అన్వేషించండి

Siddharth: అందుకే దక్షిణాది నటులు ఆల్కహాల్ యాడ్స్ చేయరు: సిద్ధార్థ్

నటుడు సిద్ధార్థ్ ఆల్కహాల్ యాడ్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సౌత్ నటులు ఈ యాడ్స్ చేయడానికి ఇష్టపడరని, దానికి కారణం రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులని వెల్లడించారు.

Siddharth About Alcohol Ads: విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా, దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘భారతీయుడు 2’. ఈ మూవీ రేపు (జులై 12న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్దార్థ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని సహా పలువురు నటిస్తున్నారు.

వారి వల్లే ఆల్కహాల్ యాడ్స్ చేయట్లేదు- సిద్దార్థ్

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఓ జాతీయ చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నటుడు సిద్ధార్థ్. ఈ షోలో సౌత్ యాక్టర్స్ ఆల్కహాల్ కమర్షియల్‌లలో ఎందుకు కనిపించరు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు కీలక విషయాలు వెల్లడించారు. తాము సౌత్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ అడుగు జాడల్లో నడుస్తామని, అందుకే ఆల్కహాల్ యాడ్స్ లో నటించమని చెప్పారు.

“సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ ప్రజలకు హాని కలిగించే యాడ్స్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఆల్కహాల్, స్మోకింగ్, పాన్ మసాలా లాంటి యాడ్స్ చేయడం లేదు. వాళ్లు తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. ఒకవేళ వాళ్లు ఆ యాడ్స్‌లో నటించి ఉంటే సౌత్‌లో మిగతా నటీనటులు కూడా చేసే వాళ్లు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్లు సౌత్ ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం. వాళ్లిద్దరు యువ నటీనటులకు మార్గదర్శకంగా ఉన్నారు. వారి అడుగు జాడల్లోనే మేమూ నడుస్తున్నాం” అని వెల్లడించారు.  

దర్శకుడు శంకర్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది- సిద్ధార్థ్

అటు ‘భారతీయుడు 2’ గురించి సిద్ధార్థ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దశాబ్దాల తర్వాత దర్శకుడు శంకర్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. “ఏ నటుడు అయినా, దర్శకుడు శంకర్ తో ఇట్టే కనెక్ట్ అవుతాడు. ఒక తరానికి మొత్తం గుర్తుండిపోయే సినిమాలను ఆయను తెరకెక్కిస్తారు. నటీనటులను తనకు కావాల్సిన రీతిలో మలుచుకుని అద్భుత చిత్రాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనతో పాటు కమల్ సర్ తో కలిసి పని చేయడం గొప్ప అనుభూతిని కలిగించింది” అని సిద్ధార్థ్ తెలిపారు.  

జులై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

జులై 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. గత నెలలో ‘భారతీయుడు 2’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. ‘భారతీయుడు’ చిత్రాన్ని మించి ఈ సినిమా సక్సెస్ అవుతుందని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.

 

Read Also: ‘కల్కీ 2898 ఏడీ’ రిలీజ్‌కు ముందు మూడు రోజులు నిద్రలేదు - ‘కంగువా’ నిర్మాత కామెంట్స్ వైరల్

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget