అన్వేషించండి

'శ్రీరంగనీతులు'తో వస్తున్న సుహాస్, పోస్టర్ చూశారా?

ప్ర‌వీణ్ కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్న హీరో సుహాస్ లేటెస్ట్ చిత్రం టైటిల్ పోస్టర్ రివీలైంది. 'శ్రీరంగనీతులు' అనే పేరుతో రిలీజైన ఈ మూవీ పోస్టర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Suhas: యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ఇటీవలే 'రైటర్ పద్మభూషణ్' గా అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా మారిన సుహాస్.. మరో కొత్త చిత్రానికి ఓకే చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ తాజాగా రివీల్ అయింది. ఈ సందర్భంగా 'శ్రీరంగనీతులు' అనే టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాకు ప్రవీణ్ కుమార్ విఎస్ఎస్ రచన, దర్శకత్వం వహిస్తున్నట్టు హీరో సుహాస్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ మూవీలో 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఫేమ్ కార్తీక్ రత్నం కూడా ఈ సినిమాలో భాగమవనున్నట్టు తెలుస్తోంది.

'శ్రీరంగనీతులు' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను రివీల్ చేసిన మేకర్స్.. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ముగ్గురు యువకులు అటు వైపు తిరిగి.. ఎదురుగా ఉన్న భారీ ఫ్లెక్సీపై పెద్ద పెద్ద అక్షరాలలో రాసిన 'శ్రీరంగనీతులు' అనే టైటిల్ ను చూస్తున్నట్టుగా ఉంది. ఈ టైటిల్ తో పాటు థియేటర్లలోకి త్వరలో రానుందని మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.  టైటిల్ క్యాచీగా ఉండ‌డంతో పాటు ఈ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటోంది. అతి త్వ‌ర‌లో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయ‌నున్నట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే సుహాస్ మరోసారి న్యాచురల్ అండ్ ఇంట్రస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్న 'శ్రీరంగనీతులు' చిత్రంలో సుహాస్ సరసన రుహాని శర్మ కథానాయికగా నటిస్తోంది. రాధావి ఎంట‌ర్టైన్‌మెంట్స్‌ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రం ద్వారా ప్ర‌వీణ్ కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని శ‌ర‌వేగంగా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా మేకర్స్ ఈ రోజు టైటిల్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhas (@suhassssssss)

`అర్జున్ రెడ్డి ` ఫేమ్  హ‌ర్ష వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, `సేవ్ ది టైగ‌ర్స్` ఫేమ్ అజ‌య్ అర్సాడ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి టిజో టామి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విరాజ్ అశ్విన్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గీత భాస్క‌ర్‌, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నునున్నారు. ఈ మూవీలో సుహాస్‌ తో పాటు కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గీత భాస్క‌ర్‌, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, దేవీ ప్ర‌సాద్, జీవ‌న్ రెడ్డి, సంజ‌య్ స్వ‌రూప్‌, సీవిఎల్ న‌ర‌సింహా రావు తదితరులు నటించనున్నారు.

Read Also: 'అన్నీ మంచి శకునములే' మూవీకి ‘ప్రాజెక్ట్ కె‘ సపోర్ట్ - అడగకుండానే ప్రజలకు సాయం, ఇదిగో వీడియో!

 మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి, 2018లో విడుదలైన 'పడి పడి లేచే మనసు' సినిమా ద్వారా సుహాస్ సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత 'మజిలీ', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'డియర్ కామ్రేడ్', 'ప్రతి రోజూ పండగే', 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' లాంటి సినిమాల్లోనూ ఆయన నటించారు. హీరోగా చేసిన 'కలర్ ఫొటో' సుహాస్ కు మంచి పేరు తీసుకువచ్చింది. సందీప్‌ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించారు. అంతే కాదు ఈ సినిమా జాతీయ అవార్డు అందుకుంది.

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: సీజన్‌ ఫస్ట్ లేడీ కెప్టెన్‌ ఝాన్సీ! త్రిగుణ్‌ని దారుణంగా ఆపేసిన గార్డ్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: సీజన్‌ ఫస్ట్ లేడీ కెప్టెన్‌ ఝాన్సీ! త్రిగుణ్‌ని దారుణంగా ఆపేసిన గార్డ్స్!
Agadha OTT: సడన్‌గా ఓటీటీ రిలీజ్‌కు కామాక్షి భాస్కర్ల 'అగధ'... ఎంఎస్ రాజు తీసిన మిస్టిక్ థ్రిల్లర్‌ను ఎందులో చూడొచ్చంటే?
సడన్‌గా ఓటీటీ రిలీజ్‌కు కామాక్షి భాస్కర్ల 'అగధ'... ఎంఎస్ రాజు తీసిన మిస్టిక్ థ్రిల్లర్‌ను ఎందులో చూడొచ్చంటే?
Panchanama Zee5: జీ5లో 'పంచనామా' ప్రభంజనం... ఉదయభాను నిర్మాణంలో 'ప్రేమిస్తే' భరత్ సిరీస్‌కు రికార్డు వ్యూస్
జీ5లో 'పంచనామా' ప్రభంజనం... ఉదయభాను నిర్మాణంలో 'ప్రేమిస్తే' భరత్ సిరీస్‌కు రికార్డు వ్యూస్
Hatah Teaser Review : బిగ్ బాస్ తనూజ హతః టీజర్ - సూపర్ థ్రిల్ పంచే స్టోరీ... హీరో కిరణ్ అబ్బవరం మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
బిగ్ బాస్ తనూజ హతః టీజర్ - సూపర్ థ్రిల్ పంచే స్టోరీ... హీరో కిరణ్ అబ్బవరం మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
Embed widget