అన్వేషించండి

Sreeleela: కొన్నాళ్లు షూటింగ్స్‌కు బ్రేక్ - ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ మీద శ్రీలీల కాన్సంట్రేషన్

Sreeleela: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో, వాటి ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న శ్రీలీల.. కొన్నాళ్లు అన్నింటికి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుందట. ఇక దాని వెనుక కారణం తెలిసి ఫ్యాన్స్ తనను ప్రశంసిస్తున్నారు.

Sreeleela break to Movies: ప్రస్తుతం తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ ఎవరు అని అడిగితే చాలామంది ప్రేక్షకులకు టక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. 22 ఏళ్ల భామ... ప్రస్తుతం టాలీవుడ్‌ను ఏలేస్తోంది. క్షణం కూడా తీరిక లేకుండా సినిమాలు చేస్తూ... నెలకొక మూవీతో థియేటర్లలో సందడి చేస్తోంది. శ్రీలీల స్పీడ్ చూస్తుంటే ప్రేక్షకులు మాత్రమే కాదు... ఇతర హీరోయిన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. సినిమాల్లో ఇంత బిజీగా ఉంటున్న సమయంలోనే తన చదువును కూడా పక్కన పెట్టకూడదు అనే ఉద్దేశంతో శ్రీలీల ఒక నిర్ణయానికి వచ్చిందట. అది విని తన ఫ్యాన్స్ అంతా తన ప్రశంసలు కురిపిస్తున్నారు.

మాస్ డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఫిదా!
శ్రీలీల... కేవలం మంచి యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా. ప్రస్తుతం తను ఎమ్‌బీబీస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. 2023 సెప్టెంబర్ నుండి ప్రతీ నెల ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరించింది శ్రీలీల. దీంతో తన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవ్వడానికి తనకు సమయం లేకపోయింది. రాఘవేంద్ర రావు నిర్మించిన ‘పెళ్లి సందడి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంటర్ అయిన శ్రీలీల... రవితేజతో చేసిన ‘ధమాకా’తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీలో తన డ్యాన్స్ చూసి అసలు టాలీవుడ్‌లో శ్రీలీలలాగా మాస్ డ్యాన్స్ చేసే హీరోయినే లేదని ప్రేక్షకులు ప్రశంసించడం మొదలుపెట్టారు. అలాగే తనకు చాలామంది ఫ్యాన్స్ అయ్యారు కూడా.

సెప్టెంబర్ నుండి దండయాత్ర..
2023 సెప్టెంబర్‌లో శ్రీలీల దండయాత్ర మొదలయ్యింది. సెప్టెంబర్‌లో రామ్‌తో నటించిన ‘స్కంద’తో థియేటర్లలో సందడి చేసింది. అక్టోబర్‌లో బాలయ్య హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’లో కీలక పాత్ర పోషించింది. నవంబర్‌లో మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో ‘ఆదికేశవ’లో కలిసి నటించింది. డిసెంబర్‌లో ‘ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్’లో హీరోయిన్‌గా కనిపించింది. ఇక ఫైనల్‌గా జనవరిలో మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’తో పలకరించింది. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల చేయడం కోసం శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు తన కమిట్‌మెంట్స్ అన్నీ అయిపోవడంతో చదువుపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యిందట ఈ భామ.

Also Read: నా సామి రంగ రివ్యూ: నాగార్జున సినిమా ఎలా ఉందంటే?

షూటింగ్స్ లేవు..
ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్, హరీష్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ సినిమా మాత్రమే ఉంది. ఇక ఈ షూటింగ్ చాలాకాలంగా పాస్‌లో ఉంది. దీంతో సినిమాల నుండి తనకు కాస్త బ్రేక్ దొరకడంతో ఎమ్‌బీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్‌పై శ్రీలీల ఫోకస్ మొదలు పెట్టనుంది. ఎంతో కాలంగా శ్రీలీల సినిమా నుండి బ్రేక్ తీసుకుంటుందని, చదువుపై దృష్టిపెట్టనుందని వార్తలు వస్తుండగా.. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో ఉన్న కమిట్‌మెంట్స్ అన్నీ అయిపోవడంతో ఇక కొన్నాళ్ల పాటు శ్రీలీల స్క్రీన్‌పై కనిపించదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఓవైపు సినిమాల్లో బిజీ హీరోయిన్‌గా ఉంటూ కూడా సమయం రాగానే పూర్తిగా తన స్టడీస్ వైపు షిఫ్ట్ అయిపోవడంతో ఈ యంగ్ బ్యూటీపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: అమెరికాలో 'నా సామి రంగ' ఎర్లీ ప్రీమియర్ షోలు పడలేదు - ఎందుకంటే?

టాప్ హెడ్ లైన్స్

Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
Lenin Collections : 100 కోట్ల క్లబ్‌లో లెనిన్ - అక్కినేని యంగ్ హీరో కెరీర్‌లో ఫస్ట్ మూవీ
100 కోట్ల క్లబ్‌లో లెనిన్ - అక్కినేని యంగ్ హీరో కెరీర్‌లో ఫస్ట్ మూవీ
Srinivasa Mangapuram Review - 'శ్రీనివాస మంగాపురం' రివ్యూ: ఘట్టమనేని వారసుడు... మహేష్ అన్నయ్య కొడుకు సినిమా ఎలా ఉందంటే?
'శ్రీనివాస మంగాపురం' రివ్యూ: ఘట్టమనేని వారసుడు... మహేష్ అన్నయ్య కొడుకు సినిమా ఎలా ఉందంటే?
Ramayana Trailer : మా హనుమాన్ ఎక్కడ? - రామాయణ ట్రైలర్‌లో కీలక పాత్ర మిస్సింగ్... నెటిజన్స్ ప్రశ్నల వర్షం
మా హనుమాన్ ఎక్కడ? - రామాయణ ట్రైలర్‌లో కీలక పాత్ర మిస్సింగ్... నెటిజన్స్ ప్రశ్నల వర్షం

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Embed widget