డి

జూబ్లీ హిల్స్‌లోని నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తెలుగు సినిమా ప్రముఖులు కలిశారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నిర్మాతలలో అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డివివి దానయ్య, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము తదితరులు పాల్గొన్నారు.

దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల ఉన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Governor OTT : ఓటీటీలోకి వచ్చేసిన మనోజ్ బాజ్‌పాయ్ కొత్త మూవీ - నేషనల్ అవార్డ్ విన్నర్ పొలిటికల్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన మనోజ్ బాజ్‌పాయ్ కొత్త మూవీ - నేషనల్ అవార్డ్ విన్నర్ పొలిటికల్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Kotha Soku Lyrics: కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
Ramayana Trailer : రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా - అసలు రీజన్ ఏంటో చెప్పిన ప్రొడ్యూసర్
రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా - అసలు రీజన్ ఏంటో చెప్పిన ప్రొడ్యూసర్
Love Oh Love OTT: 'లవ్ ఓ లవ్' ఓటీటీ రిలీజ్ డేట్... మూడు వారాలకే ధనుష్ మేనల్లుడి సినిమా స్ట్రీమింగ్... ఎందులోనంటే?
OTT Movie: నాగదుర్గ లేటెస్ట్ సినిమా... మూడు వారాలకే ఓటీటీలోకి, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget