అన్వేషించండి

'సూర్య S/O కృష్ణన్‌'కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ - సూర్య గత చిత్రాల కంటే ఎక్కువగా!

సూర్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ మూవీ 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'. 2008లో వచ్చిన ఈ సినిమాని 15 ఏళ్ళ తర్వాత ఈరోజు థియేటర్లలో రీ-రిలీజ్ చేసారు. 

తమిళంతో పాటు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. ఆయన నటించే ప్రతీ సినిమా తెలుగులోనూ విడుదల చేస్తూ, ఇక్కడ కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అయితే చాలా కాలంగా సూర్య సినిమాలు తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం లేదు. దీంతో సూర్య క్రేజ్ తగ్గిపోయిందని, అతని పని అయిపోయిందనే కామెంట్స్ వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రీ-రిలీజ్ చేయబడిన 'సూర్య S/O కృష్ణన్‌' సినిమా అతని ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. 
 
2008 లో సూర్య నటించిన సూపర్ హిట్ మూవీ 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్'. కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన ఈ చిత్రం దాదాపు 15 ఏళ్ళ తర్వాత ఈరోజు శుక్రవారం (ఆగష్టు 4) థియేటర్లలో మళ్లీ విడుదల చేయబడింది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఊహంచని విధంగా ఈ సినిమా షోలన్నీ హౌస్‌ ఫుల్ అయ్యాయి. జనాలతో థియేటర్లు కిక్కిరిసిపోయాయి. అభిమానులు హాళ్లలో డ్యాన్స్ చేస్తూ, ఓ రేంజ్ లో సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 

'సూర్య సన్నాఫ్ కృష్ణన్' రీరిలీజ్ ఫస్ట్ డే వసూళ్లు, సూర్య చివరి సినిమా ఓపెనింగ్ డే బాక్సాఫీస్ కలెక్షన్‌ల కంటే ఎక్కువగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. సూర్యకి తెలుగులో ఇంకా మంచి క్రేజ్ ఉందని ఈ కలెక్షన్స్ రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూర్య తెలుగు రాష్ట్రాల దత్తపుత్రుడిని మరోసారి నిరూపించుకున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సరైన కంటెంట్ తో వస్తే టాలీవుడ్ జనాలు ఆదరిస్తారని, అతని స్టార్‌డమ్‌ కు డోకా లేదని గుర్తు చేస్తున్నారు. 

'సూర్య S/O కృష్ణన్‌' చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సూర్య ద్విపాత్రాభినయం చేసిన ఈ రొమాంటిక్ డ్రామాలో సమీరా రెడ్డి, సిమ్రాన్, దివ్య స్పందన కథానాయికలుగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించారు. నేటికీ ఆ పాటలు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ సినిమా విజయానికి దోహదం చేసాయి. ఇప్పుడు రీరిలీజ్ లో ఈ రేంజ్ రెస్పాన్స్ రావటానికి సూర్యతో పాటుగా గౌతమ్ మీనన్ మరియు ఇతర అంశాలు కూడా కారణమని అనుకోవాలి. 

'కంగువ'గా రాబోతున్న సూర్య..
సూర్య చివరగా 'ఈటీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద ఆశించిన విధంగా పెరఫార్మ్ చేయలేదు. స్పెషల్ రోల్ నటించిన 'విక్రమ్' మూవీ విశేషంగా ఆకట్టుకుంది. సూర్య ప్రస్తుతం 'కంగువ' అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. 'ఎ మైటీ వాలియంట్ సాగా' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఆది నారాయణ కథ అందించిన ఈ చిత్రానికి సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సూర్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని టాక్. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇది పాన్ ఇండియన్ మూవీ. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. 

Also Read: ఒక్కచోట చేరిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ - 'అష్ట దర్శకుల' ఫ్రేమ్ అదిరిందిగా!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ashu Reddy : నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
Karuppu Trailer: సూర్య ఫేస్‌లో హిట్టు కళ కనబడుతోంది... త్రిష కొత్త సినిమా 'కరుప్పు' ట్రైలర్
సూర్య ఫేస్‌లో హిట్టు కళ కనబడుతోంది... త్రిష కొత్త సినిమా 'కరుప్పు' ట్రైలర్
Tamil Nadu CM Vijay: విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Vijay manifesto: మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
Ashu Reddy : నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
Bhuvneshwar Kumar Records: ఐపీఎల్ చరిత్రలో భువనేశ్వర్ అరుదైన ఘనత, మరో అడుగేస్తే అద్భుతమే
ఐపీఎల్ చరిత్రలో భువనేశ్వర్ అరుదైన ఘనత, RCB పేసర్ మరో అడుగేస్తే అద్భుతమే
CM Revanth Reddy: రేవంత్ అందరి వాడు - ప్రధాని మోదీకి కూడా - రేవంత్ రెడ్డి చాణక్యం నెక్ట్స్ లెవల్ !
రేవంత్ అందరి వాడు - ప్రధాని మోదీకి కూడా - రేవంత్ రెడ్డి చాణక్యం నెక్ట్స్ లెవల్ !
Embed widget