అన్వేషించండి

This Week Theatrical Releases : హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!

This Week Telugu Movies : ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. విలేజ్ లవ్ కామెడీ ఎంటర్టైనర్స్ నుంచి బాలీవుడ్ హారర్ వరకూ రిలీజ్ కానున్నాయి.

This Week Theatrical Telugu Releases Movies List : ఈ హాట్ సమ్మర్‌లో కూల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఏప్రిల్ మూడో వారం చిన్న సినిమాలు రెడీ అవుతున్నాయి. విలేజ్ కామెడీ ఎంటర్టైనర్స్ నుంచీ హారర్ మూవీస్ వరకూ థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో ఓసారి చూస్తే...

విలేజ్ ఎంటర్టైనర్ 'తిమ్మరాాజుపల్లి TV'

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా వస్తోన్న ఫస్ట్ మూవీ 'తిమ్మరాజు పల్లి TV'. 90s బ్యాక్ డ్రాప్‌లో అప్పటి తరాన్ని గుర్తు చేసేలా ఓ అందమైన విలేజ్ కామెడీ ఎంటర్టైనర్. న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు అందరూ కొత్త వాళ్లతోనే ఈ మూవీని తీశారు. సాయితేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా వెండితెరకు పరిచయం అవుతుండగా... వి.మునిరాజు డైరెక్టర్. ఈ నెల 17న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KA Productions (@ka_productions__)

'పాపం ప్రతాప్' ఏమైంది?

డిఫరెంట్ స్టోరీస్‌ సెలక్ట్ చేసుకుంటూ తనదైన నటనతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న హీరో తిరువీర్. ఆయన ప్రధాన పాత్రలో, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ విలేజ్ లవ్ ఎంటర్టైనర్ పాపం ప్రతాప్. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట జీవితంలో పెళ్లైన 4 రోజులకే ఇబ్బందులు వస్తే ఏం జరిగింది? అనేదే మూవీ స్టోరీ అని తెలుస్తోంది. ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించగా... అజయ్ ఘోష్, రఘుబాబు, ప్రసాద్ బెహర తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 17న సినిమా రిలీజ్ కానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

Also Read : కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్ - మ్యాన్ ఆఫ్ మాసెస్ న్యూ బీస్ట్ లుక్ చూశారా!

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్'

యంగ్ హీరో నాగశౌర్య లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. రామ్ దేశినా దర్శకత్వం వహించిన ఈ మూవీలో విధి హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, సముద్రఖని, సీనియర్ నరేశ్, సాయి కుమార్, మైమ్ గోపి, వెన్నెల కిశోర్, శ్రీదేవి విజయ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తీరం చెంత 'తెరచాప'

సముద్ర తీరం చెంతనున్న ఓ ఊరి కథ 'తెరచాప'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్‌రాజ్ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో నటించగా... రాజీవ్ కనకాల, రాకీ, నాగ మహేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 17నే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

బాలీవుడ్ 'భూత్ బంగ్లా'

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'భూత్ బంగ్లా'. ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ మూవీలో వామికా గబ్బీ, టబు హీరోయిన్లు. ఈ నెల 16న పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించనుండగా... 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టొవినో థామస్ 'పళ్లి చట్టంబి'

మలయాళ స్టార్ టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'పళ్లి చట్టంబి'. డిజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ రాఘవన్, సుధీర్, బాబురాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ నెల 15న సినిమా రిలీజ్ కానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
The Paradise Teaser : నాని ది ప్యారడైజ్ టీజర్ - జడల్ జమానాలో కాకులు తల్వార్లు పడితే యాక్షన్ వేరే లెవల్...
నాని ది ప్యారడైజ్ టీజర్ - జడల్ జమానాలో కాకులు తల్వార్లు పడితే యాక్షన్ వేరే లెవల్...
The Taj Story OTT : మూడు ఓటీటీల్లో కాంట్రవర్సియల్ కోర్ట్ రూమ్ డ్రామా - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
మూడు ఓటీటీల్లో కాంట్రవర్సియల్ కోర్ట్ రూమ్ డ్రామా - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Embed widget