Sudheer Babu: స్వలింగ సంపర్కుడి పాత్రపై స్పందించిన సుధీర్ బాబు.. ఏమన్నారంటే?
Sudheer Babu: యాక్టర్ సుధీర్ బాబు.. హంట్ సినిమాతో కొత్త ప్రయోగం చేశారు. దాంట్లో హోమో సెక్సువల్ గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ క్యారెక్టర్ చేయడంపై ఆ సినిమాపై తాజాగా స్పందించారు.
Sudheer Babu opens up about playing a homosexual in Hunt: హీరో సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన 'హంట్'. పదేళ్ల క్రితం మలయాళంలో రిలీజైన 'ముంబై పోలీస్' సినిమాకి రీమేక్ ఈ సినిమా. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరో. మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ, తెలుగులో ఈ సినిమా రీమేక్ అనుకున్నంతగా ఆడలేదు. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన హంట్ ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ సినిమాలో సుధీర్ బాబు కొత్త ప్రయోగం చేశారు. తెలుగు సినిమా హీరోల్లో ఎవ్వరూ చేయని హోమో సెక్సువల్ పాత్రలో నటించారు సుధీర్ బాబు. అయితే, ఆ పాత్ర చేయడంపై ఆయన తాజాగా స్పందించారు. హంట్ సినిమా గురించి మాట్లాడారు.
అంచనా వేయలేం..
సుధీర్ బాబు నటించిన 'హరోం హర' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయన 'హంట్' సినిమా గురించి ప్రస్తావించారు. “ ప్రేక్షకుల మా సినిమాని ఆదిస్తారు అనుకున్నాను. ఓపన్ మైండ్, తెలివిగా చూస్తారని ఆశించాము. కానీ అలా జరగలేదు. మార్చేందుకు ఛాన్స్ వచ్చినా కూడా మేం దాన్ని పెద్దగా మార్చలేదు. 'హంట్' సినిమాని ఒరిజనల్ తో పోల్చి చూస్తే మీకు అర్థం అవుతుంది. కాన్సెప్ట్ అలానే ఉంచాము కానీ, కొన్ని మార్పులు చేశాం. నిజానికి మనం అంచనా వేయలేం. 'ఉప్పెన' సినిమా స్క్రిప్ట్ నాకు ముందే తెలుసు. వర్కౌట్ అవ్వదు అనుకున్నాను. కానీ, సూపర్ హిట్ అయ్యింది. 'ఉప్పెన' స్క్రిప్ట్ చూసినప్పుడు నాకు అర్థం అయ్యింది ఏంటంటే? ప్రేక్షకుల టేస్ట్, వాళ్ల ఆలోచన మారిపోయింది. 'హంట్' రిస్క్‌తో కూడిన సినిమా. కానీ, అది బ్యాక్ ఫైర్ అయ్యింది. అందుకే, చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ లు ఎంచుకుంటున్నాను” అని అన్నారు సుధీర్ బాబు.
జనాలకి ఏది కావాలో అదే ఇవ్వాలి..
“ప్రేక్షకులకి ఏది కావాలో అదే మనం ఇవ్వాలి. ఈ సినిమా ఎక్స్ పరిమెంట్ అయినప్పటికే ముందుగానే ఆలోచించాల్సింది. 'ఉప్పెన'లో పాటలు, కమర్షియల్ ఎలిమెంట్స్, షాకింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మా సినిమాలో కూడా అలాంటివే ఇవ్వాల్సింది. ఇలాంటివి అనుసరిస్తేనే సినిమాలు సక్సెస్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను” అని 'హంట్' సినిమా గురించి అన్నారు సుధీర్ బాబు.
సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో 'మైమ్' గోపి, కబీర్ దుహాన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని, చిత్రా శుక్లా, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మహేశ్ దర్శకత్వం వహించగా వి ఆనంద ప్రసాద్ ప్రొడ్యూసర్. జిబ్రాన్ సంగీతం అందించారు.
జూన్ 14న రిలీజ్..
ఇక సుధీర్ బాబు నటించిన 'హరోం హర' సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది. ఒకేసారి ఏకంగా ఐదు భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషలో భారీ ఎత్తున ‘హరోం హర’ విడుదల కానుంది. ఈ సినిమాను 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్టుగా సమాచారం. జ్ఞానసాగర్ డైరెక్ట్ చేసిన ‘హరోం హర’లో సుధీర్ బాబుకు జోడీగా మాళవికా శర్మ నటించింది.
Also Read: సద్గురుని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న కంగనా రనౌత్