అన్వేషించండి

Suriya: సూర్య స్పీడుకు సలామ్... భారీ సినిమాలకు బెంచ్ మార్క్ సెట్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్

Suriya 44: సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. వాళ్లిద్దరూ కలిసి మిగతా భారీ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు.

కోలీవుడ్ స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన సూర్య (Suriya) సినిమా షూటింగ్ ఒకటి కంప్లీట్ అయ్యింది. ఆ విషయం చెబుతూ సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ చేశారు. అది ఆడియన్స్ కంటే ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు ఒక విధంగా ఎక్కువ షాక్ ఇచ్చేలా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే...

నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేసిన సూర్య!
కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా ఒక గ్యాంగ్ స్టర్ డ్రామా ఫిల్మ్ రూపొందుతోంది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి చేశామని సూర్య తెలిపారు. ఇక్కడ విషయం ఏమిటంటే... నాలుగు, కేవలం నాలుగు అంటే నాలుగు నెలల్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసేశారు. 

జూన్ 1వ తేదీన అండమాన్ ఏరియాలోని పోర్టు బ్లేయర్ దీవిలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ స్టార్ట్ చేశారు.‌ ఆ తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకున్నారు. కట్ చేస్తే... అక్టోబర్ 6న చిత్రీకరణ పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. ఒక్క స్టార్ హీరో సినిమా... అదీ తెలుగు, తమిళ భాషల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోతో నాలుగు నెలలలో కమర్షియల్ సినిమా కంప్లీట్ చేయడం అంటే మాటలు కాదు. పాన్ ఇండియా పేరుతో ఇప్పుడు చాలా మంది దర్శకులు హీరోలు సినిమాలను చెక్కుతూ వెళ్లడం వల్ల షూటింగ్ అంతా పూర్తి కావడానికి రెండు మూడేళ్లు పడుతోంది. ఈ తరుణంలో సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేసి మిగతా స్టార్ హీరోలకు, దర్శకులకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి ఇచ్చారు.

Also Read: మెగా హీరో సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కటౌట్... 'మట్కా' టీజర్‌లో ఆ షాట్ గమనించారా?

సూర్య సినిమా విడుదలైన తర్వాత మిగతా సినిమాలతో తప్పకుండా కంపేరిజన్ వస్తుంది. ఆ తరహా కమర్షియల్ సినిమాలు తీయడానికి ఎవరైనా సరే ఏడాదికిపైగా సమయం తీసుకుంటే సూర్యతో కార్తీక్ సుబ్బరాజ్ 4 నెలల్లో తీసేశాడని చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు కొత్త సినిమా పనుల మీదకు సూర్య షిఫ్ట్ కావచ్చు. ఆయన కథానాయకుడిగా రూపొందిన హిస్టారికల్ ఫాంటసీ ఫిలిం 'కంగువ' నవంబర్ 14న విడుదల కానుంది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించి అది విడుదలైన తర్వాత కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభించాలని సూర్య ఆలోచిస్తున్నారట.

Also Readఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?


కార్తీక్ సుబ్బరాజ్... ఈ తమిళ దర్శకులకు తెలుగులో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన తీసిన 'పిజ్జా' సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగులో విడుదల అనూహ్య విజయం సాధించింది. తెలుగు నాట విడుదల చేసిన వాళ్లకు భారీ లాభాలు అందించింది. కార్తీక్ సుబ్బరాజ్ తీసిన తమిళ బ్లాక్ బస్టర్ 'జిగర్తాండ'ను వరుణ్ తేజ్ కథానాయకుడిగా మార్పులు చేర్పులతో తెరకెక్కించిన హరీష్ శంకర్... 'గద్దల కొండ గణేష్' పేరుతో అందుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ చేంజర్' చిత్రానికి మూలకథ అందించింది కూడా కార్తీక్ సుబ్బరాజే. అతడు ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. మరి సూర్యతో ఎటువంటి సినిమా తీశారో చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Embed widget