అన్వేషించండి

Baak Trailer: మానవ శక్తితో ఈ ఆత్మను కట్టడి చేయలేం, అది దైవశక్తి వల్లే సాధ్యం - భయపెడుతున్న తమన్నా, రాశిఖన్నా 'బాక్' ట్రైలర్‌

BAAK Trailer Release: తమిళ నటుడు సుందర్‌ సి తెరకెక్కించి నటించిన చిత్రం 'అరణ్మనై 4' తెలుగులో బాక్‌ పేరుతో రిలీజ్‌ అవుతుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

Tamannah BAAK Trailer Out: ప్రముఖ తమిళ నటుడు సుందర్ సి నటిస్తూ, తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరణ్మనై 4’(తెలుగులో బాక్‌ పేరుతో విడుదల చేస్తున్నారు).  హారర్, కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రాశీ ఖన్నా, తమన్నాలు ప్రధానా పాత్రల్లో నటిస్తున్నారు. మే 3న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా అరణ్మనై 4 (బాక్‌ ట్రైలర్‌) తెలుగు ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

ఇప్పటికే తమిళ భాషలో రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తెలుగులోనూ ఈ ట్రైలర్‌ మంచి ఆదరణ పొందింది. ఇక తాజాగా రిలీజైన తెలుగు ట్రైలర్‌ పూర్తిగా హారర్ అంశాలతో‌ ఆకట్టుకుంటుంది. తమిళ్‌ ట్రైలర్‌నే డబ్బింగ్‌తో తెలుగులో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ చూస్తుంటే ఇందులో తమన్నా హీరో చెల్లి పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. పెళ్లై భర్త, పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న వారి జీవితంలో విషాదం నెలకొంటుంది. అనుకోకుండా ఆమె భర్త చనిపోవడంతో ఆ బాధతో తమన్నా ఉరి వేసుకున్నట్టు చెబుతూ ఓ వాయిస్‌ వస్తుంది. అయితే ఆ తర్వాత తమన్నాది ఆత్మహత్య కాదని, హత్య అని ప్రూవ్‌ చేసేందుకు ఆమె అన్నయ్య(నటుడు సుందర్‌ సి) ప్రూవ్‌ చేసే ప్రయత్నం చేస్తాడు.

లాయర్‌గా అతడు ఈ కేసు ఛేదించేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు అతడిని వారించడం, ఆ తర్వాత తమన్నా దెయ్యంలా మారి తన కుటుంబాన్ని అంతం చేసిన వారిపై పగ తీర్చుకోవడం వంటి అంశాలపై కాస్తా టచ్‌ ఇచ్చారు. ఇక రాశీ ఖన్నా ఇందులో హీరోయిన్‌గా కనిపించనుందని అర్థమైపోతుంది. ఇందులో ఆమె డాక్టర్‌ పాత్రలో కనిపించనుంది. పవర్ఫుల్‌ ఆత్మగా మారిన తమన్నాను కట్టడి చేసేందుకు మానవ శక్తి సరిపోదని, దానికి దైవ శక్తి కావాలని చెప్పే డైలాగ్‌ మూవీపై ఆసక్తి పెంచుతుంది. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న బాక్‌ ట్రైలర్‌ మొత్తం హారర్‌, క్రైం అంశాలతో క్షణక్షణం ఉత్కంఠ పెంచుతుంది. థియటర్లో ఈ సినిమ ఆడియన్స్‌ని చూపు కూడా తిప్పుకోనివ్వదంటున్నారు ట్రైలర్‌ చూసిన నెటిజన్లు. మరి మీరూ ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Asian Suresh Entertainment (@asiansureshentertainment)

కాగా తెలుగులో ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌లో దగ్గుబాటి సురేష్‌ బాబు సమర్పిస్తున్నారు. ఇక తన హారర్ ఫ్రాంచైజ్‌లో కేవలం భయపెట్టే హారర్ సీన్స్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ని కూడా జతచేయం చేయడం సుందర్ ప్రత్యేకత. ఈసారి కూడా అరణ్మనై 4 తన మార్క్‌ చూపించాడు సుందర్‌. ఇందులో తమిళ హాస్య నటుడు యోగి బాబుతో పాటు వెన్నెల కిషోర్‌, శ్రీనివాసరెడ్డి, కోవై సరళలు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను అవని సినీ మాక్స్, బెంజ్ మీడియా సంయుక్తంగా తెరకెక్కించగా సుందర్ భార్య కుష్భూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక తెలుగులో దగ్గుబాటి సురేష్‌ బాబు ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సమర్పిస్తుండటం విశేషం. 

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget