![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి శుభలేఖ - చిరు, పవన్, చరణ్ పేర్లను హైలెట్ చేస్తూ ఇన్విటేషన్, మీరు చూశారా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసింది. తాజాగా వరుణ్ తేజ్ ఇన్విటేషన్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
![వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి శుభలేఖ - చిరు, పవన్, చరణ్ పేర్లను హైలెట్ చేస్తూ ఇన్విటేషన్, మీరు చూశారా? Team Varun Teja Shares Varun Tej, Lavana Tripathi Wedding Invitaion వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి శుభలేఖ - చిరు, పవన్, చరణ్ పేర్లను హైలెట్ చేస్తూ ఇన్విటేషన్, మీరు చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/26/8a7136003d47f5f3ff0ba3b8134f8fe31698337362082753_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరి కొద్ది రోజుల్లోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే కదా. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇటలీలో ఈ జంట గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు పూర్తి కావచ్చాయి. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ తాజాగా తన వెడ్డింగ్ కార్డ్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం వరుణ్, లావణ్య వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ గా మారింది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. నాగబాబు కొడుకు మెగా హీరో వరుణ్ తేజ్ తన ప్రేయసి లావణ్య త్రిపాఠి ని నవంబర్ 1న వివాహం చేసుకోబోతున్నాడు.
'మిస్టర్' మూవీ షూటింగ్ టైంలో వరుణ్, లావణ్య మొదట కలుసుకుంది ఇటలీలోనే కావడంతో సెంటిమెంట్ గా మ్యారేజ్ వెన్యుని అక్కడే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే బ్యాచిలర్ పార్టీలు పూర్తయ్యాయి. ఈ పార్టీలో మెగా హీరోలంతా తెగ సందడి చేశారు. పెళ్లి పనులు కూడా చక చకా జరుగుతున్నాయి. పెళ్లి ఇటలీలో కావడంతో మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ అక్కడికి వెళ్ళనున్నారు. వీటితోపాటు మరి కొంతమంది బంధువులు, స్నేహితులు ఇటలీకి వెళ్తారు. పెళ్లి ఇటలీలో చేసుకుంటున్న వరుణ్ తేజ్ రిసెప్షన్ ని మాత్రం హైదరాబాదులోనే ప్లాన్ చేశాడు. అందుకే పూర్తిస్థాయిలో అతిధులను హైదరాబాదులో జరిగే రిసెప్షన్ కి ఇన్వైట్ చేస్తున్నారు.
#VarunLav @IAmVarunTej & @Itslavanya are tying the knot in a dreamy Italian ceremony on November 1st, surrounded by family.
— Team VarunTej (@TeamVarunTej) October 26, 2023
The grand reception awaits in Hyderabad at N-Concetion, Madhapur, on November 5th, where industry celebrities will join in the festivities!💍 pic.twitter.com/b3z1FV9umF
ఈ మేరకు రిసెప్షన్ డేట్ అండ్ వెన్యూ కూడా ఫిక్స్ అయిపోయాయి. నవంబర్ 1న ఇటలీలో వరుణ్, లావణ్య పెళ్లి జరగనుండగా.. నవంబర్ 5న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో రిసెప్షన్ వేడుక జరగనుంది. ఈ క్రమంలోనే రిసెప్షన్ కి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ ని అతిధులందరికీ పంచుతున్నారు. తాజాగా ఇన్విటేషన్ కార్డుకు సంబంధించి ఓ వీడియోని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. చూడడానికి చాలా రిచ్ గా ఆకర్షణీయంగా ఉన్న ఈ రిసెప్షన్ ఇన్విటేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శుభలేఖ ముందు భాగంలో వరుణ్, లావణ్య పేర్లలోని VL అక్షరాలతో లోగోని డిజైన్ చేశారు.
లోపల పై భాగంలో వరుణ్ తేజ్ నానమ్మ అంజనాదేవి, తాతయ్య కొణిదెల వెంకటరావు ఆశీస్సులతో.. అని ముద్రించి ఉంది. ఆ తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్.. అంటూ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లను హైలైట్ చేయడం విశేషం. కాగా రిసెప్షన్ ఇన్విటేషన్ లో గెస్ట్ లకు అవసరమైన కార్ పాస్ లను కూడా పొందుపరిచారు. వరుణ్, లావణ్య పెళ్లి దగ్గర పడడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వరుణ్ లవ్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ లావణ్య కలిసి 'మిస్టర్', 'అంతరిక్షం' వంటి సినిమాల్లో నటించారు. 'మిస్టర్' మూవీ షూటింగ్ సమయంలోనే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ డిజైనర్ మనీష్ మల్హోత్రా వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి రిసెప్షన్ కి సంబంధించిన కాస్ట్యూమ్స్, స్టైలింగ్ ని ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.
Also Read : కొత్త ప్రయాణం మొదలైందన్న సీనియర్ నటి, ఆయనకు థ్యాంక్స్ చెప్తూ పోస్టు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)