అన్వేషించండి

Shah Rukh Khan: షారుఖ్, కాజల్ సాంగ్‌ను షేర్ చేసిన ఆస్కార్ - ఇండియాపై ప్రేమ కురిపించిన అకాడమీ అవార్డ్స్

Dilwale Dulhania Le Jayenge: షారుఖ్ ఖాన్ నటించిన ఎన్నో సినిమాల్లో ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్‌కు ఫేవరెట్ సినిమా ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’. తాజాగా ఆస్కార్స్.. ఇందులోని పాటను షేర్ చేసింది.

The Academy: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. కానీ తనను ఒక లవర్ బాయ్‌గా చూపించి, యూత్‌లో బాగా క్రేజ్ తీసుకొచ్చిన సినిమా మాత్రం ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’. 1995లో విడుదలయిన ఈ సినిమా పూర్తిస్థాయి లవ్ స్టోరీగా తెరకెక్కింది. అప్పట్లో ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పట్టారు. అప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుడు కూడా ఈ మూవీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో పాటలను ఇంకా వినేవారు ఉన్నారు. అందుకే అకాడమీ అవార్డ్స్ సైతం ఒక స్పెషల్ వీడియోతో ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’ సినిమాను గుర్తుచేసుకుంది. అంతే కాకుండా షారుఖ్, కాజల్ మళ్లీ కలిసి నటిస్తే బాగుంటుందని కోరిక వ్యక్తం చేసింది. 

షారుఖ్ పాటను షేర్..
తాజాగా ఆస్కార్స్ అకాడమీ అవార్డ్స్‌కు ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’ సినిమా ఉన్నట్టుండి గుర్తొచ్చినట్టుంది. అందుకే ఈ సినిమాలోని ‘మెహెందీ లగాకే రఖ్నా’ పాట వీడియోను షేర్ చేసింది. ‘1995లో ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’లో ‘మెహెందీ లగాకే రఖ్నా’ పాటకు షారుఖ్ ఖాన్, కాజోల్ చేసిన పర్ఫార్మెన్స్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో షారుఖ్, కాజోల్ ఫ్యాన్స్ ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఎవరైనా వీరిద్దరితో కలిసి మళ్లీ సినిమా తీయండి అంటూ కోరుకుంటున్నారు. అప్పట్లో షారుఖ్ ఖాన్, కాజోల్ జోడీకి ఉన్న క్రేజ్ అలాంటిది. చాలామంది ఫ్యాన్స్ అయితే వీరిద్దరూ రియల్ లైఫ్‌లో కూడా కపుల్ అయితే బాగుంటుందని కోరుకున్నారు కూడా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Academy (@theacademy)

27 ఏళ్ల పాటు థియేటర్‌లో స్క్రీనింగ్..
‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’లో షారుఖ్ ఖాన్.. రాజ్ మల్హోత్రా పాత్రలో కనిపించగా.. కాజోల్.. సిమ్రాన్ సింగ్‌గా నటించింది. ఇప్పటికీ ఈ రాజ్, సిమ్రాన్‌ల ప్రేమకథను బాలీవుడ్ గుర్తుచేసుకుంటూనే ఉంటుంది. అప్పట్లో ఒక డిఫరెంట్ కథతో తెరకెక్కిన ప్రేమకథ కావడంతో ఆ తర్వాత బాలీవుడ్‌లోని చాలా సినిమాలు ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’ బేసిక్ కథపైనే తెరకెక్కాయి. కానీ ఈ మూవీ మాత్రం క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా 27 ఏళ్ల పాటు ముంబాయ్‌లోని మరాఠా మందిర్‌లో స్క్రీన్ అవుతూనే ఉంది. రన్ అవ్వడం మాత్రమే కాకుండా చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను రెగ్యులర్‌గా చూడడానికి వచ్చేవారు కూడా. అలాంటి రికార్డులను ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’ సొంతం చేసుకుంది. 

‘దిల్‌వాలే’లో చివరిగా..
‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’ తర్వాత షారుఖ్ ఖాన్, కాజోల్ కలిసి ‘బాజీగర్’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘కబీ ఖుషీ కబీ ఘమ్’ చిత్రాల్లో నటించారు. ఇక వీరిద్దరూ ఫైనల్‌గా 2015లో విడుదలయిన ‘దిల్‌వాలే’లో జంటగా కనిపించారు. ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’ రిఫరెన్స్‌తో తెరకెక్కిన ‘దిల్‌వాలే’ మూవీ ఎన్నో అంచనాలు మధ్య విడుదలయ్యింది. కానీ ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవ్వలేక డిసాస్టర్ అయ్యింది. అందుకే మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ప్రస్తుతం షారుఖ్.. కమర్షియల్ సినిమాల్లో బిజీ అవ్వగా.. కాజోల్ మాత్రం లేడీ ఓరియెంటెడ్, ఎమోషనల్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తోంది.

Also Read: మాల్దీవ్స్ ట్రిప్‌ను క్యాన్సల్ చేసుకున్న నాగార్జున - ప్రధాని మోడీకి సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Embed widget