అన్వేషించండి

Prashanth Neel: దానికోసమే ఇల్లు అమ్మేశాను, నా ఫేవరెట్ దర్శకుడు ఆయనే - ప్రశాంత్ నీల్

Prashanth Neel: పాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. ఇండస్ట్రీకి పరిచయమయ్యి పదేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా తన ఫేవరెట్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఎవరో బయటపెట్టారు.

Prashanth Neel About Ugramm Movie: కన్నడ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా మొదలయిన ప్రశాంత్ నీల్ ప్రయాణం.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ‘సలార్’తో తన పేరును, శాండిల్‌వుడ్ పేరును దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌కు పరిచయం చేశారు ప్రశాంత్. దానికంటే ముందు తను తెరకెక్కించిన ‘ఉగ్రం’ కూడా ఒక కమర్షియల్‌ డైరెక్టర్‌గా తనకు మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. తాజాగా ఈ మూవీ విడుదలయ్యి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా దీని గురించి గుర్తుచేసుకున్నారు ప్రశాంత్ నీల్. అంతే కాకుండా తన ఫేవరెట్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఎవరు అనే విషయాలను బయటపెట్టారు.

జీవిత పాఠం నేర్పింది..

‘ఉగ్రం’ అనే సినిమాతో కన్నడ సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రశాంత్ నీల్. అప్పటివరకు కన్నడ ప్రేక్షకులు ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాను చూడలేదు. అందుకే ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యింది. మొదటి వారంలోనే రూ.5.5 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. అయితే ఈ సినిమా తనకొక జీవిత పాఠాన్ని నేర్పిందని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. ‘కేజీఎఫ్’ విడుదలయిన తర్వాత ‘ఉగ్రం’కు మరింత ఆదరణ దక్కాల్సింది అనే ఉద్దేశ్యంతోనే కథకు కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రభాస్, పృథ్విరాజ్‌తో కలిసి ‘సలార్’ చేశానని బయటపెట్టారు. ‘ఉగ్రం’ నుండి నేర్చుకున్న అనుభవాలు తన జీవితానికి సరిపడా ఉన్నాయని స్టేట్‌మెంట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్.

ఇల్లు అమ్మేశాను..

కన్నడ సినీ పరిశ్రమలో ‘ఉగ్రం’ వల్లే మూవీ మేకింగ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఆ సినిమా తెరకెక్కించాలని నిర్ణయించుకున్న తర్వాత ప్రొడక్షన్ కోసం అనుకున్న దానికంటే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని ప్రశాంత్ నీల్ గుర్తుచేసుకున్నారు. అంతే కాకుండా ఒక కొత్త టీమ్‌ను కూడా ఏర్పాటు చేసుకొని సినిమా చేయాలనుకున్నారు. ‘ఉగ్రం’ కోసం తన ఇంటిని కూడా అమ్మేయాల్సి వచ్చిందని బయటపెట్టారు. ఇక కష్టపడి మూవీ పూర్తిచేసిన తర్వాత కూడా దానిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరూ రాలేదట. కొన్నాళ్ల తర్వాత దర్శన్, దినకర్ తూగుదీప ముందుకొచ్చి.. తమ తూగుదీప డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ‘ఉగ్రం’ను విడుదల చేశారు.

వారే నా ఫేవరెట్..

ఇక ఆయన ఫేవరెట్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ గురించి కూడా ప్రశాంత్ వర్మ రివీల్ చేశాడు. ‘‘నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ఉపేంద్ర. ఇది కన్నడ షో అని నేను ఆయన పేరు చెప్పడం లేదు. ఆయన సినిమాలు ష్, థార్లే నాన్ మగా, ఓమ్ లాంటి మూడు వేర్వేరు జోనర్లలో తెరకెక్కాయి. అలాంటివి ప్రయత్నించడం దర్శకుడికి చాలా కష్టం. కానీ ఉపేంద్ర చేసి చూపించారు’’ అని ఉపేంద్ర గురించి చెప్పుకొచ్చారు ప్రశాంత్. అంతే కాకుండా తన ఫేవరెట్ హీరో, హీరోయిన్ గురించి మాట్లాడుతూ.. అమితాబ్ బచ్చన్, శ్రీదేవి.. తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తర్వాతి సినిమాల గురించి పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు.

Also Read: అలా అడగాలంటే కన్ను, కిడ్నీ దానం చేయండి - నేను చేస్తున్నది నాకే నచ్చలేదు: రానా దగ్గుబాటి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Embed widget