Sivakumar: శాలువా విసిరిగొట్టిన హీరో సూర్య తండ్రి - అసలు విషయం ఇదేనంటూ క్లారిటీ
Sivakumar: సూర్య తండ్రి శివకుమార్ తాజాగా ఒక వ్యక్తిపై శాలువా విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. దానిపై క్లారిటీ ఇవ్వడానికి ముందుకొచ్చారు.
Sivakumar: తాజాగా తమిళ హీరో సూర్య తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. ఒక అభిమాన పట్ల ఆయన దురుసు ప్రవర్తనే దీనికి కారణం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి.. శివకుమార్‌కు శాలువా అందజేసే ప్రయత్నం చేస్తుండగా.. దానిని ఆయన చేతుల్లో నుండి లాక్కొని శివకుమార్ కింద పడేశారు. ఇది చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి శివకుమార్ అభిమాని అని ఫిక్స్ అయిపోయిన నెటిజన్లు.. అభిమాన పట్ల ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు. ఇక ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి స్వయంగా శివకుమారే ఒక వీడియోను విడుదల చేశారు.
50 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్..
శివకుమార్‌తో పాటు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు కరీమ్ అని తెలుస్తోంది. శివకుమార్ మాత్రమే కాదు.. కరీమ్ మనవడు రిఫాయ్ కూడా ఈ విషయంపై తన సోషల్ మీడియోలో చెప్తూ అసలు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు. ‘వార్తలో చూపిస్తున్న ఆ పెద్దమనిషి మరెవరో కాదు మా తాత. శివకుమార్, ఆయన గత 50 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్. శాలువా ఇస్తున్న సమయంలో ఎందుకు రా ఇవన్నీ అని జోక్‌గా చెప్తూ దానిని తీసుకొని విసిరేశారు. ఆ తర్వాత పదా వెళ్దాం అని పిలుచుకొని వెళ్లారు. మెట్లు దిగిన తర్వాత నీ దగ్గరే ఉండనివ్వు అని శివకుమార్ మా తాతకు చెప్పారు. మా తాత కరైకుడీలో ఉంటారు. శివకుమార్ అక్కడికి గెస్ట్‌గా వెళ్లారు. శివకుమార్ మా ప్రతీ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వస్తారు, మా ఇంటికి కూడా చాలాసార్లు వచ్చారు. ఆయన ఇంటికి కూడా మేము చాలాసార్లు వెళ్లాము. నిజమేంటో తెలియకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు’ అని కరీమ్ మనవడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
It's proven that #Sivakumar act was just propaganda as they both knew exactly what happened & he himself said sorry with ego. That's the man of humanity and simplicity. Let the media stop spreading false news.#Humanity pic.twitter.com/16DPnSUvAD
— Abishek (@ItsAbishek04) February 28, 2024
నా తప్పే..
ఇక తాను, కరీమ్ ఎంత క్లోజ్ అని ఒక వీడియో ద్వారా బయటపెట్టారు శివకుమార్. ఒకరి పెళ్లిని మరొకరు దగ్గరుండి జరిపించామని గుర్తుచేసుకున్నారు. అంతే కాకుండా ఈ వీడియోలో.. కొత్తగా తనకు శాలువా తీసుకొచ్చాడని, అది తనకు నచ్చక తిరిగి కరీమ్‌కే ఇచ్చేశానని అన్నారు శివకుమార్. అలాంటివి తనకు నచ్చవని చెప్పారు. ఆరోజు తను విశ్రాంతి లేకుండా ఉన్నారని, స్పీచ్ కూడా కష్టంగా ఇచ్చానని తెలిపారు. అన్ని ముగించుకొని బయటికి వచ్చి చూస్తే నాకు శాలువా వేసుకోవడం ఇష్టం లేదని తెలిసినా కూడా కరీమ్ చేతిలో శాలువా పట్టుకొని నిలబడ్డారని చెప్పారు. శివకుమార్ మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్న కరీమ్.. ‘‘మా ఇంట్లో వాళ్లు అప్పుడే చెప్పారు శాలువా తీసుకువెళ్లొద్దని.. అయినా తీసుకువెళ్లడం నా తప్పే’’ అని అన్నారు. ‘‘తెలిసి శాలువా తీసుకురావడం తన తప్పు అయితే.. దానిని అలా కిందపడేయడం నా తప్పే. దానికి నేను సారీ ఫీల్ అవుతున్నానని’’ క్షమాపణ చెప్పారు శివకుమార్.
ஐயா சிவகுமார் & ஐயா கரீம் அவர்களின் விளக்கம் ..!#Sivakumar pic.twitter.com/l45VsT2ehm
— 🅹🅿 (@jayaprakashtpm) February 27, 2024
పాత ఫోటోలు వైరల్..
శివకుమార్, కరీమ్ కలిసి క్లారిటీ ఇచ్చిన వీడియోలో చాలా ఏళ్ల క్రితం వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా జతచేర్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో తప్పుడు సమాచారం వల్ల సీనియర్ నటుడిపై ఆగ్రహం వ్యక్తం చేశామంటూ తమిళ ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఇక శివకుమార్ పేరు ట్రెండింగ్‌లో ఉండడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కొందరు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు.
Also Read: దానికోసమే ఇల్లు అమ్మేశాను, నా ఫేవరెట్ దర్శకుడు ఆయనే - ప్రశాంత్ నీల్