అన్వేషించండి

7/G Movie: వివాదంలో సోనియా అగర్వాల్‌ మూవీ, ఆ టైటిల్ పెట్టొద్దంటూ బెదిరిపులు

సోనియా అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం '7/G' వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీకి '7/G' అనే టైటిల్ పెట్టకూడదంటూ ఆగంతకులు బెదిరిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

నటి సోనియా అగర్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. ఆమె తాజాగా '7/G' అనే చిత్రంలో నటిస్తోంది. శృతి, వెంకట్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సోనియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈచిత్రంలో ఆమె దయ్యం క్యారెక్టర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హరూన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రం ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. అంతేకాదు, దర్శకుడికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ '7/G' వివాదం ఏంటంటే?

2004లో సోనియా అగర్వాల్‌ ‘7/G రెయిన్ బో కాలనీ’ అనే సినిమాలో నటించింది. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. తెలుగులో ఈ చిత్రం ‘7/G బృందావన కాలనీ’గా విడుదలైంది. ఇక్కడ కూడా మంచి వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా నటిస్తున్న చిత్రానికి '7/G' అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా చిత్ర దర్శకుడికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. సినిమాకు ఆ టైటిల్ పెట్టకూడదని హెచ్చరిస్తున్నారట. ఒకవేళ కాదని అలాగే పెడితే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారట.

బెదిరింపు కాల్స్ పై స్పందించిన దర్శకుడు హరూన్‌

'7/G' టైటిల్ కు సంబంధించి వస్తున్న బెదిరింపులపై దర్శకుడు హరూన్ స్పందించారు.  “'7/G' చిత్రం  దెయ్యం ఇతివృత్తంతో తెరకెక్కుతోంది. హర్రర్‌ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నాను. '7/G' అనే టైటిల్ ను ఇప్పటి వరకు ఎవరూ రిజిస్టర్ చేయించలేదు. అందుకే, ఈ సినిమాకు ఆ పేరు పెట్టాను. ఈ సినిమా కథకు '7/G' అనే టైటిల్ బాగా సూట్ అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే, ఈ సినిమాకు '7/G' టైటిల్ పెట్టకూడదని కొందరు బెదిరిస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు ఫోన్ కాల్స్ చేసి హెచ్చరించారు. పేరు మార్చకపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు. ఎవరు ఎన్ని బెదిరింపు కాల్స్ చేసినా మేం వెనక్కి తగ్గేది లేదు. టైటిల్ ను మార్చం. ఈ వ్యవహారాన్ని కోర్టులో చూసుకుంటాం” అని వెల్లడించారు.

ఈ నెలలోనే '7/G' విడుదల

'7/G' చిత్రంలో రోషన్ బషీర్, నటుడు-దర్శకుడు సుబ్రమణ్య శివ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి  సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందిస్తున్నారు.  హరూన్  డ్రీమ్ హౌస్ బ్యానర్ సహకారంతో ఈ సినిమా రూపొందుతోంది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘7/G’ (7/G Movie) ఈ సెప్టెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సోనియా అగర్వాల్ గురించి..

దర్శకుడు సెల్వ రాఘవన్‌ తెరకెక్కించిన ‘కాదల్‌కొండేన్‌’ సినిమాతో హీరోయిన్ గా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది సోనియా అగర్వాల్ (Sonia Agarwal). ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో ధనుష్‌ సరసన హీరోయిన్ గా నటించింది.  ఆ తర్వాత ‘7/G రెయిన్ బో కాలనీ’ సినిమాలో నటించింది. ఈ సినిమాలు మంచి హిట్ అందుకోవడంతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత దర్శకుడు సెల్వరాఘవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగు ఏండ్ల పాటు సంసార జీవితాన్ని కొనసాగించి, ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు.    

Read Also: క్రేజీ న్యూస్ చెప్పిన ‘పెదకాపు’ మేకర్స్ - ట్రైలర్ విడుదల ఎప్పుడంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget