అన్వేషించండి

Sreeleela: రామ్‌తో ఇది మూడో సినిమా, అలా సెట్ అయ్యింది: శ్రీలీల

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల ‘స్కంద’ సినిమా గురించి చాలా చెప్పాలనుకొని ఆగిపోవడంతో ఈ మూవీలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయేమో అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు.

శ్రీలీల అప్‌కమింగ్ మూవీ ‘స్కంద’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ శనివారం జరిగింది. ఇందులో శ్రీలీల తన క్యూట్ స్పీచ్‌తో ఫిదా చేసింది. ‘స్కంద’ ప్రీ రిలీజ్ కోసం బాలకృష్ణ స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. ఈ ఈవెంట్‌లో హీరో రామ్, బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను.. ఇలా అందరి స్పీచ్‌లు ఆడియన్స్‌కు హై ఎనర్జీని ఇచ్చాయి. ఈ సందర్శంగా తమన్‌తో కలిసి శ్రీలీల స్టేజ్‌పై పాట కూడా పాడింది. ఈ భామ డ్యాన్స్ ఇరగదీస్తుంది అని తెలిసినా.. పాటలు కూడా బాగా పాడుతుంది అంటూ ఆడియన్స్ మరోసారి తన మల్టీ టాలెంట్స్‌కు ఫిదా అయిపోయారు. పాటతో మాత్రమే కాదు.. తన స్పీచ్‌తో కూడా అందరినీ ఆకట్టుకుంది.

‘భగవంత్ కేసరి’ గురించి ఇన్‌డైరెక్ట్ అప్డేట్..
ముందుగా స్పీచ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఫ్యాన్స్ అభిమానానికి చాలా థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. ఎంతో దూరం నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపింది. అలాంటి ఫ్యాన్స్‌ను సంతోషపెట్టడం కోసం తను పాట కూడా పాడానంది. స్టేజ్‌పై ఉన్న అందరిలో తనే చిన్న కాబట్టి చిన్న స్పీచ్ ఇద్దామనుకున్నానని, కానీ అది అనుకోకుండా చాలా పెద్దగా అవుతుందని సరదాగా మాట్లాడింది. స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన బాలయ్య గురించి చాలా మాట్లాడాలి అనుకుంది కానీ కేవలం ధన్యవాదాలు చెప్పి ఆపేసింది. మరో నెలలో మరో ప్రీ రిలీజ్ జరగబోతుందని అప్పుడు బాలయ్య గురించి కావాల్సినంత మాట్లాడతానని ‘భగవంత్ కేసరి’ మూవీ గురించి ఇన్‌డైరెక్ట్‌గా ఒక అప్డేట్ ఇచ్చేసింది. బాలయ్య హీరోగా నటిస్తున్న ‘భగవంత్ కేసరి’లో శ్రీలీల ముఖ్య పాత్ర పోషిస్తోంది.

రామ్, శ్రీలీల కాంబినేషన్‌లో మూడో సినిమా.!
‘స్కంద’ చిత్రంలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అందులో ‘మేజర్’ ఫేమ్ సయ్యి మంజ్రేకర్ కూడా ఒకరు. సయ్యి తనకు చెల్లి లాంటిదని శ్రీలీల తెలిపింది. ఎక్కడైనా ఔట్‌డోర్ షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు తనకు బేబి సిట్టింగ్ చేయాల్సి వచ్చేదని చెప్తూ సయ్యిని ఆటపట్టించింది. ఇక హీరో రామ్ గురించి మాట్లాడుతూ.. వారిద్దరూ కలిసి ఇంతకు ముందు రెండుసార్లు పనిచేయాల్సి ఉందని, కానీ కుదరలేదని బయటపెట్టింది. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో అవకాశం సెట్ అయ్యిందని, మూడు లక్కీ నెంబర్ కాబట్టి వర్కవుట్ అయ్యిందేమో అని చెప్పింది శ్రీలీల. ముఖ్యంగా ‘గాంధారబాయ్’ సాంగ్ షూటింగ్ అప్పుడు ఇద్దరం పోటాపోటీగా డ్యాన్స్ చేశామని చెప్తూ ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ చేసింది. ఆ సాంగ్‌లో ఒక షాట్ గురించి చెప్తూ ఆగిపోయి.. అందులో ప్రత్యేకంగా ఫ్యాన్స్‌కు ఏదో సర్‌ప్రైజ్ ఉన్నట్టు చెప్పకనే చెప్పింది. 

ఇంట్లో అందరూ శ్రీకాంత్ ఫ్యాన్సే..
‘స్కంద’లో చాలామంది ఆర్టిస్టులతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేసింది శ్రీలీల. శ్రీకాంత్ లాంటి సీనియర్ హీరోతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, తన ఇంట్లో ప్రతీ ఒక్కరూ శ్రీకాంత్ ఫ్యాన్స్ అని బయటపెట్టింది. అంతే కాకుండా శ్రీకాంత్ సినిమా టైటిల్‌తోనే తన కెరీర్‌ను ప్రారంభించానని గుర్తుచేసుకుంది. సెప్టెంబర్ 15న ‘స్కంద’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని, తప్పకుండా సినిమాను థియేటర్లలో చూడమని కోరుకుంటూ తన స్పీచ్‌ను ముగించింది శ్రీలీల.

Also Read: దేవరకొండ బ్రదర్స్ ‘అది నా పిల్ల’ డైలాగ్‌పై మీమ్ - ఫన్నీగా స్పందించిన విజయ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhurandhar 2 Telugu Trailer : ధురంధర్ 2 తెలుగు ట్రైలర్ - ఈ ప్రశ్నలకు సీక్వెల్‌లో ఆన్సర్
ధురంధర్ 2 తెలుగు ట్రైలర్ - ఈ ప్రశ్నలకు సీక్వెల్‌లో ఆన్సర్
NTR : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు తారక్ - దేవరకు కన్నడిగుల బిగ్ వెల్కమ్... న్యూ లుక్ చూశారా?
అప్పుడు సీనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు తారక్ - దేవరకు కన్నడిగుల బిగ్ వెల్కమ్... న్యూ లుక్ చూశారా?
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ENE Sequel Release Date : ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే? - డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కన్ఫర్మ్ చేసేశారుగా...
ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే? - డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కన్ఫర్మ్ చేసేశారుగా...

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget