Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Aranmanai 4 Release date: మలయాళీ నటుడు సుందర్ నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరణ్మనై 4’. ఏప్రిల్ 26న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాలతో మేకర్స్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
‘Aranmanai 4’ Gets Postponed: ప్రముఖ మలయాళీ నటుడు సుందర్ సి నటిస్తూ, తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘అరణ్మనై 4’. హారర్, కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ తెలుగులో ‘బాక్’ పేరుతో అలరించబోతుంది. ఏప్రిల్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు గతంలోనే మేకర్స్ వెల్లడించారు. అయితే, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు తమన్నా, రాశీ ఖన్నా, సుందర్ షాకింగ్ లుక్ లో కనిపిస్తున్న పోస్టర్ ను షేర్ చేశారు.
ఇప్పటికే ‘అరణ్మనై 4’ ప్రచార కార్యక్రమాలు షురూ
మలయాళంలో సూపర్ హిట్ ‘అరణ్మనై’ ప్రాంచైజీలో భాగంగా ‘అరణ్మనై 4’ తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజా చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. తెలుగులోనూ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇందులో సుందర్, రాశీ ఖన్నా, తమన్నా, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి కనినిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. శివానీ లుక్ లో తమన్నా కనిపించింది. చీరకట్టులో చేతిలో హారతి పట్టుకొని ఆకట్టుకుంది. ఇక ట్రైలర్ ఆద్యంతం భయపెడుతూ అలరించింది. ‘అరణ్మనై 4’ సినిమాలో సుందర్ శివ శంకర్ గా కనిపించనున్నారు. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ఢిల్లీ గణేష్, కోవై సరళ ఈ చిత్రంలో కీలక పాత్లరు పోషిస్తున్నారు. హిప్ హాప్ తమిఝా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను అవని సినీ మాక్స్, బెంజ్ మీడియా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సుందర్ భార్య కుష్భూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
View this post on Instagram
మే 3న ‘అరణ్మనై 4’ విడుదల, తెలుగులోనూ విడుదల అప్పుడే!
ఇక ‘అరణ్మనై 4’ సినిమా ఏప్రిల్ 26కు కాకుండా వారం ఆలస్యంగా అంటే మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మలయాళీ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘బాక్’ విడుదల కూడా కొత్త డేట్ ప్రకారమే విడదల కానున్నాయి. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP ఈ అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
View this post on Instagram
Read Also: నేను మంచోడిలా కనిపిస్తాను. కానీ, కాదు - శర్వానంద్ ‘మనమే‘ టీజర్ చూశారా?